‘‘నా కెరీర్‌లో నేను ఎక్కువగా ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేయడం వల్లనేమో నన్ను అందరూ సీరియస్‌గానే చూస్తున్నారు. కానీ నేను చాలా హ్యాపీ గాళ్‌ని. నాకు సరదాగా, ఫన్నీగా ఉండే అమ్మాయి పాత్రలు కూడా చేయాలని ఉంది’’ అన్నారు శోభితా ధూళిపాళ్ల. అమరవీరుడు సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్’. ఇందులో సందీప్‌గా అడివి శేష్ నటించారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమాను మహేశ్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌లతో కలిసి సోనీ పిక్చర్ ఫిలింస్ నిర్మించింది. ‘మేజర్’ చిత్రం జూన్ 3న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన శోభితా ధూళిపాళ్ల చెప్పిన విశేషాలు.
► మా ఫ్యామిలీలో సినిమా వాతావరణం లేదు. కాలేజీ తర్వాత మిస్ ఇండియా గెలిచాను. ఉత్సాహంగా మోడలింగ్ చేశాను. మోడలింగ్ నచ్చింది కానీ ఆ వర్క్ ఇస్తున్న తృప్తి నా మనసుకు సరిపోలేదు. నటన అంటే నాకు ఇష్టం అని ఆడిషన్స్ వల్ల తెలుసుకున్నాను. ఆ తర్వాత యాక్టింగ్‌తో ప్రేమలో పడిపోయా. నాకు నచ్చిన పని చేస్తూ అందరితో మెప్పు పొందగలుగుతున్నాను. లైఫ్‌లో ఇంతకంటే ఏం కావాలి!
ఇక గ్లిజరిన్ అవసరం లేదు
‘మేజర్’లో బందీ అయిన ఎన్‌ఆర్‌ఐ యువతి ప్రమోద పాత్ర చేశాను. 26/11 దాడులు జరిగినప్పుడు ఎంతో భయాన్ని, బాధను బందీలు అనుభవించి ఉంటారు. వారిలా ఆలోచించి ఈ సినిమా చేశా. నా కెరీర్‌లో ఇప్పటివరకు కన్నీళ్ల కోసం గ్లిజరిన్ వాడలేదు. ప్రమోద పాత్ర చేశాక ఇక యాక్టర్‌గా లైఫ్‌లో నాకు గ్లిజరిన్ అవసరం ఉండదేమో అనిపిస్తోంది. ఇది అంత బరువైన, భావోద్వేగంతో కూడిన పాత్ర.
మహేశ్‌గారు ఆ భరోసా ఇచ్చారు
మేజర్ సందీప్ తల్లిదండ్రులు తమ కొడుకు జీవితం ఆధారంగా తీసిన ‘మేజర్’ను చూసి గర్వపడాలని అడివి శేష్ కష్టపడి చేశారు. దర్శకుడు శశి కాన్ఫిడెంట్ అండ్ ఎమోషనల్ పర్సన్. కరోనా టైమ్‌లో ‘మేజర్’ ఓటీటీకి వెళ్తుందా? అనే భయం కలిగింది కానీ నిర్మాత మహేశ్‌బాబుగారు ఇది థియేట్రికల్ ఫిల్మ్.. థియేటర్స్‌లోనే రిలీజ్ చేద్దామని భరోసా ఇచ్చారు.
అది నేరవేరినందుకు హ్యాపీ
ఒక హిస్టారికల్ ఫిల్మ్ చేయాలనే నా ఆకాంక్ష ‘పొన్నియిన్ సెల్వన్’తో నెరవేరింది. ఈ సినిమా వల్ల మణిరత్నంగారితో వర్క్ చేయగలిగే అదృష్టం కలిగింది నాకు. హాలీవుడ్‌లో నేను చేసిన ‘మంకీ మాన్’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఓటీటీలో ‘మేడిన్ ఇన్ హెవెన్’ సెకండ్ సీజన్, బ్రిటిష్ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ హిందీ అడాప్షన్ వెబ్ సిరీస్ చేస్తున్నాను.
చదవండి 👉🏾 ఆస్కార్ కొత్త రూల్స్.. ఈ థియేటర్స్‌లో బొమ్మ పడాల్సిందేనట!
టీజర్: సక్సెస్ అయితే నీ లవర్‌తో, ఫెయిల్ అయితే పక్కోడి లవర్‌తో పెళ్లి!
Comments
Please login to add a commentAdd a comment