
Adivi Sesh Major Movie Trailer Release Date Announced: దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను యంగ్ హీరో అడివి శేష్ పోషించాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న మేజర్ విడుదలవుతున్నట్లు ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించింది.
ఈ క్రమంలో 'మేజర్' సినిమా ట్రైలర్ విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. ఓ వీడియో రూపంలో మే 9న ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. చిత్రంలో హీరోయిన్లుగా సయూ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ కనిపించనున్నారు. ఓ ప్రత్యేకమైన పాత్రలో రేవతి అలరించనున్నారు.
చదవండి: ప్రజలను ప్రేమించడమే దేశభక్తి!
Comments
Please login to add a commentAdd a comment