విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. హీరోగా చేసినవి తక్కువ సినిమాలే అయినా.. ఎక్కువ గుర్తింపును సంపాదించిపెట్టాయి. తాజాగా అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం మేజర్. 26\11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణణ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. మహేశ్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, ఏ ప్లస్ ఏస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలైంది. తొలి రోజు నుంచి ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకెళ్తోంది.
(చదవండి: మేజర్ మూవీ రివ్యూ)
తొలి రోజు ఈ చిత్రం రూ.7.12 కోట్ల షేర్, 13.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించగా.. రెండో రోజు అంతకంటే ఎక్కువ వసూళ్లను రాబట్టి రికార్డు స్థాయిలో దూసుకెళ్తోంది. రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.24.5 కోట్ల గ్రాస్, రూ.13.48 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇది అడివి శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్. ఈ చిత్రానికి నార్త్‌లో కలెక్షన్స్ రెండో రోజు 50 శాతం పెరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ ఈ చిత్రం వసూలు రెండో రోజు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో త్వరలోనే 1 మిలియన్ క్లబ్బులో చేరేందుకు సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రూ.14.93 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే..రూ.15 కోట్ల షేర్ రాబట్టాలి. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈచిత్రంలో సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ హీరోయిన్స్‌గా నటించగా, ప్రకాశ్ రాజ్, రేవతి ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
#Major sees a huge 50% jump in Hindi circuits today (Day 2), compared to yesterday (Day 1)..
— Ramesh Bala (@rameshlaus) June 4, 2022
Good content always prevails.. 👌 @AdiviSesh
Comments
Please login to add a commentAdd a comment