సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు
రాయల్టీ అంటే పన్ను కాదని çస్పషీ్టకరణ
రాయల్టీ విధించకుండా రాష్ట్రాలపై ఎలాంటి నియంత్రణ లేదని వెల్లడి
న్యూఢిల్లీ: ఖనిజాలపై రాయల్టీ విధించే అధికారం రాష్ట్రాలకు మాత్రమే ఉందని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఖనిజాలపై చెల్లించే రాయల్టీ పన్ను కాదని న్యాయస్థానం తేలి్చచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం 8:1 మెజారిటీతో కీలక తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వానికి ఇది ఎదురుదెబ్బే.
గనుల, ఖనిజాల అభివృద్ధిపై కేంద్రం నియంత్రణకు వీలు కలి్పస్తున్న రాజ్యాంగంలోని జాబితా–1లో పేర్కొన్న ఎంట్రీ 54 ప్రకారం.. ఖనిజ హక్కులపై పన్నులు విధించే అధికారం పార్లమెంటుకు లేదని తేల్చిచెప్పింది. అయితే ఖనిజ హక్కులపై రాయల్టీ విధించే రాష్ట్రాల అధికారాన్ని ఏ స్థాయికైనా పరిమితం చేసే అధికారం పార్లమెంటుకు ఉందని స్పష్టం చేసింది. గనులు, ఖనిజాలు అధికంగా ఉన్న జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు ఈ తీర్పుతో లబ్ధి చేకూరనుంది.
తమ ప్రాంతంలో ఉన్న గనులు, ఖనిజాలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా వసూలు చేసిన రూ.వేల కోట్ల పన్నులను తిరిగి తమకు ఇప్పించాలని ఆయా రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి. తీర్పును అమల్లోకి తీసుకురావాలని కోరాయి. రాష్ట్రాల విజ్ఞప్తిని కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ వ్యతిరేకించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఈ అంశంపై లిఖితపూర్వకంగా స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. పన్నులను రాష్ట్రాలకు తిరిగి ఇచ్చే విషయంలో ఈ నెల 31న తమ నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించింది.
1989 నాటి తీర్పును తోసిపుచ్చిన ధర్మాసనం
గనులు, ఖనిజాలపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలకే ఉందంటూ తమ తీర్పును జస్టిస్ డి.వై.చంద్రచూడ్ స్వయంగా చదివి వినిపించారు. ధర్మాసనంలోని 8 మంది సభ్యులు రాష్ట్రాల హక్కును సమర్థిస్తూ తీర్పు ఇచ్చారు. జస్టిస్ నాగరత్న ఒక్కరే వ్యతిరేకిస్తూ భిన్నమైన తీర్పు వెలువరించారు. రాజ్యాంగంలో జాబితా–2లోని ఎంట్రీ 50 కింద గనులు, ఖనిజాలపై పన్నులు విధించే అధికారం పార్లమెంట్‌కు లేదని జస్టిస్ చంద్రచూడ్ తమ తీర్పులో చెప్పారు. రాయల్టీ అంటే పన్ను అని తేల్చేస్తూ 1989లో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచి్చన తీర్పు సరైంది కాదని పేర్కొన్నారు. ఆæ తీర్పును తోసిపుచ్చారు.
రాష్ట్రాల అధికారాన్ని పార్లమెంటు పరిమితం చేయవచ్చు
ఖనిజాలపై రాయల్టీ వసూలు చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నప్పటికీ.. దేశంలో ఖనిజాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాల అధికారాన్ని పరిమితం చేసే హక్కు మాత్రం పార్లమెంటుకు ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. ‘ఖనిజాభివృద్ధి ఆటంకం కలగకుండా ఉండటానికి రాష్ట్రాల రాయల్టీ అధికారాన్ని పార్లమెంటు పరిమితం చేయగలదు. ఆ మేరకు పార్లమెంటు ఏదైనా చట్టాన్ని చేస్తే రాష్ట్రాలు దానికి కట్టుబడి ఉండాలి’ అని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment