మున్నూరుకాపులు ఐక్యంగా ఉండాలి | Munnuru Kapus should be united | Sakshi
Sakshi News home page

మున్నూరుకాపులు ఐక్యంగా ఉండాలి

Aug 7 2017 10:53 PM | Updated on Sep 17 2017 5:16 PM

మున్నూరుకాపులు ఐక్యంగా ఉండాలి

మున్నూరుకాపులు ఐక్యంగా ఉండాలి

రాష్ట్ర జనాభాలో 70 లక్షల మంది ఉన్న మున్నూరుకాపులకు రాజ్యాధికారం వచ్చేంత వరకు ఐక్య పోరాటం చేయాల్సిన అవసరముందని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య అన్నారు.

మేడ్చల్‌: రాష్ట్ర జనాభాలో 70 లక్షల మంది ఉన్న మున్నూరుకాపులకు రాజ్యాధికారం వచ్చేంత వరకు ఐక్య పోరాటం చేయాల్సిన అవసరముందని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య అన్నారు. అలియాబాద్‌ చౌరస్తా సంగీత్‌ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన జిల్లా మున్నూరుకాపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వతహగా రైతులైన మున్నూరుకాపులు రాజకీయంగా పూర్తిగా వెనుకబడి పోయారని పాలకులు మారుతున్నా రాతలు మారడం లేదన్నారు. అన్ని జిల్లాలో కమిటీలు వేసి త్వరలో హైద్రాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

అన్ని రంగాల్లో ముందుండాలంటే కులంలో ఐక్యత అవసరమని గడ్డి అన్నారం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పుట్టం పురుషోత్తం అన్నారు. గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసి కుల సంఘాన్ని పటిష్టం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కుల సంఘం సభ్యత్వాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో హన్మంత్‌రావు, శ్రీనివాస్, మూసాపేట్‌ కార్పొరేటర్‌ శ్రావణి, శ్రీధర్, సంజీవ, గోపాల్, కన్నా, సత్యనారయణ, ఆంజనేయులు, నర్సింగ్‌రావు  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement