గనుల రాయల్టీ, పన్నులపై సుప్రీం
న్యూఢిల్లీ: ఖనిజ సంపన్న రాష్ట్రాలకు శుభవార్త. గనులకు సంబంధించిన రాయల్టీ, పన్నుల తాలూకు బకాయిలను కేంద్రం నుంచి వసూలు చేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. 2005 ఏప్రిల్ 1 నుంచీ బకాయిలను వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరించింది.
బకాయిలను 12 ఏళ్లలోపు చెల్లించాలని కేంద్రాన్ని, వాటిపై పెనాలీ్టల వంటివేమీ విధించొద్దని రాష్ట్రాలను ఆదేశించింది.ధర్మాసనం తరఫున సీజేఐ తీర్పు రాశారు. ఖనిజాలు, నిక్షేపాలున్న భూములపై రాయల్టీ వసూలు అధికారం కేంద్రానిదేనన్న 1989 నాటి సుప్రీంకోర్టు తీర్పును పలు రాష్ట్రాలు సవాలు చేశాయి.
గనులు, ఖనిజాలపై రాయల్టీ విధించే అధికారం రాష్ట్రాలకే ఉంటుందంటూ 8:1 మెజారిటీతో జూలై 25న ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీన్ని 1989 నుంచీ వర్తింపయాలని పలు రాష్ట్రాలు కోరాయి. దీన్ని కేంద్రం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇందుకు ఒప్పుకుంటే సంబంధిత ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్రాలకు రూ.70 వేల కోట్ల మేరకు చెల్లించాల్సి రావచ్చని తెలిపింది. కనుక తీర్పును జూలై 25 నుంచే వర్తింపజేయాలని అభ్యర్థించింది. దీన్ని ధర్మాసనం తాజాగా తోసిపుచి్చంది.
Comments
Please login to add a commentAdd a comment