'2017లో అవతార్ సీక్వెల్' | avatar sequel is in 2017: james cameron | Sakshi
Sakshi News home page

'2017లో అవతార్ సీక్వెల్'

Published Thu, Jan 15 2015 7:33 PM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

'2017లో అవతార్ సీక్వెల్'

'2017లో అవతార్ సీక్వెల్'

అమెరికా : తాను తీస్తున్న 'అవతార్' సినిమా సీక్వెళ్ల విడుదలకు మరో మూడేళ్లు సమయం పడుతుందని ఆ చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్ వెల్లడించారు.    ఆ చిత్ర మొదటి సీక్వెల్ 2017 లో విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రం నిర్మాణం కోసం చాలా అంకిత భావంతో పనిచేయాల్సి ఉందన్నారు. ఈ మూడు చిత్రాల నిర్మాణంలో కొంత వ్యత్యాసం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నెలాఖరు లోపు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కామెరూన్ వివరించారు.

అలాగే ఈ మూడు చిత్రాల షూటింగ్ సమాంతరంగా జరిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ మూడు చిత్రాలు ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉంటాయని....  ఈ చిత్రాలన్నింటిని న్యూజిలాండ్లో షూటింగ్ జరుపుతామన్నారు. ఈ చిత్రాల మాతృక అయిన అవతార్ చిత్రం  కూడా న్యూజిలాండ్లోనే షూటింగ్ జరిపిన సంగతిని జేమ్స్ కామెరూన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement