
Mahesh Babu Comments On Bollywood: బాలీవుడ్ పరిశ్రమపై సూపర్ స్టార్ మహేశ్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం జరిగిన మేజర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మహేశ్‌కు బాలీవుడ్ ఎంట్రీపై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బాలీవుడ్ తనని భరించలేదని, అక్కడ సినిమాలు చేసి టైం వెస్ట్ చేయనంటూ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చాడు. సౌత్ సూపర్ స్టార్ అయిన మహేశ్ బాబు బాలీవుడ్ ఎంట్రీపై ఎప్పటినుంచో ఆసక్తి నెలకొంది. ఆయన హిందీలో ఓ సినిమా చేయాలని అటూ నార్త్‌తో పాటూ సౌత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే
ఈ క్రమంలో ఆయన తన హిందీ డెబ్యుపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘హిందీ పరిశ్రమ నుంచి నాకు ఆఫర్లు బాగానే వచ్చాయి. కానీ నన్ను వారు భరించగలరని అనుకోవడం లేదు. నన్ను భరించలేని పరిశ్రమలో పనిచేయడం టైం వేస్ట్ చేసుకోవమే అవుతుంది. ఇక్కడ నాకు బాగానే ఆఫర్స్ వస్తున్నాయి. అంతేగాక టాలీవుడ్ నాకు మంచి గుర్తింపు, గౌరవం, స్టార్ డమ్ ఇచ్చింది. దీనిపట్ల చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే, నా పరిశ్రమను విడిచి మరేదో ఇండస్ట్రీకి పని చేయాలనే ఆలోచన నాకు లేదు. సినిమాలు చేయాలని, మరింత ఎత్తుకు ఎదగాలని ఎప్పుడూ అనుకుంటాను. నా కల ఇప్పుడు నెరవేరుతోంది’ అంటూ మహేశ్ వివరణ ఇచ్చాడు.
చదవండి: తల్లి కాబోతున్న మరో హీరోయిన్.. కొత్త ఫీలింగ్స్ అంటూ ఎమోషనల్ పోస్ట్
కాగా మహేశ్ బాబు నిర్మాతగా వ్యవహరించిన మేజర్ మూవీ జూన్ 3న విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే ఆయన తాజాగా నటించిన ‘సర్కారు వారి పాట’ ఈ నెల 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయికగా చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, కళావతి, ఎవ్రీ పెన్ని సాంగ్స్ వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్, ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment