మాట నిలబెట్టుకున్నాను: అడివి శేష్‌ ఆసక్తికర ట్వీట్‌ | Adivi Sesh Tweet On Major Movie Fourth Week In Theaters | Sakshi
Sakshi News home page

Adivi Sesh: అప్పుడు హామీ ఇచ్చాను.. ఇప్పుడు అదే చేశాను: హీరో ఆసక్తికర ట్వీట్‌

Published Sat, Jun 25 2022 4:36 PM | Last Updated on Sat, Jun 25 2022 4:37 PM

Adivi Sesh Tweet On Major Movie Fourth Week In Theaters - Sakshi

యంగ్‌ హీరో అడివి శేష్‌ ప్రస్తుతం మేజర్‌ మూవీ సక్సెస్‌ జోష్‌లో ఉన్నాడు. శశి కిరణ్‌ తిక్క దర్శకత్వంలో అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ మూవీ హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన రియల్‌ హీరో మేజర్ సందీప్‌ ఉన్నీకృష్ణన్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మేజర్‌ సందీప్‌ పాత్రలో అడివి శేష్‌ ఒదిగిపోయి ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించాడు. ఇక ఈ సినిమాపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు జల్లు కురిపించాడు. ఇక ఈ మూవీ విడుదలై నాలుగో వారంలోకి అడుగు పెట్టింది.

చదవండి: ఫిలిం జర్నలిస్ట్‌తో స్టార్‌ డైరెక్టర్‌ నిశ్చితార్థం, ఫొటోలు వైరల్‌

ఇప్పటికీ మేజర్‌ చిత్రం థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా అడివి శేష్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. ‘మేజర్‌ చిత్రాన్ని థియేటర్లోకి తీసుకువస్తానని కరోనా సంక్షోభంలో మాట ఇచ్చాను. నా మాట నిలబెట్టుకున్నాను కూడా. మేజర్‌ సినిమా రిలీజై ఇది నాలుగవ వారం. ఈ నాలుగో వారం కూడా మేజర్‌ థియేటర్లో సందడి చేస్తుంది’ అంటూ రాసుకొచ్చాడు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌ బాలీవుడ్‌ సాయి ముంజ్రేకర్‌ నటించగా మేజర్‌ సందీప్‌ తల్లిదండ్రులుగా ప్రకాశ్‌ రాశ్‌, సీనియర్‌ నటి రేవతిలు కనిపించారు. ఇక శోభితా ధూలిపాళ్ల, మురళీ వర్మ, అనీస్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 

చదవండి: 7/G బృందావన్ కాలనీ హీరోయిన్‌తో ఎస్పీ చరణ్‌ పెళ్లా?, ఫొటో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement