Director James Cameron
-
ఎనిమిదేళ్ల తర్వాత అవతార్ 5
ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన హాలీవుడ్ ‘అవతార్’, సూపర్ హీరోని చూపించిన మార్వెల్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందుకే ఇటు ‘అవతార్’ సీక్వెల్స్ అటు ‘మార్వెల్’ ఫ్రాంచైజీల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. ఈ రెండు భారీ ్ర΄ాజెక్ట్స్ని హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ రాజీపడకుండా నిర్మిస్తుం టుంది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’ తొలి భాగం 2009లో రాగా, రెండో భాగం రావడానికి పదమూడేళ్లు పట్టింది. గత ఏడాది ‘అవతార్ 2’ విడుదలైంది. మూడు, నాలుగు, ఐదో భాగం కూడా ఉంటాయని చిత్ర యూనిట్ ప్రకటించి, విడుదల తేదీలను కూడా ప్రకటించింది. అయితే తేదీలు వాయిదా పడ్డాయి. ఇక ‘మార్వెల్’ ఫ్రాంచైజీలను ఒకే దర్శకుడు కాకుండా వేరు వేరు డైరెక్టర్లు తెరకెక్కించే విషయం తెలిసిందే. ఈ చిత్రాల విడుదల తేదీలు కూడా వాయిదా పడ్డాయి. 2031లో ఫైనల్ అవతార్ తొలుత ‘అవతార్’ మూడో భాగాన్ని 2024లో, నాలుగో భాగాన్ని 2025లో, ఐదో భాగాన్ని 2028లో విడుదలకు మేకర్స్ ΄్లాన్ చేశారు. అయితే వాయిదా వేశారు. ఈ విషయాన్ని వాల్ట్ డిస్నీ సంస్థ బుధవారం ప్రకటించింది. మూడో భాగాన్ని 2025 డిసెంబర్ 19న, నాలుగో భాగాన్ని 2029 డిసెంబర్ 21న, ఐదో భాగాన్ని.. అంటే ఫైనల్ ‘అవతార్’ని 2031 డిసెంబర్ 19న విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ‘‘ఒక్కో ‘అవతార్’ సినిమా ఒక్కో అద్భుతం. ఆ అద్భుతాన్ని ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు ఇవ్వడానికి ఫిలిం మేకర్స్‌గా మేం తగినంత కృషి చేస్తున్నాం. నాణ్యత విషయంలో రాజీపడేది లేదు. 2025లో థియేటర్స్‌లో పండోరా ప్రపంచాన్ని చూపించడానికి యూనిట్ హార్డ్‌వర్క్ చేస్తోంది’’ అని చిత్ర నిర్మాతల్లో ఒకరైన జాన్ లాండవ్ అన్నారు. ఏడాదికి రెండు మార్వెల్ చిత్రాలు వాల్ట్ డిస్నీ ఓ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తున్న మార్వెల్ చిత్రాలు చాలా ఫేమస్. ఇప్పటికి దాదాపు 30 చిత్రాలు రాగా, మార్వెల్ ఫ్రాంచైజీలో మరో 10 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా... ఇప్పటికే విడుదల తేదీ ప్రకటించిన చిత్రాల కొత్త విడుదల తేదీలను నిర్మాణ సంస్థ ప్రకటించింది. మార్వెల్ ఫ్రాంచైజీలో వచ్చే ఏడాది మే 3న ‘డెడ్ పూల్ 3’ విడుదల కానుండగా అదే తేదీన విడుదలకు షెడ్యూల్ అయిన ‘కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్’ జూలై 24కి వాయిదా పడింది. కాగా, ‘థండర్ బోల్ట్స్’ని జూలై 24న విడుదల చేయాలనుకున్నారు కానీ, డిసెంబర్ 20కి వాయిదా వేశారు. వచ్చే ఏడాది ఆరు నెలల గ్యాప్‌లో ఈ రెండు చిత్రాలు వస్తాయి. ఇక 2025లో కూడా రెండు మార్వెల్ చిత్రాలు రానున్నాయి. ‘బ్లేడ్’ని 2025 ఫిబ్రవరి 14న, అదే ఏడాది మే 2న ‘ఫెంటాస్టిక్ ఫోర్’ని, ‘ఎవెంజర్స్: ది కాంగ్ డైనాస్టీ’ని 2026 మే 1న, ‘ఎవెంజర్స్: సీక్రెట్ వార్స్’ని 2027 మే 7న విడుదల చేయనున్నారు. -
అవతార్ సీక్వెల్స్‌లో ఎవరంటే...
సాక్షి, సినిమా : సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం అవతార్ అనే అద్భుత లోకాన్ని సృష్టించి.. అందులోని గ్రాపిక్స్ అనే మాయాజాలంతో ప్రపంచాన్ని కట్టిపడేశాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఊహకందని ఆ విజువల్స్ గురించి ప్రేక్షకులు అస్సలు ఊహించి ఉండరు. అలాంటిది ఆ చిత్ర సీక్వెల్స్‌ను మొదలుపెట్టి వచ్చే 8 ఏళ్లలో ఒక్కోక్కటిగా విడుదల చేయబోతున్నాడు. అయితే మొదటి పార్ట్ లో పెద్ద నటీనటులనే ఎంచుకున్న ఆయన ఇప్పుడు మాత్రం ఆ పని చేయబోవటం లేదు. సుమారు 6 నుంచి 17 ఏళ్లలోపు వాళ్లనే ప్రధాన తారాగణంగా ఎంచుకుని చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఓ పోస్టర్‌ను కూడా వదిలారు. ఆ నటుల్లో ఒకరైన బ్రిటైన్ డాల్టన్ తన ట్విట్టర్ పేజీలో ఈ విషయాన్నితెలియజేశాడు. కొద్ది సంవత్సరాల పాటు తాము అవతార్ సినిమాలతోనే గడపబోతున్నామంటూ ప్రకటించాడు. స్టార్ నటీనటులు లేకుండా అవతార్ సిరీస్‌ను తెరకెక్కించాలన్న కామెరూన్ నిర్ణయం చర్ఛనీయాంశంగా మారింది. గతంలో హాలీవుడ్లో నార్నియా సిరీస్ కూడా పిల్లలతో తెరకెక్కి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సీక్వెల్స్ కోసం ఖర్చుచేస్తున్న బడ్జెట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక బిలియన్ డాలర్లు (దాదాపు 6539 కోట్లు) సీక్వెల్స్ కోసం ఖర్చుచేస్తున్నట్లు నిర్మాత జాన్ లన్డౌ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తొలి సీక్వెల్ అవతార్-2ను 2020 డిసెంబర్ 18న విడుదల చేస్తుండగా, 2021 డిసెంబర్ 17న అవతార్-3ని, 2024 డిసెంబర్ 20న అవతార్-4, 2025 డిసెంబర్ 19న అవతార్-5ని రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు కూడా. -
ఏడేళ్లల్లో నాలుగు అవతార్లు!
‘‘ఇలాంటి అద్భుతావతారాన్ని చూడలేదు. బహు బాగుంది. భవిష్యత్తులో ఇలాంటి సినిమా వస్తుందో? లేదో? ఒకవేళ వచ్చినా అది జేమ్స్ కామెరూనే తీయాలి’’ అని ‘అవతార్’ సినిమా చూసినవాళ్లందరూ అన్నారు. 2009లో వచ్చిన ఈ హాలీవుడ్ అద్భుతానికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. ఈ సినిమాకి దర్శకుడు జేమ్స్ కామెరూన్ సీక్వెల్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఒకటి కాదు... ఏకంగా నాలుగు సీక్వెల్స్ తెరకెక్కించడానికి ఆయన ఎప్పుడో సన్నాహాలు మొదలుపెట్టారు. 2018లో ‘అవతార్–2’ని రిలీజ్ చేస్తామన్నారు. అయితే రెండేళ్లకు విడుదల వాయిదా వేశారు. మారిన తేదీలను ప్రకటించారు. 2020 డిసెంబరు 18న ‘అవతార్–2’ని విడుదల చేస్తామని కామెరూన్ పేర్కొన్నారు. 2021 డిసెంబర్ 17న మరో సీక్వెల్‌ను, 2024 డిసెంబర్ 20న ఇంకో సీక్వెల్‌ను, 2025 డిసెంబరు 19న ఫైనల్ సీక్వెల్‌ను విడుదల చేస్తామని కామెరూన్ తెలిపారు. ‘‘ఈ సీక్వెల్స్‌కు బెస్ట్ టీమ్‌ను తీసుకున్నాను. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మా అందరి జర్నీ కొన్నేళ్లు కొనసాగుతుంది’’ అన్నారు. ఇదిలా ఉంటే.. ‘అవతార్’ సీక్వెల్స్ విడుదల తేదీలన్నీ క్రిస్మస్ పండగకు దగ్గరల్లో ఉండటం విశేషం. -
ఇదే మూడో భాగం!
‘టెర్మినేటర్’ సినిమాతో ప్రపంచ సినిమా గమనాన్ని మార్చిన దర్శకుడు జేమ్స్ కామెరూన్. దానికి రెండో భాగాన్ని కూడా తెరకెక్కించారు. ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్ హీరోగా తెరకెక్కిన ఈ రెండు చిత్రాలూ ఘనవిజయం సాధించి, తర్వాత ఆ తరహా చిత్రాలకు ఓ రెఫరెన్స్‌లా నిలిచాయి. కానీ, వాటికి కొన సాగింపుగా వ చ్చిన ‘రైజ్ ఆఫ్ మెషీన్స్, సాల్వేషన్ ’ చిత్రాలు ఆశించినంత విజయం సాధించలేదు. జేమ్స్ కామెరూన్ మాత్రం తాను నిర్మించిన రెండు చిత్రాలకు అసలు సిసలు సీక్వెల్ రానున్న ‘టెర్మినేటర్ జెనిసిస్’ అంటున్నారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ -‘‘మూడు, నాలుగు భాగాలు ‘టెర్మినేటర్’ స్థాయిని అందుకోలేదు కానీ అలెన్ టేలర్ దర్శకత్వం వహించిన కొత్త చిత్రం ‘టెర్మినేటర్ జెనిసిస్’ అత్యున్నత ప్రమాణాలతో చాలా బాగా రూపొందింది’’ అన్నారు. ఈ నెల 25న ఈ హాలీవుడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.