
అక్కినేని హీరో నాగచైతన్య నిశ్చితార్థం తాజాగా జరిగింది. హీరోయిన్ శోభితతో పెళ్లికి రెడీ అయిపోయాడు. ఈ వేడుక హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్‌గా జరిగింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే నాగచైతన్య.. తన అసిస్టెంట్ పెళ్లిలో కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: చైతూతో ఎంగేజ్‌మెంట్.. శోభిత ఎమోషనల్ పోస్ట్!)
'తండేల్' సినిమాతో బిజీగా ఉన్న నాగచైతన్య.. శోభితతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. గత కొన్నాళ్లుగా రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు అధికారికంగా ప్రకటించేశారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే రాజమండ్రి వెళ్లిన చైతూ.. తన అసిస్టెంట్ వెంకటేశ్ పెళ్లికి హాజరయ్యాడు. నూతన వధూవరుల్ని దీవించాడు.
(ఇదీ చదవండి: చైతూ- శోభిత తొలిసారి అక్కడే కలుసుకున్నారా?)
Comments
Please login to add a commentAdd a comment