
Upcoming Telugu Movies On May 6 2022: మొన్నటిదాకా ఆర్ఆర్ఆర్, నిన్నటిదాకా నేడు కేజీఎఫ్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తున్నాయి. తాజాగా ఈ శుక్రవారం (ఏప్రిల్ 29) కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య విడుదలైంది. ఇక సినీ ప్రియులు, సినిమా నిర్మాతల దృష్టి వచ్చే శుక్రవారం పడింది. అంటే మే 6న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముచ్చటగా మూడు చిన్న సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలేంటో చూద్దామా !
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. రుక్సార్ దిల్లాన్ హీరోయిన్గా చేసిన ఈ మూవీకి విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. మూడు పదుల వయసులో వివాహం అనే కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రం మే 6న విడుదల కానుంది. యాంకర్‌గా బాగా రాణిస్తున్న సుమ కనకాల నటించిన సినిమా 'జయమ్మ పంచాయతీ'. గ్రామీణ నేపథ్యంతో సాగే కథతో వస్తున్న ఈ 'జయమ్మ పంచాయతీ' ఎంటో మే 6న తెలియనుంది.
ఇక శ్రీవిష్ణు హీరోగా, కేథరీన్ త్రేసా హీరోయిన్గా వస్తున్న చిత్రం 'భళా తందనాన'. వారాహి బ్యానర్‌పై చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. కేజీఎఫ్ 1 ఫేమ్ గరుడ రామ్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిచారు. ఈ మూవీ కూడా తన సత్తా చాటేందుకు మే 6 తేదినే ఎంచుకుంది. ఈ మూడు చిత్రాల్లో ప్రజలు ఎక్కువగా ఏ సినిమాను ఆదరిస్తారో చూడాలి.
చదవండి: తెరపైకి ఆ పోలీస్ కమీషనర్ బయోపిక్..
అల్లు అర్జున్‌కు నెట్‌ఫ్లిక్స్ స్పెషల్ విషెస్.. దేనికంటే ?
Comments
Please login to add a commentAdd a comment