వరుణ్‌ తేజ్‌ గని మూవీకి 2 రిలీజ్‌ డేట్స్‌, ఎప్పుడైనా రావొచ్చు.. | Varun Tej Ghani Movie Release Dates On February 25th OR March 4th | Sakshi
Sakshi News home page

Varuna Tej Ghani Movie: గని మూవీకి 2 రిలీజ్‌ డేట్స్‌, ఎప్పుడైనా రావొచ్చు..

Published Tue, Feb 1 2022 3:14 PM | Last Updated on Tue, Feb 1 2022 4:12 PM

Varun Tej Ghani Movie Release Dates On February 25th OR March 4th - Sakshi

కరోనా కారణంగా వాయిదా పడ్డ క్రేజీ సినిమాల రిలీజ్‌ డేట్స్‌ను మేకర్స్‌ వరసగా ప్రకటిస్తున్నారు. ఈ సంక్రాంతి బరిలో ప్రేక్షకులు ముందుకు రావాల్సిన పాన్‌ ఇండియా చిత్రాలు ఆర్‌ఆర్‌ఆర్‌, రాధే శ్యామ్‌తో పాటు పెద్ద సినిమాలు ఆచార్య, భీమ్లా నాయక్‌, ఎఫ్‌3 సినిమాల రిలీజ్‌ డేట్స్‌ను నిన్న(సోమవారం) వెల్లడించారు. ఈ నేపథ్యంలో మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ నటించిన గని సినిమా రిలీజ్‌ డేట్‌ను కూడా తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.

ఫిబ్రవరి 25వ తేదీ లేదా మార్చిన 4వ తేదీన గని మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకవచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మేకర్స్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు జరిగిన పిమ్మట, పరస్పర అవగాహన, అంగీకారంతో ఓ నిర్ణయానికి వచ్చామని, గని మూవీని ఫిబ్రవరి 25 లేదా మార్చి 4వ తేదీన రిలీజ్‌ చేస్తామని ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా గని చిత్రాన్ని ముందుగా దీపావళికి రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 24కి వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.

ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ సరసన బాలీవుడ్‌ నటి సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన చంద్ర, జగపతి బాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు. వ‌రుణ్‌ తేజ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని డిఫ‌రెంట్ క్యారెక్టర్‌లో సరికొత్త లుక్‌లో బాక్సర్‌గా అలరించబోతున్నాడు. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఇందులో తమన్నా స్పెషల్‌ సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా తమన్నా స్పెషల్‌ సాంగ్‌ను రిలీజ్ చేయగా ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement