sricharan
-
ఆ ఇమేజ్ ఇబ్బందిగానే ఉంది: సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల
కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సత్యభామ’. ఓ కీలక పాత్రలో నవీన్‌చంద్ర నటించారు. సుమన్ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం విలేకర్ల సమావేశంలో ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ– ‘‘ఓ పోలీసాఫీసర్ ఎమోషనల్ జర్నీయే ఈ చిత్రం.థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి ‘సత్యభామ’ చిత్రం బాగా నచ్చుతుంది. ఈ సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. కాజల్, నవీన్‌చంద్రల మధ్య ‘కళ్లారా చూసాలే..’ అనే లవ్‌సాంగ్ ఉంటుంది. అలాగే ‘వెతుకు వెతుకు’ పాట ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఉంటుంది. ఈ పాటను కీరవాణిగారు పాడారు. గతంలో ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ సినిమాకు నా మ్యూజిక్‌లో కీరవాణిగారు పాడారు. ‘సత్యభామ‘ పాటకు ఆయన స్టూడియోకు వస్తూనే ‘నేను పాడిన ఏ పాట విని నన్ను నీ పాటకు పాడేందుకు పిలిచావ్’ అని అడిగారు. లిరిక్స్ అందించిన చంద్రబోస్‌గారు కూడా పాట పూర్తయ్యేంతవరకు చర్చిస్తూనే ఉన్నారు.‘సత్యభామ’లో ఓ ఇంగ్లిష్ సాంగ్ కూడా ఉంది. ఇతర పాటలను త్వరలోనే విడుదల చేస్తాం. నేను థ్రిల్లర్ మూవీస్‌కు ఎక్కువగా పని చేస్తాననే పేరొచ్చింది. ఈ ఇమేజ్ నాకు ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే మొత్తం థ్రిల్లర్ మూవీస్‌కు నేనే సంగీతం అందించడం లేదు. చెప్పాలంటే.. ‘కృష్ణ అండ్ హిస్ లీల, డీజే టిల్లు, గుంటూరు టాకీస్’ వంటి లవ్ అండ్ కమర్షియల్ చిత్రాలకూ సంగీతం అందించాను. కానీ థ్రిల్లర్స్ మ్యూజిక్ డైరెక్టర్ అనే ముద్ర వచ్చేసింది. నాకైతే అన్ని జానర్ సినిమాలకూ సంగీతం అందించాలని ఉంది. ప్రస్తుతం ‘గూఢచారి 2’కు పని చేస్తున్నాను. మరో నాలుగైదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు. -
ఎన్నికల ఫలితాలపై ఉష శ్రీ చరణ్ కీలక వ్యాఖ్యలు
-
అలా జడ్జ్ చేయడం బాధగా ఉంది
‘‘మంచి మ్యూజిక్ ఇవ్వడానికి ఖరీదైన మ్యూజిక్ పరికరాలు అవసరం లేదు. ‘క్షణం’, ‘మేజర్’లో కొన్ని సీన్లకు మేం ఫోన్లో రికార్డ్ చేసిన వాయిస్‌నే వాడాం. ఇక ఇప్పుడు యూ ట్యూబ్ వ్యూస్, ఇన్‌స్టా రీల్ వ్యూస్‌తో మ్యూజిక్ డైరెక్టర్స్‌ను జడ్జ్ చేయడం కాస్త బాధగా ఉంది. అందుకే ఇప్పుడు నేను సినిమాలు తగ్గించుకున్నాను. ఇండిపెండెంట్ మ్యూజిక్, ఆల్బమ్స్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నాను’’ అని అన్నారు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల. రోషన్ కనకాల, మానస జంటగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రూ΄÷ందిన సినిమా ‘బబుల్గమ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ– ‘‘గడిచిన పదేళ్లలో నేను చేయాల్సింది చేశాను. ఇక నన్ను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ‘బబుల్గమ్’తో ఈ ప్రయత్నం మొదలైంది. ఈ సినిమాలో హీరోది డీజే రోల్. నా ఫ్రెండ్స్‌లో ఎక్కువమంది డీజేలు ఉండటంవల్ల ఎలక్ట్రానిక్ మ్యూజిక్‌పై అవగాహన ఉంది. ట్యూన్ కంటే లిరిక్స్ ముఖ్యమని నమ్ముతాను. ‘బబుల్గమ్’ చూశాను. రోషన్ మంచి నటుడు, డ్యాన్సర్. డబ్బింగ్ కూడా బాగా చెప్పాడు. ప్రస్తుతం ‘సత్యభామ’, ‘గూఢచారి 2’ సినిమాలకు సంగీతం అందిస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘ప్రతి రంగంలోనూ సాంకేతిక విప్లవం వచ్చింది. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల మ్యూజిక్ కం΄ోజర్స్కు ప్రమాదం ఉండొచ్చు. కానీ ‘ఏఐ’ని అప్లై చేయడానికీ హ్యూమన్ టచ్ కావాలి. సప్తస్వరాలు ఏడే. సౌండింగ్ ఎలా ఇస్తున్నామన్నదే ముఖ్యం. ‘గూఢచారి’ వల్ల కాదు.. ‘కృష్ణ అండ్ హీజ్ లీల’ సినిమాలోని మ్యూజిక్ నచ్చి నాకు చాన్స్‌లు ఇచ్చినట్లుగా కొందరు నాతో చెప్పారు. నాకదో హ్యాపీ సర్ప్రైజ్’’ అని చెప్పుకొచ్చారు. -
నా కల నేరవేరింది: శ్రీ చరణ్ పాకాల
‘‘ఓ మ్యూజిక్ డైరెక్టర్‌గా నా కెరీర్లో ఇంత తొందరగా ఓ బయోపిక్కు పని చేస్తానని నేను అనుకోలేదు. ‘మేజర్’కి సంగీతం అందించడంతో నా కలల్లో ఒక కల నిజమైనట్లుగా భావిస్తున్నా’’ అన్నారు శ్రీ చరణ్ పాకాల. అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్’. ఈ చిత్రంలో సందీప్‌గా అడివి శేష్ నటించారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్గా, శోభితా ధూళిపాళ్ల కీలక పాత్రలో కనిపిస్తారు. మహేశ్‌బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌లతో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ – ‘‘అడివి శేష్ దర్శకత్వంలో వచ్చిన ‘కిస్’ మ్యూజిక్ డైరెక్టర్‌గా నా తొలి సినిమా. ఆ తర్వాత ‘క్షణం, గూఢచారి, ఎవరు’ చిత్రాలు చేశాను. థ్రిల్లింగ్, యాక్షన్, ఎమోషన్, లవ్‌స్టోరీ.. ఇలా అన్ని అంశాలు ‘మేజర్’లో ఉన్నాయి. 26/11 దాడుల గురించి నాకు అవగాహన ఉంది. బయోపిక్ కావడంతో జాగ్రత్తగా మ్యూజిక్ కంపోజ్ చేశాను. ఈ చిత్రంలో నాలుగు పాటలు ఉన్నాయి. అన్నీ డిఫరెంట్. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడంలో కిక్ ఉంటుంది. ‘ఇట్లు... మారేడుమిల్లి ప్రజానీకం’, ‘క్షణం’, ‘గూఢచారి 2’, ‘తెలిసినవాళ్ళు’, కన్నడ ‘ఎవరు’ రీమేక్, దర్శకుడు విజయ్ కనకమేడల సినిమా.. ఇలా ఆరేడు చిత్రాలకు సంగీతం అందిస్తున్నాను’’ అన్నారు. చదవండి 👇 బిగ్‌బాస్ షో ద్వారా బిందు ఎంత వెనకేసిందంటే? పుష్ప మూవీ సమంత వల్లే హిట్ అయ్యింది -
వాట్సాప్ మెసేజ్: సారీ డాడీ.. ఎలా చెప్పాలో తెలియట్లేదు..
స్టేషన్‌ఘన్‌పూర్: ఎక్కువ సమయం సెల్ఫోన్లో వీడియో గేమ్స్ ఆడొద్దని తండ్రి మందలించాడని ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నా డు. అంతకు ముందు ‘సారీ.. డాడీ’ అంటూ తండ్రి కి వాట్సాప్ సందేశం పంపాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఉప్పుగల్లుకు చెందిన కోరు కొప్పుల రాజు, అనిత దంపతుల కుమారుడు శ్రీచరణ్‌గౌడ్ పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. లాక్డౌన్ కారణంగా ఇంటి వద్దే ఉంటున్న శ్రీచరణ్ ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతుండటంతో తండ్రి ఆదివారం మందలించాడు. మనస్తాపానికి గురైన శ్రీచరణ్ ఆదివారం రాత్రి భోజనం చేశాక కుటుంబసభ్యులు నిద్రపోయే వరకు ఉండి, రాత్రి 11 గంటలకు బైక్‌పై స్టేషన్‌ఘన్‌పూర్ వెళ్లాడు. 12.54 గంటలకు తండ్రి ఫోన్‌కు ‘ఐయామ్ వెరీ సారీ డాడీ.. అమ్మ, చెల్లెను బాగా చూసుకో’అని వాట్సాప్ మెస్సేజ్ పంపాడు. రాత్రి 1.10 గంటలకు ‘ఐయామ్ వెరీవెరీ సారీ డాడీ.. నా సమస్యను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. డాడీ, మమ్మీ, చెల్లి మేఘీ ఐ మిస్ యూ’అంటూ మరోసారి మెసేజ్ పంపాడు. రాత్రి 1.15 గంటలకు రైల్వేస్టేషన్ లొకేషన్ షేర్ చేశాడు. నిద్రలో ఉండటంతో ఎవరూ చూడలేదు. రాత్రి 1.20 గంటలకు ఘన్పూర్ రైల్వే స్టేషన్లో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం సెల్లో మెస్సేజ్‌లు చూసిన రాజు హుటాహుటిన ఘన్‌పూర్‌కు వెళ్లే సరికి కుమారుడి తల, మొండెం విడిపోయి విగతజీవుడై పడి ఉండటంతో బోరున విలపించాడు. (చదవండి: రేఖ హత్య: సూత్రధారి మాలా.. ఎన్నికల కోసమేనా?!) -
స్నేహితుడిని కాపాడమంటూ సంగీత దర్శకుడి అభ్యర్థన
టాలీవుడ్ సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన స్నేహితుడిని కాపాడమంటూ సినీప్రముఖులను అభ్యర్థిస్తున్నాడు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ట్వీట్ చేశాడు. 'ఫొటోగ్రాఫర్‌గా ఎదుగుతున్న నా స్నేహితుడు జీవన్ కిశోర్ వర్మ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని రక్షించేందుకు సాయం చేయండి. నేను నా వంతు సాయం అందించాను. దయచేసి మీరు కూడా మీ వంతు కృషి చేయండి' అంటూ తన స్నేహితులు సత్యదేవ్, అడివి శేష్, కోనవెంకట్‌ను వేడుకున్నాడు. దీనిపై సత్యదేవ్ స్పందిస్తూ తన వంతు సాయం చేశాను అని రిప్లై ఇచ్చాడు. కాగా జీవన్ వైద్యానికి సుమారు 10 లక్షల రూపాయల వరకు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా వారికి తోచిన సాయం అందిస్తున్నారు. కాగా శ్రీచరణ్ పాకాల 'కిస్' సినిమాతో తన కెరీర్‌ను ఆరంభించినప్పటికీ 'క్షణం' చిత్రంతో పేరు సంపాదించుకున్నాడు. 'పీఎస్వీ గరుడ వేగ', 'గూఢచారి', 'అశ్వత్థామ', 'నాంది' చిత్రాలు అతడికి మరింత పాపులారిటీ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం అతడు 'మేజర్'తో పాటు 'తిమ్మరుసు' సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. A friend of mine who is a budding photographer met with an accident and fighting for Life. We need a helping hand to save his life. I've done my part. Request you to spread the word @ActorSatyaDev @vamsikaka @AdiviSesh @konavenkat99https://t.co/cfJUltnJFF — Sricharan Pakala (@SricharanPakala) June 6, 2021 చదవండి: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ అంజలి -
క్యాట్ - 2016లో మెరిసిన ప్రకాశం జిల్లా వాసి
మార్కాపురం: క్యాట్-2016 ప్రవేశ పరీక్షలో ప్రకాశం జిల్లా వాసి మెరిశాడు. మార్కాపురానికి చెందిన గొంట్లా వెంకట శ్రీచరణ్ 99.1 శాతం మార్కులను సాధించాడు. క్యాట్ 2015 ప్రవేశ పరీక్షల్లో శ్రీచరణ్‌కు 97.3 శాతం మార్కులు రాగా కళాశాలలో సీటు రాలేదు. దీంతో 2016 అర్హత పరీక్షలు రాయగా 99.1 శాతం మార్కులు వచ్చాయని అతని తండ్రి రాంబాబు తెలిపారు. శ్రీచరణ్ గౌహతిలో ఐఐటీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఒరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పారు. -
శ్రీచరణ్, ప్రత్యూష్ శతకాలు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యూష్ కుమార్ (125), శ్రీచరణ్ (102 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో ఎ-డివిజన్ వన్డే లీగ్ చాంపియన్‌షిప్‌లో గ్రీన్‌ల్యాండ్స్ జట్టు 155 పరుగుల భారీ తేడాతో నోబుల్ టీమ్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గ్రీన్‌ల్యాండ్స్ వికెట్ నష్టానికి 253 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నోబుల్ 98 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌లో రాణించిన శ్రీచరణ్ బౌలింగ్‌లోనూ 24 పరుగులకు 4 వికెట్లు తీశాడు. ఇతర మ్యాచ్‌ల స్కోరు వివరాలు ఎస్కే బ్లూస్: 239/9; హసన్ 94, సుమన్ 39, ఇంద్రనీల్ 3/42); ఏబీ కాలనీ: 184/9 (సతీష్ 77, అశ్విన్ 4/33). డెక్కన్ కోల్ట్స్: 202/3 (సంతోష్ 89, ప్రతీక్ 59); యాదవ్ డెయిరీ: 206/5 (పురుషోత్తమ్ నాయక్ 35, అభిషేక్ 58, సూర్యతేజ 61). ఎ-డివిజన్ త్రీడే లీగ్ స్కోరు వివరాలు ఎర్నాకులమ్: 208/4 (అభిషేక్ 37, చైతన్య 90); ఎవర్గ్రీన్తో మ్యాచ్