ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. మహేశ్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదలై ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు, విమర్శకులు ఇండియన్ సినిమా చరిత్రలో 'మేజర్' చిత్రం ఒక మైలురాయని కితాబిచ్చారు.
(చదవండి: సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్‌ని: బాలీవుడ్ డైరెక్టర్)
అయితే ఇది సందీప్ బయోపిక్ కాబట్టి.. ఆయన తల్లిదండ్రులు రాయల్టీ కింద డబ్బులు తీసుకొవచ్చని చాలా మంది అనుకుంటున్నారు. దీనిపై తాజాగా చిత్ర నిర్మాతలు అనురాగ్, శరత్ క్లారిటీ ఇచ్చారు. రాయల్టీ ఇస్తామని అంటే.. తన కొడుకు జీవితాన్ని వెలకట్టుకునే దీనస్థితిలో లేమని వారు చెప్పారన్నారు.
‘సాధారణంగా ఇలాంటి బయోపిక్‌లు తీస్తే..రాయల్టీ ఇవ్వాల్సి వస్తుంది. మేము కూడా సందీప్ పేరెంట్స్‌కు రాయల్టీ ఇస్తామని ముందుగానే చెప్పాం.అది వినగానే ‘గెటౌట్ ఫ్రమ్ మై హౌస్’ అంటూ సందీప్ తండ్రి మాపై ఫైర్ అయ్యారు. కొడుకు జీవితానికి వెలకట్టుకునే దీనస్థితిలో లేమని చెప్పారు. సందీప్ తల్లిదండ్రులు చాలా నిజాయితీ మనుషులు.సందీప్ చనిపోయాక..వచ్చిన ఎల్‌ఐసీ డబ్బులను కూడా వారు తీసుకోలేదు. సన్నిహితులకు ఆ డబ్బును పంచేశారు. అంత నిజాయితీపరులు వాళ్లు. అందుకే వారితో ఓ విషయం చెప్పాం. సైన్యంలో చేరాలనుకునే యువతకు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పౌండేషన్ ద్వారా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. అదే మేం సందీప్ తల్లిదండ్రుకు ఇచ్చే రాయల్టీ’అని నిర్మాతలు చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment