royalty
-
బ్యూటిఫుల్ ఔట్ఫిట్ : అమలాపాల్ రాయల్ లుక్ (ఫొటోలు)
-
Supreme Court: ఆ బకాయిలను రాష్ట్రాలకు చెల్లించాల్సిందే
న్యూఢిల్లీ: ఖనిజ సంపన్న రాష్ట్రాలకు శుభవార్త. గనులకు సంబంధించిన రాయల్టీ, పన్నుల తాలూకు బకాయిలను కేంద్రం నుంచి వసూలు చేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. 2005 ఏప్రిల్ 1 నుంచీ బకాయిలను వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరించింది. బకాయిలను 12 ఏళ్లలోపు చెల్లించాలని కేంద్రాన్ని, వాటిపై పెనాలీ్టల వంటివేమీ విధించొద్దని రాష్ట్రాలను ఆదేశించింది.ధర్మాసనం తరఫున సీజేఐ తీర్పు రాశారు. ఖనిజాలు, నిక్షేపాలున్న భూములపై రాయల్టీ వసూలు అధికారం కేంద్రానిదేనన్న 1989 నాటి సుప్రీంకోర్టు తీర్పును పలు రాష్ట్రాలు సవాలు చేశాయి. గనులు, ఖనిజాలపై రాయల్టీ విధించే అధికారం రాష్ట్రాలకే ఉంటుందంటూ 8:1 మెజారిటీతో జూలై 25న ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీన్ని 1989 నుంచీ వర్తింపయాలని పలు రాష్ట్రాలు కోరాయి. దీన్ని కేంద్రం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇందుకు ఒప్పుకుంటే సంబంధిత ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్రాలకు రూ.70 వేల కోట్ల మేరకు చెల్లించాల్సి రావచ్చని తెలిపింది. కనుక తీర్పును జూలై 25 నుంచే వర్తింపజేయాలని అభ్యర్థించింది. దీన్ని ధర్మాసనం తాజాగా తోసిపుచి్చంది. -
Supreme Court: ‘రాయల్టీ’ రాష్ట్రాలదే
న్యూఢిల్లీ: ఖనిజాలపై రాయల్టీ విధించే అధికారం రాష్ట్రాలకు మాత్రమే ఉందని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఖనిజాలపై చెల్లించే రాయల్టీ పన్ను కాదని న్యాయస్థానం తేలి్చచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం 8:1 మెజారిటీతో కీలక తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వానికి ఇది ఎదురుదెబ్బే. గనుల, ఖనిజాల అభివృద్ధిపై కేంద్రం నియంత్రణకు వీలు కలి్పస్తున్న రాజ్యాంగంలోని జాబితా–1లో పేర్కొన్న ఎంట్రీ 54 ప్రకారం.. ఖనిజ హక్కులపై పన్నులు విధించే అధికారం పార్లమెంటుకు లేదని తేల్చిచెప్పింది. అయితే ఖనిజ హక్కులపై రాయల్టీ విధించే రాష్ట్రాల అధికారాన్ని ఏ స్థాయికైనా పరిమితం చేసే అధికారం పార్లమెంటుకు ఉందని స్పష్టం చేసింది. గనులు, ఖనిజాలు అధికంగా ఉన్న జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు ఈ తీర్పుతో లబ్ధి చేకూరనుంది. తమ ప్రాంతంలో ఉన్న గనులు, ఖనిజాలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా వసూలు చేసిన రూ.వేల కోట్ల పన్నులను తిరిగి తమకు ఇప్పించాలని ఆయా రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి. తీర్పును అమల్లోకి తీసుకురావాలని కోరాయి. రాష్ట్రాల విజ్ఞప్తిని కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ వ్యతిరేకించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఈ అంశంపై లిఖితపూర్వకంగా స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. పన్నులను రాష్ట్రాలకు తిరిగి ఇచ్చే విషయంలో ఈ నెల 31న తమ నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించింది. 1989 నాటి తీర్పును తోసిపుచ్చిన ధర్మాసనం గనులు, ఖనిజాలపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలకే ఉందంటూ తమ తీర్పును జస్టిస్ డి.వై.చంద్రచూడ్ స్వయంగా చదివి వినిపించారు. ధర్మాసనంలోని 8 మంది సభ్యులు రాష్ట్రాల హక్కును సమర్థిస్తూ తీర్పు ఇచ్చారు. జస్టిస్ నాగరత్న ఒక్కరే వ్యతిరేకిస్తూ భిన్నమైన తీర్పు వెలువరించారు. రాజ్యాంగంలో జాబితా–2లోని ఎంట్రీ 50 కింద గనులు, ఖనిజాలపై పన్నులు విధించే అధికారం పార్లమెంట్‌కు లేదని జస్టిస్ చంద్రచూడ్ తమ తీర్పులో చెప్పారు. రాయల్టీ అంటే పన్ను అని తేల్చేస్తూ 1989లో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచి్చన తీర్పు సరైంది కాదని పేర్కొన్నారు. ఆæ తీర్పును తోసిపుచ్చారు.రాష్ట్రాల అధికారాన్ని పార్లమెంటు పరిమితం చేయవచ్చు ఖనిజాలపై రాయల్టీ వసూలు చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నప్పటికీ.. దేశంలో ఖనిజాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాల అధికారాన్ని పరిమితం చేసే హక్కు మాత్రం పార్లమెంటుకు ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. ‘ఖనిజాభివృద్ధి ఆటంకం కలగకుండా ఉండటానికి రాష్ట్రాల రాయల్టీ అధికారాన్ని పార్లమెంటు పరిమితం చేయగలదు. ఆ మేరకు పార్లమెంటు ఏదైనా చట్టాన్ని చేస్తే రాష్ట్రాలు దానికి కట్టుబడి ఉండాలి’ అని స్పష్టం చేసింది. -
నాటి ఆజ్కల్.. నేటి అజ్జకొల్లు.. 200ఏళ్ల క్రితం నామకరణం
సాక్షి, మహబూబ్‌నగర్: కొన్ని ప్రాంతాలకు అక్కడి పరిస్థితులను భట్టి పేర్లు నామకరణం చేస్తారు. గతంలో నగరాలు, పల్లెలకు మంచి నాయకుల పెట్టారు. నేటికి అవే పేర్లతో గ్రామాలు పిలువడుతున్నాయి. అలాంటిదే నాటి ఆజ్కల్ నేటి అజ్జకొల్లుగా మారింది. ఈ గ్రామ నామకరణంపై ప్రత్యేక కథనం.. మదనాపురం మండలంలోని అజ్జకొల్లు మండలంలోనే ప్రస్తుతం పెద్ద గ్రామంగా పేరుంది. విభిన్న రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు. ప్రజలంతా నాటి నుంచి వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. 200 ఏళ్ల క్రితం నామకరణం నిజాం నవాబు కాలంలో వనపర్తి సంస్థానంలో ఈ గ్రామం ఉండేది. ఈ గ్రామంలో వనపర్తి సంస్థానాధీశులు రాజారామేశ్వర్‌రావు వంశీయుల ఆధీనంలో ఉన్నది. 1900 సంవత్సరం వరకు గ్రామాన్ని ఆజ్కల్గా పిలిచేవారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆ పేరు కాస్త (అజ్కోల్)గా మారింది. నిజాం నవాబు భారత సైన్యాన్నికి లొంగిపోయిన అనంతరం కాలక్రమేణా అజ్జకొల్లుగా మారింది. ప్రస్తుతం గ్రామం చుట్టూ రాజవంశీయుల వారి భూములు ఉన్నాయి. గామంలో 80 శాతం మంది రైతులే. రామన్‌పాడు బ్యాకువాటర్తో పాటు ప్రధాన కాల్వల ద్వారా గ్రామానికి సాగునీరు అందుతుంది. ఏటా రెండు, పంటలు అధికంగా వరి పండుతుంది. పంచాయతీ కార్యాలయం సర్పంచ్‌లుగా కొనసాగిన వారు.. బాలయ్య, చెన్నారెడ్డి, తిరుపతన్నగౌడ్, బాలగౌడ్, కుర్వ నారాయణ, రాజవర్దన్‌రెడ్డి, బాలమణెమ్మ, పద్మమ్మ, కుర్వ బుచ్చన్న, విజయేందర్‌రెడ్డి, ప్రస్తుత సర్పంచ్ బ్రహ్మమ్మ. ఒకరు ఎంపీపీ ఇద్దరు జెడ్పీటీసీలుగా.. ఉమ్మడి కొత్తకోట మండలానికి ఎంపీపీ బాలగౌడ్, జెడ్పీటీసీ బాల మణెమ్మ చేశారు. ప్రస్తుతం మదనాపురం జెడ్పిటీసీగా కృష్ణయ్య యాదవ్ అజ్జకొల్లు గ్రామానికి చెందిన వ్యక్తిగా ఉన్నారు. ‘ఆజ్కల్’గా పిలిచేవారంటా.. మా గ్రామాన్ని నిజాం కాలంలో ఆజ్కల్గా పేరు నామకరణం చేశారని మా పెద్దలు చెప్పెవారు. అ పేరు కాల క్రమేణ అజ్జకొల్లుగా ప్రస్తుతం పిలుస్తున్నారు. ఈ విషయం ఇప్పటితరం పిల్లలకు తెలియదు. – కోట్లరాంరెడ్డి, అజ్జకొల్లు చరిత్ర పుటలు తెలియాలి అజ్జకొల్లు అనే పేరు ఎలా వచ్చిందో మా వయస్సున్న యువకులకు ఎవరికీ తెలియదు. మా తరం వాళ్లు ఈవిషయాన్ని ఎప్పుడు ఆలోచించలేదు. ప్రస్తుతం మా గ్రామానికి గా అప్పట్లో నామకరణం చేశారంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. – మొగిలి, అజ్జకొల్లు -
అలా అన్నందుకు సందీప్ తండ్రి చాలా సీరియస్ అయ్యారు : ‘మేజర్’ నిర్మాతలు
ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. మహేశ్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదలై ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు, విమర్శకులు ఇండియన్ సినిమా చరిత్రలో 'మేజర్' చిత్రం ఒక మైలురాయని కితాబిచ్చారు. (చదవండి: సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్‌ని: బాలీవుడ్ డైరెక్టర్) అయితే ఇది సందీప్ బయోపిక్ కాబట్టి.. ఆయన తల్లిదండ్రులు రాయల్టీ కింద డబ్బులు తీసుకొవచ్చని చాలా మంది అనుకుంటున్నారు. దీనిపై తాజాగా చిత్ర నిర్మాతలు అనురాగ్, శరత్ క్లారిటీ ఇచ్చారు. రాయల్టీ ఇస్తామని అంటే.. తన కొడుకు జీవితాన్ని వెలకట్టుకునే దీనస్థితిలో లేమని వారు చెప్పారన్నారు. ‘సాధారణంగా ఇలాంటి బయోపిక్‌లు తీస్తే..రాయల్టీ ఇవ్వాల్సి వస్తుంది. మేము కూడా సందీప్ పేరెంట్స్‌కు రాయల్టీ ఇస్తామని ముందుగానే చెప్పాం.అది వినగానే ‘గెటౌట్ ఫ్రమ్ మై హౌస్’ అంటూ సందీప్ తండ్రి మాపై ఫైర్ అయ్యారు. కొడుకు జీవితానికి వెలకట్టుకునే దీనస్థితిలో లేమని చెప్పారు. సందీప్ తల్లిదండ్రులు చాలా నిజాయితీ మనుషులు.సందీప్ చనిపోయాక..వచ్చిన ఎల్ఐసీ డబ్బులను కూడా వారు తీసుకోలేదు. సన్నిహితులకు ఆ డబ్బును పంచేశారు. అంత నిజాయితీపరులు వాళ్లు. అందుకే వారితో ఓ విషయం చెప్పాం. సైన్యంలో చేరాలనుకునే యువతకు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పౌండేషన్ ద్వారా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. అదే మేం సందీప్ తల్లిదండ్రుకు ఇచ్చే రాయల్టీ’అని నిర్మాతలు చెప్పుకొచ్చారు. -
దేవుని తీర్పు కోసం సిద్ధపడే తరుణమిది
బబులోను రాజైన బెల్షస్సరు రాజవంశీయులైన వెయ్యి మంది అధిపతులకు, తన రాణులకు, ఉపపత్నులకు ఒక రాత్రి గొప్ప విందు చేశాడు. తన రాజధానియైన బబులోను పట్టణమంటే అతనికెంతో అతిశయం!! బబులోను పట్టణం చుట్టూ 350 అడుగుల ఎత్తు, 85 అడుగుల వెడల్పున మహా ప్రాకారముంది. శత్రువుల ఆగమనాన్ని పసిగట్టేందుకు ఆ గోడ మీద 350 చోట్ల కాపలా శిఖరాలున్నాయి. ప్రాకారాన్ని ఆనుకొని పట్టణం చుట్టూ మొసళ్ళు నివసించే నీళ్లతో లోతైన కందకాలున్నాయి. శత్రువు బయటి నుండి ముట్టడి వేసినా కోట లోపల కొన్ని ఏళ్లపాటు సుఖంగా బతికేందుకు అవసరమైనన్ని ధాన్యం, ఆహారం నిల్వలు న్నాయి. అందువల్ల తమ ప్రాణాలకు, భద్రతకు ఏమాత్రం ఢోకా లేదన్న అతివిశ్వాసంతో రాజైన బెల్షస్సరు విందులు వినోదాలతో కాలక్షేపం చేస్తున్నాడు. పైగా యెరూషలేము మహాదేవుని ఆలయం నుండి దోపిడీ చేసి తెచ్చిన బంగారు పాత్రల్లో ద్రాక్షారసం తాగేందుకు పూనుకోవడం అతని అహంకారానికి పరాకాష్ట అయ్యింది. ఆ రాత్రే ఒక అదృశ్యవ్యక్తి తాలూకు హస్తం అతని ఎదుట గోడమీద ఏదో రాయడం అతనికి కలవరం కలిగించింది. తన వద్దనున్న జ్యోతిష్కులు, గారడీవాళ్ళు, మంత్రగాళ్ళ ద్వారా దాని భావాన్ని తెలుసుకోవడానికి విఫల ప్రయత్నం చేశాడు. చివరికి దానియేలు ప్రవక్త అతనికి దాని గుట్టు విప్పి చెప్పాడు. ‘రాజా, నీ తండ్రి నెబుకద్నెజరు చేసిన తప్పిదాన్నే నీవు కూడా చేస్తున్నావు. నీ తండ్రిని దేవుడు ఎలా శిక్షించాడో అంతా ఎరిగి కూడా నిన్ను నీవు సరిచేసుకోకుండా, నిగ్రహించుకోకుండా పరలోకమందలి దేవుని కన్నా పైగా నిన్ను నీవు హెచ్చించుకున్నావు. అందువల్ల ‘మేనే మేనే టేకేల్ ఉఫారసీన్’ అని దేవుని హస్తం నిన్ను గురించి దైవభాషలో రాసింది. అంటే దేవుడు నీ విషయం లెక్క చూసి, తన త్రాసులో తూచగా నీ అహంకారం వల్ల నీవు చాలా తక్కువగా తూగావు. అందువల్ల ‘ఇదంతా నాదేనంటూ నీవు విర్రవీగుతున్న నీ రాజ్యాన్నంతా తీసి దేవుడు నీ శత్రువులైన మాదీయులు, పారసీకులకు ఇవ్వబోతున్నాడు’ అని దేవుని తీర్పును అతనికి వెల్లడించాడు. ఆ రాత్రే అదంతా నెరవేరి, బెల్షస్సరు శత్రువుల చేతిలో చనిపోగా, అతని రాజ్యం శత్రురాజుల చేజిక్కింది. దేవుడెంత న్యాయవంతుడంటే, ముందుగా హెచ్చరించకుండా, పరివర్తన చెందేందుకు సమయమివ్వకుండా ఎవరినీ శిక్షించడు. సమయమిచ్చినా దాన్ని వాడుకొని మారనివారిని దేవుడెట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడు కూడా. ‘ఎంతోమంది చక్రవర్తులు, మహాపాలకులు కూలిపోయింది శత్రురాజుల చేతిలో కాదు, వాళ్ళు తమ అహంకారానికే బలయ్యారు’ అన్నది చరిత్ర చెప్పే సత్యం!! రాజైన హిజ్కియా కూడా దారి తప్పి పశ్చాత్తా్తపపడితే దేవుడు మరో అవకాశాన్నిచ్చి అతని ఆయువును పెంచాడు. అతని కొడుకు మనశ్శహే రాజు కూడా తప్పులు చేసినా, తన తండ్రిలాగే తనను తాను సరిదిద్దుకొని మరో అవకాశం పొందాడు. బబులోను రాజైన బెల్షస్సరు మాత్రం తన తండ్రి నెబుకద్నెజరుకు జరిగిన దాన్నంతా చూసి కూడా గుణపాఠం నేర్చుకోక తన అహంకారానికి, అజ్ఞానానికి బలై భ్రష్టుడయ్యాడు. తన చుట్టూ ఉన్న కోట, తన సైనికులు తనను కాపాడుతారనుకున్నాడు కాని మహాకాశంలో తన సింహాసనాన్ని కలిగి ఉన్న దేవదేవుడు తనను కూడా పాలించే మహాపాలకుడన్న వాస్తవాన్ని మరచిపోయి విచ్చలవిడిగా ప్రవర్తించి, వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవుడు ఆది నుండీ చెప్పేది అదే!! మనిషి వినాశనం మనిషి చేతుల్లోనే ఉంటుంది. తనను తాను తగ్గించుకొని దేవుణ్ణి ఆశ్రయించిన వాడే ఆ వినాశనం నుండి తప్పించుకోగలడు. దేవుడిచ్చిన పాపక్షమాపణను పొందిన వారే దేవుని తీర్పును తప్పించుకోగలరు. –రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ ఈమెయిల్:prabhukirant@gmail.com -
ఆ సొమ్మును డిపాజిట్ చేయండి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహికో మోన్శాంటో బయోటెక్ (ఎంఎంబీఎల్) కంపెనీ టెక్నాలజీ సమర్థమైనది కాదు కనక దానికి రాయల్టీ చెల్లించాల్సిన పనిలేదంటూ నిలిపేసిన రూ.138 కోట్లను తమ వద్ద డిపాజిట్ చేయాలని హైదరాబాద్‌కు చెందిన విత్తన కంపెనీ నూజివీడు సీడ్స్‌ను బొంబాయి హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని తమవద్ద నగదు లేదా బ్యాంకు గ్యారంటీ రూపంలో డిపాజిట్ చేయాలని తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. సబ్ లైసెన్స్ అగ్రిమెంట్ కింద పత్తి విత్తన కంపెనీలకు ఎంఎంబీఎల్ బీటీ టెక్నాలజీని విక్రయిస్తున్న విషయం తెలిసిందే. 2015లో నూజివీడు సీడ్స్‌తో సహా పలు విత్తన కంపెనీలు ఎంఎంబీఎస్ బీటీ టెక్నాలజీ అసమర్థమైందని.. అందుకే రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని వాదించి రుసుము చెల్లింపులను నిలిపేశాయి. తరవాత మిగిలిన కంపెనీలు వివాదాన్ని పరిష్కరించుకున్నా... ఎన్ఎస్ఎల్ మాత్రం ఈ మొత్తాన్ని చెల్లించలేదు. గతేడాది దీనిపై ఆర్బిట్రేషన్‌కు వెళ్లగా రూ.117 కోట్లు చెల్లించాలని ట్రైబ్యునల్ ఎన్ఎస్ఎల్కు స్పష్టంచేసింది. ఎన్ఎస్ఎల్ చెల్లించకపోవటంతో మహికో సంస్థ దీనిపై ముంబై హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులపై అప్పీలు చేసే అవకాశముంది కనక తాము అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నట్లు నూజివీడు సీడ్స్ తెలియజేసింది. -
ఫస్ట్‌లుక్ 28th August 2018
-
స్క్రీన్ ప్లే 8th August 2018
-
రాయల్టీపై గళమెత్తిన తెలుగు సినీ గాయని గాయకులు
-
ఎప్పుడో రిటైర్ అయ్యేవాడిని: ఎస్పీ బాలు
సాక్షి, హైదరాబాద్ : రాయల్టీ చట్టంపై గాయనీ గాయకులంతా అవగాహన కలిగివుండాలని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కోరారు. పాటలపై నిర్మాత, సంగీత దర్శకుడు, గేయ రచయితలకు మాత్రమే హక్కులు ఉన్నాయని చెప్పారు. కేవలం లతా మంగేష్కర్ మాత్రమే ఒప్పందంలో రాయల్టీ కుదుర్చుకునేవారని వివరించారు. కానీ, 2012లో వచ్చిన రాయల్టీ చట్టం గాయనీ గాయకులు అందరికీ పాటలపై హక్కులు కల్పిస్తోందని వెల్లడించారు. ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్(ఇశ్రా) సమావేశంలో బుధవారం ఈ చట్టంపై చర్చించారు. అనంతరం ఎస్పీ బాలు మీడియాతో మాట్లాడారు. గాయనీ గాయకులంతా ఐక్యమై రాయల్టీని తీసుకోవాలని కోరారు. సినిమా పాటలకు సంబంధించి నాకు ఒక్క రూపాయి రాయల్టీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా పాటలకు రాయల్టీ చెల్లిస్తే ఎప్పుడో రిటైర్ట్ అయ్యేవాడినని అన్నారు. రాయల్టీ చట్టం ప్రకారం పాట లాభాల్లో గాయనీ గాయకుల నాణ్యమైన వాటా చెల్లించాలని చెప్పారు. రాయల్టీ యాక్టు కాపీ రైట్ యాక్టులా తయారైందని వివరించారు. దాదాపు 410 మంది సింగర్లు ఇశ్రాలో ఉన్నట్లు చెప్పారు. రాయల్టీ అనేది కేవలం సినిమా పాటలకే కాకుండా అన్ని రకాల పాటలకు వర్తిస్తుందని వెల్లడించారు. ఒక పాటను రీ-మిక్స్ చేయాలంటే ఐపీఆర్‌ఎస్ నుంచి పర్మిషన్ తీసుకోని చేయాలని తెలిపారు. లేకపోతే దానిపై లీగల్‌గా ముందుకెళ్తామని పేర్కొన్నారు. మైనెస్ 1 ట్రాక్ పాడినా.. మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అనుమతి తీసుకోవాలని చెప్పారు. చనిపోయిన సింగర్లు పాడిన పాటలకు కూడా రాయల్టీ వస్తుందని తెలిపారు. అయితే, ఇందుకు సదరు సింగర్ కుటుంబ సభ్యులు ఇశ్రాలో సభ్యులు అయి ఉండాలని చెప్పారు. -
మున్నూరుకాపులు ఐక్యంగా ఉండాలి
మేడ్చల్: రాష్ట్ర జనాభాలో 70 లక్షల మంది ఉన్న మున్నూరుకాపులకు రాజ్యాధికారం వచ్చేంత వరకు ఐక్య పోరాటం చేయాల్సిన అవసరముందని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య అన్నారు. అలియాబాద్ చౌరస్తా సంగీత్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన జిల్లా మున్నూరుకాపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వతహగా రైతులైన మున్నూరుకాపులు రాజకీయంగా పూర్తిగా వెనుకబడి పోయారని పాలకులు మారుతున్నా రాతలు మారడం లేదన్నారు. అన్ని జిల్లాలో కమిటీలు వేసి త్వరలో హైద్రాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ముందుండాలంటే కులంలో ఐక్యత అవసరమని గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ పుట్టం పురుషోత్తం అన్నారు. గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసి కుల సంఘాన్ని పటిష్టం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కుల సంఘం సభ్యత్వాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో హన్మంత్‌రావు, శ్రీనివాస్, మూసాపేట్ కార్పొరేటర్ శ్రావణి, శ్రీధర్, సంజీవ, గోపాల్, కన్నా, సత్యనారయణ, ఆంజనేయులు, నర్సింగ్‌రావు పాల్గొన్నారు. -
ఏడీఎంజీ అధికారుల ఆకస్మిక తనిఖీ
కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి మండలం జలదుర్గం పోలీసుస్టేషన్ పరిధిలోని బావిపల్లె గ్రామం వద్ద అక్రమంగా తవ్వకాలు చేపడుతున్న తెల్లసుద్ద గనులపై శుక్రవారం ఏడీఎంజీ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. భూగర్భగనుల శాఖ సహాయ సంచాలకులు వెంకటరెడ్డి ఆదేశాల మేరకు రాయల్టీ ఇన్స్పెక్టర్ నాగరాజు, సిబ్బంది ఈ దాడులు నిర్వహించారు. ముందుగా బావిపల్లె వద్ద చేపడుతున్న తెల్ల సుద్దగనుల వద్ద ఖనిజాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉన్న రెండు టిప్పర్లతో పాటు, ట్రాక్టర్ లోడర్‌ను సీజ్ చేశారు. అదే విధంగా బనగానపల్లె నుంచి ప్యాపిలి వైపు రాయల్టీలు లేకుండా నాపరాయి ఖనిజాన్ని తరలిస్తున్న రెండు లారీలను కూడా సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాలను జలదుర్గం పోలీసుస్టేషన్‌కు తరలించారు. డోన్ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలలో ఖనిజాలను అక్రమంగా తరలిస్తున్న వారి సమాచారాన్ని గుట్టుగా సేకరిస్తున్నట్లు సమాచారం. -
మైనింగ్ ఆదాయమే కీలకం
కొలిమిగుండ్ల: ఏపీకి వచ్చే ఆదాయ వనరుల్లో మైనింగ్ శాఖ కీలకంగా మారిందని భూగర్భ గనుల శాఖా మంత్రి పీతల సుజాత అన్నారు. నాపరాతిపై ఆన్లైన్ రాయల్టీ ధరను ప్రభుత్వం 8 నుంచి 5శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఆదివారం అంకిరెడ్డిపల్లె హైస్కూల్ ఆవరణలో ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి ఆధ్వర్యంలో అభినందనసభ నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి పీతల సుజాత హాజరయ్యారు. చరిత్రలో మొదటి సారిగా డిస్టిక్ మినరల్ ఫండ్(డీఎంఎఫ్)ను ప్రభుత్వం 30 నుంచి 10 శాతానికి తగ్గించినట్లు గుర్తు చేశారు. డీఎంఎఫ్ ద్వారా ఏటా కర్నూలు జిల్లా నుంచి రూ.50 కోట్ల ఆదాయం సమకూరుతోందని.. వాటిని జిల్లా అభివృద్ధికే వెచ్చించేలా సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారన్నారు. కొలిమిగుండ్ల మండలంలో అపార ఖనిజ సంపద విస్తరించినందునా పరిశ్రమల హబ్‌గా మార్చే దిశగా సీఎం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సిమెంట్ కంపెనీలు సకాలంలో పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే లీజు రద్దు చేస్తామన్నారు. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామి ఇచ్చారు. కార్యక్రమంలో భూగర్భ గనుల శాఖ రాష్ట్ర డైరక్టర్ శ్రీధర్, శిశు సంక్షేమ శాఖ ఆర్జెడీ శారద, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేకు విందు పేరుతో వసూళ్లు!
- ఇవ్వని ట్రాక్టర్ యజమానికి రాయల్టీలు ఇవ్వకుండా సతాయింపు - అధికార పార్టీ మద్దతు దారుల అక్రమ దారి కొలిమిగుండ్ల: ‘నాపరాతిపై పెంచిన రాయల్టీ ధరను ప్రభుత్వంతో పోరాడి ఎమ్మెల్యే బీసీ జనార్ధనరెడ్డి తగ్గించారు..అందుకు ప్రతిగా పెద్ద ఎత్తున డిన్నర్(విందు) ఏర్పాటు చేస్తున్నాం. యజమానులందరూ రూ.2వేల చొప్పున ఇవ్వాల్సిందే’ అని అధికార పార్టీ మద్దతు దారులు మంగళవారం నుంచి వసూళ్ల పర్వం మొదలు పెట్టినట్లు సమాచారం. 2015 నవంబర్‌లో రాయల్టీ బిల్లుపై 4నుంచి 8శాతం ధర ప్రభుత్వం పెంచింది. ఇటీవల ఆ ధరను ప్రభుత్వం 5శాతానికి తగ్గిస్తూ జీఓ జారీ చేసింది. ఈనేపథ్యంలో నాయకులు డిన్నర్ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. కొలిమిగుండ్ల, అవుకు మండలాల నుంచి రోజు బందార్లపల్లె క్రాస్ రోడ్డులోని రాయల్టీ చెక్‌పోస్ట్ మీదుగా 650కు పైగా ట్రాక్టర్లు నాపరాళ్లను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంటాయి. ట్రాక్టర్‌తో పాటు మైనింగ్ లీజు దారులు, రాయల్టీ బిల్లులు విక్రయించే వారు ఒక్కొక్కరు రూ.2వేలు ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వసూలు చేసే బాధ్యత రాయల్టీ బిల్లులు విక్రయించే వారికి అప్పగించినట్లు సమాచారం. డబ్బులు ఇవ్వకపోతే ట్రాక్టర్లకు రాయల్టీలు ఇవ్వరాదని గట్టిగా హెచ్చరించినట్లు తెలిసింది. ఓ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడుకి చెందిన ట్రాక్టర్‌కు డబ్బు ఇవ్వాలని పేర్కొనడంతో ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మరి కొందరు యజమానులు మాత్రం సమస్య ఎందుకని అడిగిన మొత్తం ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. అధికార పార్టీ నాయకులు డిన్నర్ ఇచ్చుకోవాలంటే ఇలా పది మందితో బలవంతంగా వసూలు చేయకుండా సొంతంగా ఖర్చు పెట్టుకోవాలని పలువురు యజమానులు హితువు పలికారు. -
మట్టిలో మనీ దందా
లాటరైట్ తవ్వకాలకు ఎడాపెడా అనుమతి ఎన్నికలకు ముందు శరవేగంగా ఉత్తర్వులు జిల్లా మంత్రి సహకారంతో జీఓల జారీ వారంలోనే 39 ఎకరాలకు పైగా లీజు రాయల్టీని పట్టించుకోని జిల్లా యంత్రాంగం ఎన్నికలు సమీపిస్తున్న వేళ మట్టిలో మనీ దందాకు రంగం సిద్ధం చేశారు. ములుగు మండలం రామచంద్రాపురం వేదికగా దండుకునేందుకు పలువురు వ్యాపారులు గ‘లీజు’ పనులకు సన్నద్ధమయ్యూరు. ‘మాకు అనుకూలంగా అనుమతులు ఇప్పిస్తే... ఎన్నికల నిధులు సమకూరుస్తాం’ అని జిల్లాకు చెందిన ఓ మంత్రితో ఒప్పందం చేసుకుని భవిష్యత్‌కు బాటలు వేసుకుంటున్నారు. లాటరైట్ మాటున ఐరన్‌ఓర్ తరలించే స్వకార్యాన్ని చక్కబెట్టుకుంటున్నారు. మూడు రోజుల వ్యవధిలో సర్కారు నుంచి 39 ఎకరాలకు పైగా భూమిని 20 ఏళ్లపాటు దక్కించుకున్న తీరే ఇందుకు నిదర్శనం. సాక్షి ప్రతినిధి, వరంగల్: లాటరైట్ (ఎర్రమట్టి) తవ్వకాల కోసం భూములను లీజుకు ఇవ్వడం... తీసుకోవడం కొత్త కాదు. కానీ... ఒకే వారంలో ఏకంగా 39.30 ఎకరాలను 20 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఎవరికైనా అనుమానం కలిగించేదే. ఈ అంశం ఇప్పుడు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఎన్నికల సమయూన్ని అదునుగా భావించిన కొందరు వ్యాపారులు... జిల్లాకు చెందిన ఓ మంత్రి సహకారంతో ఉత్తర్వులు ఇప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా... అనుకున్న ప్రకారం అవసరమైన విస్తీర్ణంలో భూములను లీజుకు తీసుకునే వ్యూహాన్ని వ్యాపారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. లాటరైట్ పేరిట ముడి ఇనుము (ఐరన్‌ఓర్)ను తవ్వుకునేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. లీజు అనుమతులు ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఎన్నికల అవసరాలకు నిధులు సమకూర్చేలా ఒప్పందం చేసుకోవడంతో ఒకరి వెనుక ఒకరికి వరుసగా అనుమతులు వస్తున్నట్లు సమాచారం. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరులోనూ ఇలాగే 57 ఎకరాల్లో మట్టి తవ్వకాలకు రాష్ట్ర సర్కారు 20 ఏళ్లపాటు లీజు అనుమతులు ఇచ్చింది. ఇదే వరుసలో ప్రస్తుతం మరో నాలుగు జీఓలు విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. వ్యాపారులు అడిగిందే తడవుగా, మంత్రి సహకారంతో వరుసపెట్టి లీజు అనుమతులు ఇస్తున్న సర్కారు, జిల్లా యంత్రాంగం.... రాయల్టీ వసూలును మా త్రం పట్టించుకోవడంలేదు. ఎర్రమట్టి పేరుతో ముడి ఇనుమును తవ్వుకుంటు న్నా... పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ప్రజాప్రతినిధుల అండదండలు లాటరైట్ ఖనిజాన్ని నిర్మాణాలకు వినియోగించడం వేల సంవత్సరాల నుంచి ఉంది. ఈ ఖనిజాన్ని మొదట ఇటుకల రూపంలో సేకరించి ఇళ్లు కట్టినట్లు చెబుతుంటారు. ములుగు మండలం మల్లంపల్లి, రామచంద్రాపురం ప్రాంతం లాటరైట్‌కు ప్రసిద్ధి. 500 ఎకరాల వరకు ఇక్కడ ఎర్రమట్టి గనులు ఉన్నట్లు అంచనా. ఇక్కడ తవ్వుతున్న లాటరైట్‌లో అధిక ధర వచ్చే ఐరన్‌ఓర్, బాక్సైట్ ఉంటుందని గనుల శాఖ అధికారులే అంటున్నారు. లీజుదారులు మాత్రం కేవలం సిమెంట్ తయారీలో వినియోగిస్తారని చెబుతున్నారు. ఇక్కడ 30 వరకు కంపెనీలు లాటరైట్ లీజులను పొందాయి. వీటి పరిధిలో 200 ఎకరాల భూములు ఉన్నాయి. అయితే ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతో లీజుదారులు మైనింగ్ నిబంధనలను పక్కనబెట్టడం ఇక్కడ ఆనవాయితీగా మారింది. రాయల్టీ ఎగవేత, పరిధి దాటి తవ్వకాలు లాటరైట్ తవ్వకాలకు టన్నుకు రూ.35 చొప్పున ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. మల్లంపల్లి మైనింగ్ కేంద్రంగా ప్రతి రోజూ దాదాపు 200 లారీలు ఇక్కడి క్వారీల నుంచి ముడి సరుకును రవాణా చేస్తున్నాయి. అనుమతులు పొందేందుకు అడ్డదారుల్లో వెళ్తున్న సంస్థలు రాయల్టీ చెల్లింపుల్లోనూ ఇదే రకంగా వ్యవహరిస్తున్నాయి. లాటరైట్ రవాణాకు సంబంధించి 10 టైర్ల లారీలో 17 టన్నులు, 12 టైర్ల లారీలో 21 టన్నులు తరలించాలి. ఇక్కడి వ్యాపారులు మాత్రం ఒక్కో లారీలో 50 టన్నుల వరకు తరలిస్తున్నారు. లారీకి రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు రాయల్టీ ఎగ్గొడుతున్నారు. ఇలా ఎగవేస్తున్న మొత్తం నెలకు రూ.60 లక్షల వరకు ఉంటోందని అంచనా. రాయల్టీ ఎగవేతతోనే ఆగకుండా తమకు కేటాయించని భూముల్లోనూ ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతూ మరో రకంగా సర్కారు ఆదాయానికి గండికొడుతున్నారు. పూర్తి స్థాయిలో రాయల్టీని వసూలు చేయడం, లీజుదారులు హద్దులు దాట కుండా నియంత్రించడంలో జిల్లా గనుల శాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ఎర్రమట్టి లీజుదారులు తమకు కేటాయించిన భూముల పక్కన ఉన్న ప్రాంతాల్లోనూ తవ్వకాలు జరపడంపై సర్వేలు జరపాలని గతంలో జాయింట్ కలెక్టర్ స్థాయిలో నిర్ణయించారు. ఇది ఇప్పటికీ పూర్తికాపోవడంతో జిల్లా యంత్రాంగం తీరుపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.