యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్‌ఎస్‌జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈమూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాష్లో రిలీజ్‌కు రెడీ అయ్యింది.
చదవండి: బిగ్‌బాస్ తెలుగు నాన్‌స్టాప్‌లో పాయల్ సపోర్ట్ ఎవరికో తెలుసా?
ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన మేజర్ ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న మేజర్ విడుదలవుతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్రం బృందం తాజాగా మేజర్ నుంచి రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేసింది. సెకండ్ సింగిల్ పేరుతో విడుదల చేసిన ఈ పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
చదవండి: హీరో పెళ్లి వేడుకలు షురూ.. స్టెప్పేసిన నాని, సందీప్ కిషన్
‘ఓ ఇషా’ అంటూ సాగే ఈ పాటలో హీరో హీరోయిన్ల మధ్య పరిచయం, ప్రేమ, పెళ్లి.. ఆ తర్వాత హీరో ఆర్మీలో చేరడం అక్కడ ఒకరిని గురించిన ఆలోచనలతో ఒకరు ఉండటం వంటి రొమాంటి సన్నివేశాలను చూపించారు. కాగా మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇందులో అడవి శేష్ జోడిగా సయూ మంజ్రేకర్ నటించగా.. శోభితా ధూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. ‘ శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment