
దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను యంగ్ హీరో అడివి శేష్ పోషించాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కావాల్సింది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ని ప్రకటించింది చిత్ర యూనిట్. మే 27వ తేదీన థియేటర్లలో విడుదల చేసినట్టు తాజాగా ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం.
మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. శోభితా ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు.
Witness the Might of Major on Big Screens 💪#MajorTheFilm worldwide release on 27 May, 2022 🔥🔥#MajorOnMAY27 @AdiviSesh @saieemmanjrekar @SashiTikka #SriCharanPakala @sonypicsindia @urstrulyMahesh @GMBents @AplusSMovies @ZeeMusicsouth pic.twitter.com/JpAqhhSFLI
— GMB Entertainment (@GMBents) February 4, 2022
Comments
Please login to add a commentAdd a comment