Adivi Sesh Major Movie: Completes Censor, Awarded With UA Certificate, Details Check Here - Sakshi
Sakshi News home page

Adivi Sesh Major Movie: సెన్సార్‌ పూర్తి, ‘సందీప్‌ ఉన్నికృష్ణన్‌’కు సభ్యుల స్టాండింగ్‌ ఒవేషన్‌

Published Tue, May 24 2022 8:31 PM | Last Updated on Wed, May 25 2022 8:52 AM

Adivi Sesh Major Movie Completes Censor, Awarded With UA Certificate - Sakshi

దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్‌ సందీప్‌ కృష్ణన్‌’ ఒకరు. 26/11 ముంబయ్‌ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్‌ ఆర్మీ ఆఫీసర్‌ ‘సందీప్‌ ఉన్నికృష్ణన్‌’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్‌’. సందీప్‌ పాత్రను యంగ్‌ హీరో అడివి శేష్‌ పోషించాడు. శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో పాన్‌ ఇండియన్‌ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని జూన్‌ 3న  ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న విషయం తెలిసిందే.

చదవండి: ఆఫర్ల కోసం చాలామంది హీరోయిన్లు కమిట్మెంట్ ఇస్తారు: డైరెక్టర్‌

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్‌ను సెన్సార్ బోర్డ్ ప్రశంసిచినట్లుగా చిత్ర బృందం పేర్కొంది. అంతేకాదు ఈ సినిమా చివరిలో సెన్సార్‌ బోర్డు సభ్యులు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చి సందీప్‌ ఉన్నికృష్ణన్‌కు సెల్యూట్‌ చేసినట్లు సమాచారం. అనంతరం ఈ సినిమాలో అడివి శేష్ యాక్టింగ్‌కు ప్రత్యేక అభినందనులు తెలిపారట సెన్సార్ బోర్డ్ సభ్యులు.

చదవండి: ‘నా భర్త వల్ల ప్రాణహాని ఉంది’.. పోలీసులను ఆశ్రయించిన నటి

ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వారు కితాబిచ్చినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. సెన్సార్ బోర్డ్ సభ్యులు మేజర్ చిత్రానికి మంచి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంతో చిత్ర యూనిట్ సంతోషంలో మునిగితేలుతోంది. ఇక ఈ సినిమాను రిలీజ్ కంటే ముందుగా తొలిసారి పలు నగరాల్లో ప్రీమియర్ షోలు వేయనుండటం విశేషం. కాగా ఈ చిత్రంలో సాయీ మంజ్రేకర్, శోభితా ధూలిపాల, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళి శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement