అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా? | Naga Chaitanya Fiance Sobhita Dhulipala Old Pic News | Sakshi
Sakshi News home page

Guess The Actress: హీరోతో పెళ్లికి రెడీ.. పెద్దింటి కోడలు కాబోతుంది!

Published Sun, Aug 11 2024 12:01 PM | Last Updated on Sun, Aug 11 2024 12:51 PM

Naga Chaitanya Fiance Sobhita Dhulipala Old Pic News

ఇండస్ట్రీల నిలబడాలంటే హీరోలకు హిట్స్ ఉండాలి. హీరోయిన్లకు అందం ఉండాలి. దీని కోసం మేకప్ దగ్గర నుంచి మేకోవర్ వరకు ఇలా చాలానే ఉంటాయి. కొన్ని విషయాల గురించి సదరు నటీనటులు పెద్దగా బయటపెట్టరు. కానీ ఒకప్పటి, ఇప్పటి ఫొటోలు పక్కపక్కన పెట్టి చూస్తే ఈ తేడా కనిపిస్తుంది.

తాజాగా హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నాడు. హీరోయిన్ సమంతకు విడాకులు ఇచ్చేసిన దాదాపు మూడేళ్ల తర్వాత మరోసారి పెళ్లి బంధంలోకి చైతూ అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే ఇతడికి కాబోయే భార్య శోభిత గురించి ఫ్యాన్స్ బాగానే మాట్లాడుకుంటున్నారు. అలానే ఈమె పాత ఫొటోలని కూడా ట్రెండింగ్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: చైతూ-శోభిత లవ్ స్టోరీ.. సీక్రెట్ బయటపెట్టిన శోభిత చెల్లి!)

పైన ఫొటో శోభితదే. కాకపోతే దాదాపు పదేళ్ల క్రితం ఫెమినా మిస్ ఇండియా, ఫెమినా మిస్ ఇండియా ఎర్త్-2013 పోటీల్లో పాల్గొన్నప్పుడు శోభిత ఒకలా ఉంది. ఇప్పుడు చూస్తే మరోలా ఉంది. దీంతో అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడానో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఈమె ఒక్కరేనా అని తెలిసి అవాక్కవుతున్నారు.

శోభిత కెరీర్ విషయానికొస్తే.. స్వతహాగా తెలుగమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్‌లో కెరీర్ మొదలుపెట్టింది. తెలుగులో అడివి శేష్ హీరోగా చేసిన 'గూఢచారి', 'మేజర్' చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. పలు వెబ్ సిరీసుల్లోనూ లీడ్ రోల్స్ చేసిన ఈమె ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులేం చేయట్లేదు. పెళ్లి తర్వాత నటిగా కొనసాగుతుందా? లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్!

(ఇదీ చదవండి: పెళ్లి బంధానికి పూర్తి న్యాయం చేశా.. కానీ: సమంత)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement