Mahesh Babu Launched Adivi Sesh Major Movie Telugu Trailer, Watch Trailer Inside - Sakshi
Sakshi News home page

Major Movie Trailer: ఎమోషనల్‌గా 'మేజర్‌' ట్రైలర్‌.. రిలీజ్ చేసిన మహేశ్ బాబు

Published Mon, May 9 2022 5:40 PM | Last Updated on Mon, May 9 2022 8:02 PM

Mahesh Babu To Launch The Adivi Sesh Major Trailer - Sakshi

Mahesh Babu To Launch The Adivi Sesh Major Trailer: దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్‌ సందీప్‌ కృష్ణన్‌’ ఒకరు. 26/11 ముంబయ్‌ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్‌ ఆర్మీ ఆఫీసర్‌ ‘సందీప్‌ ఉన్నికృష్ణన్‌’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్‌’. సందీప్‌ పాత్రను యంగ్‌ హీరో అడివి శేష్‌ పోషించాడు. శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో పాన్‌ ఇండియన్‌ మూవీగా రూపొందిన ఈ చిత్రం జూన్‌ 3న మేజర్‌ విడుదలవుతున్నట్లు ఇటీవల చిత్రయూనిట్‌ ప్రకటించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను సోమవారం (మే 9) రిలీజ్‌ చేశారు. 

ఈ ట్రైలర్‌ను ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరోతో విడుదల చేయించారు మేకర్స్‌. తెలుగు ట్రైలర్‌ను సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబు రిలీజ్‌ చేయగా, హిందీలో సల్మాన్‌ ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్ విడుదల చేశారు. ఆద్యంతం ఎమోషనల్‌గా సాగిన ఈ ట్రైలర్‌లో మేజర్‌ ఉన్నికృష్ణన్ జీవితం, ఉగ్రవాదులతో పోరాటం తదితర సంఘటనలను చాలా బాగా చూపించారు. 'ఒక్క ప్రాణం పోయిన నన్ను నేను సోల్జర్ అనుకోలేను', 'ప్రతి అమ్మ ఇలానే ఆలోచిస్తుంది' వంటి తదితర డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. 


చదవండి: ‘మేజర్‌’ ట్రైలర్‌ను చూసిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement