Major Movie Team Meets Maharashtra CM Uddhav Thackeray, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Major Movie: మహారాష్ట్ర సీఎంను కలిసిన మేజర్‌ టీమ్‌

Published Mon, Jun 13 2022 10:50 AM | Last Updated on Mon, Jun 13 2022 12:04 PM

Major Movie Meets Maharashtra CM Uddhav Thackeray - Sakshi

మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్‌. అడివి శేష్‌, సాయి మంజ్రేకర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహించాడు. అనురాగ్‌, శరత్‌ నిర్మించారు. జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి కలెక్షన్లతో పాటు ప్రశంసలు సైతం లభిస్తున్నాయి. మేజర్‌ మూవీ అద్భుతంగా తీశారంటూ చిత్రయూనిట్‌పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు జనాలు.

తాజాగా మేజర్‌ యూనిట్‌ సభ్యులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేను కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే మేజర్‌ సినిమాను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. మేజర్‌ ఒక మామూలు సినిమా కాదన్నారు. ఉగ్రదాడుల్లో ప్రజలను కాపాడేందుకు తన ప్రాణాన్ని అడ్డేసిన మేజర్‌ జీవిత కథను వెండితెరపై తెరకెక్కించిన విధానానికి చప్పట్లు కొట్టాల్సిందేనన్నారు.

చదవండి: మాజీ భర్త మోసం చేస్తే సల్మాన్‌ సాయం చేశాడు
హీరోయిన్‌ సురభి ధరించిన లెహంగా ధరెంతో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement