‘మేజర్‌’ అప్‌డేట్‌ : అడివి శేష్‌, సయీ మంజ్రేకర్‌ లుక్‌ వైరల్‌ | Adivi Sesh Shares First Look Of Major Movie Actress Saiee Manjrekar | Sakshi
Sakshi News home page

‘మేజర్‌’ అప్‌డేట్‌ : అడివి శేష్‌, సయీ మంజ్రేకర్‌ లుక్‌ వైరల్‌

Published Sun, Apr 4 2021 2:28 PM | Last Updated on Sun, Apr 4 2021 2:34 PM

Adivi Sesh Shares First Look Of Major Movie Actress Saiee Manjrekar - Sakshi

ఫ్రాంక్‌ ఆంథోనీ పబ్లిక్‌ స్కూల్‌లో అడ్మిషన్‌ తీసుకున్నారు హీరో అడివి శేష్, హీరోయిన్‌ సయీ మంజ్రేకర్‌. వీరిద్దరూ స్కూల్‌లో చేరింది ‘మేజర్‌’ సినిమా కోసమే. వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది. సందీప్‌ చిన్ననాటి విశేషాలను కూడా సినిమాలో చూపించనున్నారు. ‘గూఢచారి’ ఫేమ్‌ శశికిరణ్‌ తిక్క ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలోని శేష్, సయీల క్యారెక్టర్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే ‘మేజర్‌’ టీజర్‌ను ఏప్రిల్‌ 12న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.

‘‘శౌర్యం, ధైర్యానికి పేరుగాంచిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ వీరమరణం పొందిన ఘటనలను మాత్రమే కాకుండా, ఆయన వ్యక్తిగత జీవితంలోని ఇతర సంఘటనలను కూడా ఈ సినిమాలో చూపించనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. మహేశ్‌బాబు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘మేజర్‌’ సినిమా జూలై 2న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement