అలా జడ్జ్‌ చేయడం బాధగా ఉంది | Music Director Sricharan Pakala at Bubblegum Interview | Sakshi
Sakshi News home page

అలా జడ్జ్‌ చేయడం బాధగా ఉంది

Published Thu, Dec 28 2023 6:22 AM | Last Updated on Thu, Dec 28 2023 6:22 AM

Music Director Sricharan Pakala at Bubblegum Interview - Sakshi

‘‘మంచి మ్యూజిక్‌ ఇవ్వడానికి ఖరీదైన మ్యూజిక్‌ పరికరాలు అవసరం లేదు. ‘క్షణం’, ‘మేజర్‌’లో కొన్ని సీన్లకు మేం ఫోన్‌లో రికార్డ్‌ చేసిన వాయిస్‌నే వాడాం. ఇక ఇప్పుడు యూ ట్యూబ్‌ వ్యూస్, ఇన్‌స్టా రీల్‌ వ్యూస్‌తో మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ను జడ్జ్‌ చేయడం కాస్త బాధగా ఉంది. అందుకే  ఇప్పుడు నేను సినిమాలు తగ్గించుకున్నాను. ఇండిపెండెంట్‌ మ్యూజిక్, ఆల్బమ్స్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నాను’’ అని అన్నారు సంగీత దర్శకుడు శ్రీచరణ్‌ పాకాల. రోషన్‌ కనకాల, మానస జంటగా రవికాంత్‌ పేరేపు దర్శకత్వంలో రూ΄÷ందిన సినిమా ‘బబుల్‌గమ్‌’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరీ మూవీస్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రీచరణ్‌ పాకాల మాట్లాడుతూ– ‘‘గడిచిన పదేళ్లలో నేను చేయాల్సింది చేశాను. ఇక నన్ను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ‘బబుల్‌గమ్‌’తో ఈ ప్రయత్నం మొదలైంది. ఈ సినిమాలో హీరోది డీజే రోల్‌. నా ఫ్రెండ్స్‌లో ఎక్కువమంది డీజేలు ఉండటంవల్ల ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌పై అవగాహన ఉంది. ట్యూన్‌ కంటే లిరిక్స్‌ ముఖ్యమని నమ్ముతాను. ‘బబుల్‌గమ్‌’ చూశాను. రోషన్‌ మంచి నటుడు, డ్యాన్సర్‌. డబ్బింగ్‌ కూడా బాగా చెప్పాడు. ప్రస్తుతం ‘సత్యభామ’, ‘గూఢచారి 2’ సినిమాలకు సంగీతం అందిస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘ప్రతి రంగంలోనూ సాంకేతిక విప్లవం వచ్చింది. ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) వల్ల మ్యూజిక్‌ కం΄ోజర్స్‌కు ప్రమాదం ఉండొచ్చు. కానీ ‘ఏఐ’ని అప్లై చేయడానికీ హ్యూమన్‌ టచ్‌ కావాలి. సప్తస్వరాలు ఏడే. సౌండింగ్‌ ఎలా ఇస్తున్నామన్నదే ముఖ్యం. ‘గూఢచారి’ వల్ల కాదు.. ‘కృష్ణ అండ్‌ హీజ్‌ లీల’ సినిమాలోని మ్యూజిక్‌ నచ్చి నాకు చాన్స్‌లు ఇచ్చినట్లుగా కొందరు నాతో చెప్పారు. నాకదో హ్యాపీ సర్‌ప్రైజ్‌’’ అని చెప్పుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement