
సమంత ఇప్పుడేం సినిమా చేయట్లేదు. కానీ సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుంచి ట్రెండింగ్ అవుతోంది. దీనికి కారణం నాగచైతన్య ఎంగేజ్‌మెంట్. ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతూ-సమంత.. 2021లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఏదో సందర్భంలో వీళ్ల డివోర్స్ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఇప్పుడు చైతన్య, శోభితతో నిశ్చితార్థం చేసుకోవడంతో సమంత పాత వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: నిన్న ఎంగేజ్‌మెంట్.. ఇప్పుడు పెళ్లిలో కనిపించిన నాగచైతన్య)
'ఏ మాయ చేశావె' సినిమాతో చైతూ-సమంత ఒకరికొకరు పరిచయం. కొన్నాళ్లకు స్నేహం కాస్త ప్రేమగా మారింది. కుటుంబాల్ని ఒప్పించి 2017లో ఒక్కటయ్యారు. కానీ నాలుగేళ్లకే వీరి పెళ్లి పెటాకులైంది. కారణం ఏంటనేది పక్కనబెడితే విడాకులు తర్వాత సమంత పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. తాను 'పుష్ప'లో ఐటమ్ సాంగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ ఏమన్నారో చెప్పుకొచ్చింది. ఇంతకీ సమంత అప్పుడు ఏమని చెప్పిందంటే?
'విడిపోయిన తర్వాత నా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు.. ఇప్పుడెందుకు ఐటమ్ సాంగ్ చేస్తున్నావ్, వద్దు ఇంట్లో కూర్చో అని అన్నారు. చాలా విషయాల్లో ప్రోత్సాహించే నా స్నేహితులు కూడా ఐటమ్ సాంగ్ వద్దంటే వద్దని అన్నారు. ఇదంతా విన్న తర్వాత.. అసలు నేనెందుకు దాక్కోవాలి? నేనేం తప్పు చేయలేదుగా, పెళ్లి అనే బంధానికి పూర్తిగా న్యాయం చేశా. కానీ వర్కౌట్ కాలేదు. అంతమాత్రన నేను చేయని తప్పునకు గిల్టీగా ఫీలై, నన్ను నేనే బాధపెట్టుకోలేనుగా' అని సమంత చెబుతున్న పాత వీడియో ఒకటి మళ్లీ వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: చైతూ- శోభిత తొలిసారి అక్కడే కలుసుకున్నారా?)
Samantha: “Why should I hide, I DID NOT DO ANY WRONG. I gave my marriage 100%” pic.twitter.com/JbKc945bHm
— BigBoss Telugu Views (@BBTeluguViews) August 9, 2024