టైటానిక్ మూవీ నటి, ఆస్కార్ గ్రహిత కేట్ విన్స్‌లెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ వన్నే తరగని అందం, గ్లామర్‌తో యంగ్ హీరోయిన్లకు తీసుపోని విధంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇటీవల ఆమె ఒక పాడ్‌కాస్ట్‌లో లైంగిక సామర్థ్యం తగ్గిపోవడం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. అలాగే ఆ కార్యక్రమంలో ప్రేకక్షుల ప్రశ్నలకు సమాధానమిస్తూ..టెస్టోస్టెరాన్ రీప్లెస్‌మెంట్ థెరపీ చేయించకున్నట్లు తెలిపింది. అసలేంటిది? ఇది మహిళలను ఎలా ప్రభావితం చేస్తుంది అంటే.?.
ఈ థెరపీ ఎందుకంటే..
నిజానికి మూడు పదుల వయసు దాటేప్పటికీ కొందరిలో హర్మోన్ల అసమతుల్యత వల్ల లైంగిక కోరికలు తగ్గిపోతుంటాయి. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవన విధానం, పనుల్లో ఉండే ఒత్తిడి తదితర వాటి వల్ల ఈ సమస్యను పురుషులు, స్త్రీలు ఇద్దరూ ఎదర్కొంటుంటారు. ఇది వారి వైవాహిక జీవితాన్ని కూడా దెబ్బతీయొచ్చు.
పూర్తి దాంపత్య జీవితాన్ని అనుభవించక మునుపే చాలా తొందరగా ఈ సామర్థ్యం తగ్గిపోతుంటుంది. ప్రస్తుత జీవన విధానంలోని లోపాల కారణంగా మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది. దాన్ని మెరుగుపరుచుకునేందుకే ఈ టెస్టోస్టెరాన్ థెరపీ చేయించకుంటారు. ఇది కేవలం శారరీక ఆనందం కోసమే గాక, ఆరోగ్యపరంగానూ ఈ థెరపీ మహిళలకు అవసరం.
ఎలా ప్రభావితం చేస్తుందంటే..
టెస్టోస్టెరాన్ అనేది ప్రతి ఒక్కిరిలో ఉండే లైంగిక హార్మోన్. అయితే పురుషలలో ఈ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఈ ఆండ్రోజెన్ మహిళల్లో కేవలం లైంగిక సామర్థ్యాన్నే గాక మొత్తం ఆరోగ్యాన్నే ప్రభావితం చేస్తుంది. ఇది సంతానోత్పోత్తని నిర్ణయించడంలో, కొత్త రక్తకణాలు తయారు చేయడంలో, మానసిక ఆరోగ్యం, కండరాలు, ఎముకల పనీతీరు బలోపేతం చేయడంలోనే కీలకంగా ఉంటుంది.
అయితే వయసు పెరిగే కొద్దీ మహిళల్లో ఈ టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. మహిళలు కూడా దీన్ని తేలిగ్గా తీసుకుంటారు. అది క్రమేణ వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎముకల సాంద్రత తగ్గిపోవడం, హార్మోన్ల అసమతుల్యత, మూడ్‌స్వింగ్‌ల నుంచి లైంగిక వాంఛలు తగ్గడం వరకు పలు ప్రతికూల ప్రభావాలు కలిగిస్తుంది.
టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ అంటే..?
టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (TRT) అనేది తక్కువ టెస్టోస్టెరాన్ ఉన్న వ్యక్తులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి రూపొందించబడిన వైద్య చికిత్స. దీన్ని తీసుకోవడం వల్ల మెరుగైన మానసిక స్థితి ఉంటుంది. ఆందోళన దూరం అవుతుంది.
అలాగే ఎముకల సమస్యల నుంచి బయటపడతారు. కండరాలు బలోపేతం అవుతాయి కూడా. తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు ఉన్న మహిళలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే దీన్ని వైద్యుల పర్యవేక్షలోనే తీసుకోవాల్సి ఉంటుంది.
(చదవండి: వాపింగ్ ఇంత ప్రమాకరమైనదా..? ఆ మహిళ ఊపిరితిత్తుల్లో ఏకంగా..!)
Comments
Please login to add a commentAdd a comment