‘‘ఓ మ్యూజిక్ డైరెక్టర్‌గా నా కెరీర్‌లో ఇంత తొందరగా ఓ బయోపిక్‌కు పని చేస్తానని నేను అనుకోలేదు. ‘మేజర్’కి సంగీతం అందించడంతో నా కలల్లో ఒక కల నిజమైనట్లుగా భావిస్తున్నా’’ అన్నారు శ్రీ చరణ్ పాకాల. అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్’. ఈ చిత్రంలో సందీప్‌గా అడివి శేష్ నటించారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా, శోభితా ధూళిపాళ్ల కీలక పాత్రలో కనిపిస్తారు. మహేశ్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌లతో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ – ‘‘అడివి శేష్ దర్శకత్వంలో వచ్చిన ‘కిస్’ మ్యూజిక్ డైరెక్టర్‌గా నా తొలి సినిమా. ఆ తర్వాత ‘క్షణం, గూఢచారి, ఎవరు’ చిత్రాలు చేశాను. థ్రిల్లింగ్, యాక్షన్, ఎమోషన్, లవ్‌స్టోరీ.. ఇలా అన్ని అంశాలు ‘మేజర్’లో ఉన్నాయి. 26/11 దాడుల గురించి నాకు అవగాహన ఉంది. బయోపిక్ కావడంతో జాగ్రత్తగా మ్యూజిక్ కంపోజ్ చేశాను. ఈ చిత్రంలో నాలుగు పాటలు ఉన్నాయి. అన్నీ డిఫరెంట్. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడంలో కిక్ ఉంటుంది. ‘ఇట్లు... మారేడుమిల్లి ప్రజానీకం’, ‘క్షణం’, ‘గూఢచారి 2’, ‘తెలిసినవాళ్ళు’, కన్నడ ‘ఎవరు’ రీమేక్, దర్శకుడు విజయ్ కనకమేడల సినిమా.. ఇలా ఆరేడు చిత్రాలకు సంగీతం అందిస్తున్నాను’’ అన్నారు.
చదవండి 👇
బిగ్‌బాస్ షో ద్వారా బిందు ఎంత వెనకేసిందంటే?
పుష్ప మూవీ సమంత వల్లే హిట్ అయ్యింది
Comments
Please login to add a commentAdd a comment