
‘మేజర్’ ఆపరేషన్‌ను అడివి శేష్ రీ స్టార్ట్ చేయనున్నారు. అడివి శేష్ హీరోగా నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియన్ మూవీ ‘మేజర్’. అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ‘గుఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే 90 శాతం పూర్తయిన ఈ సినిమా షూటింగ్ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది.
షూటింగ్‌ను వచ్చే నెల జూలైలో తిరిగి ఆరంభించనున్నట్లు అడివి శేష్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘‘హిమాచల్ ప్రదేశ్‌లోని చిట్కుల్ ప్రాంతంలో ఏడాది క్రితం ‘మేజర్’ షూటింగ్‌ను మొదలుపెట్టాం. అక్కడి విజువల్స్, అక్కడి వారితో నాకు ఉన్న అనుభవాలు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. వచ్చె నెలలో చిత్రీకరణను తిరిగి మొదలు పెట్టనున్నాం’’ అంటూ ఈ చిత్రనిర్మాతల్లో ఒకరైన శరత్‌తో తాను లాక్‌డౌన్‌కి ముందు ‘మేజర్’ లొకేషన్‌లో దిగిన స్టిల్‌ను కూడా షేర్ చేశారు అడివి శేష్.