Major: Adivi Sesh Clarity On Movie Ticket Rates In Two Telugu States Deets Here - Sakshi
Sakshi News home page

Major Movie Ticket Prices: తెలుగు రాష్ట్రాల్లో మేజర్‌ టికెట్‌ రేట్స్‌ ఇలా ఉండనున్నాయి

May 27 2022 9:15 PM | Updated on May 28 2022 12:16 PM

Adivi Sesh Clarity On Major Movie Ticket Rates In Two Telugu States - Sakshi

దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్‌ సందీప్‌ కృష్ణన్‌’ ఒకరు. 26/11 ముంబయ్‌ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్‌ ఆర్మీ ఆఫీసర్‌ ‘సందీప్‌ ఉన్నికృష్ణన్‌’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్‌’. సందీప్‌ పాత్రను యంగ్‌ హీరో అడివి శేష్‌ పోషించాడు. శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో పాన్‌ ఇండియన్‌ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. మేజర్‌ రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుంటంతో హీరో అడివి శేష్‌ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌ అందించాడు.

చదవండి: ఒటీటీకి ‘సర్కారు వారి పాట’, అంతకు ముందే స్ట్రీమింగ్‌?

ఇది మన సినిమా అని అందుకే అందరికి అందుబాటు ధరల్లో మేజర్‌ను తీసుకువస్తు‍న్నట్లు అప్‌డేట్‌ ఇస్తూ.. టికెట్‌ ధరల పట్టికను షేర్‌ చేశాడు. ఈ మేరకు శుక్రవారం అడివి శేష్‌ ట్వీట్‌ చేస్తూ ‘ఇది మన సినిమా. అందుకే అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సినిమా టికెట్‌ ధరలను నిర్ణయించాం’అని పేర్కొన్నాడు. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మేజర్‌ టికెట్‌ రేట్స్‌ ఇలా ఉండనున్నాయి. సింగిల్‌ స్క్రీన్‌: తెలంగాణ-రూ. 150 కాగా  ఏపీ- రూ. 147; మల్టీప్లెక్స్‌: తెలంగాణ-రూ. 195, ఏపీ-రూ. 177గా ఉండనున్నాయి.

చదవండి: ‘సమంత అలా ఒంటరిగా చనిపోవాలి’ కామెంట్‌పై సామ్‌ ఏమన్నదంటే..

ఇదిలా ఉంటే తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో రానున్న ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రివ్యూలు ఉండబోతున్నాయి. ఈ సినిమాను పది రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా ఉన్న (హైదరాబాద్‌ ఏఎమ్‌బీ సహా) 9 ప్రధాన నగరాల్లో మేజర్‌ ప్రివ్యూ ప్రదర్శించనున్నారు. మే 24 నుంచి రోజుకో సెంటర్‌లో మేజర్‌ రిలీజ్‌ కానుంది. కాగా మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇందులో అడవి శేష్‌ జోడిగా సయూ మంజ్రేకర్‌ నటించగా.. శోభితా ధూళిపాళ్ల, ప్రకాశ్‌ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement