Avatar 2: Makers Quoting Shocking Price For Theatrical Telugu Rights - Sakshi
Sakshi News home page

Avatar 2 Telugu Rights: ‘అవతార్‌ 2’ తెలుగు రైట్స్‌కు అన్ని కోట్లా?!

Published Tue, Nov 1 2022 1:24 PM | Last Updated on Tue, Nov 1 2022 3:19 PM

Avatar 2: Makers Quoting Shocking Price For Theatrical Telugu Rights - Sakshi

2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనం సృష్టించిన హాలీవుడ్‌ చిత్రం ‘అవతార్‌’. ఈ సినిమాతో ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచలోనికి తీసుకేళ్లాడు డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌. భారత ప్రేక్షకులను సైతం ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు సినిమాకు సీక్వెల్‌గా రానున్న సంగతి తెలిసిందే. అవతార్‌ 2(ది వే ఆఫ్‌ వాటర్‌) పేరుతో సీక్వెల్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌.

చదవండి: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. యువ నటుడు, గాయకుడు మృతి

దాదాపు 160 దేశాల్లో ఈ ఏడాది డిసెంబర్‌ 16న అవతార్‌ 2 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. భారీ బడ్జెట్‌తో హై ఎండ్‌ టెక్కాలజీతో నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందే బిజినెస్‌ విషయంలో వివిధ దేశాల్లో రికార్డు సృష్టిస్తోందని సమాచారం. ఇండియాలో సైతం అవతార్‌ 2 భారీగానే బిజినెస్‌ చేసేలా ఉందని సినీ విశ్లేషకుల అంచనా. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమాకు విపరీతమైన హైప్‌ నెలకొంది.

చదవండి: సమంత అనారోగ్యంపై స్పందించిన మరో అక్కినేని హీరో, వెంకటేశ్‌ కూతురు

అందుకే అవతార్‌ థియేట్రికల్‌ రైట్స్‌ను దక్కించుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్స్‌ ఆసక్తిగా ఉన్నారట. దీంతో తెలుగులో ఈ మూవీ దాదాపు రూ.100 కోట్లకు పైగా ధర పలుకుతున్నట్లు వినికిడి. పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి ఈ సినిమాను కొనే ఆలోచనలో ఉన్నారని సినీ వర్గాల నుంచి సమాచారం. ఇందుకు సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి విడుదలకు ముందే ఇన్ని వండర్స్‌ క్రియేట్‌ చేస్తున్న ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement