Testosterone
-
టైటానిక్ మూవీ నటి 48 ఏళ్ల వయసులో థెరపీ! మహిళలకు మంచిదేనా..?
టైటానిక్ మూవీ నటి, ఆస్కార్ గ్రహిత కేట్ విన్స్లెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ వన్నే తరగని అందం, గ్లామర్‌తో యంగ్ హీరోయిన్లకు తీసుపోని విధంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇటీవల ఆమె ఒక పాడ్‌కాస్ట్‌లో లైంగిక సామర్థ్యం తగ్గిపోవడం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. అలాగే ఆ కార్యక్రమంలో ప్రేకక్షుల ప్రశ్నలకు సమాధానమిస్తూ..టెస్టోస్టెరాన్ రీప్లెస్‌మెంట్ థెరపీ చేయించకున్నట్లు తెలిపింది. అసలేంటిది? ఇది మహిళలను ఎలా ప్రభావితం చేస్తుంది అంటే.?. ఈ థెరపీ ఎందుకంటే..నిజానికి మూడు పదుల వయసు దాటేప్పటికీ కొందరిలో హర్మోన్ల అసమతుల్యత వల్ల లైంగిక కోరికలు తగ్గిపోతుంటాయి. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవన విధానం, పనుల్లో ఉండే ఒత్తిడి తదితర వాటి వల్ల ఈ సమస్యను పురుషులు, స్త్రీలు ఇద్దరూ ఎదర్కొంటుంటారు. ఇది వారి వైవాహిక జీవితాన్ని కూడా దెబ్బతీయొచ్చు.పూర్తి దాంపత్య జీవితాన్ని అనుభవించక మునుపే చాలా తొందరగా ఈ సామర్థ్యం తగ్గిపోతుంటుంది. ప్రస్తుత జీవన విధానంలోని లోపాల కారణంగా మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది. దాన్ని మెరుగుపరుచుకునేందుకే ఈ టెస్టోస్టెరాన్ థెరపీ చేయించకుంటారు. ఇది కేవలం శారరీక ఆనందం కోసమే గాక, ఆరోగ్యపరంగానూ ఈ థెరపీ మహిళలకు అవసరం. ఎలా ప్రభావితం చేస్తుందంటే.. టెస్టోస్టెరాన్ అనేది ప్రతి ఒక్కిరిలో ఉండే లైంగిక హార్మోన్. అయితే పురుషలలో ఈ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఈ ఆండ్రోజెన్ మహిళల్లో కేవలం లైంగిక సామర్థ్యాన్నే గాక మొత్తం ఆరోగ్యాన్నే ప్రభావితం చేస్తుంది. ఇది సంతానోత్పోత్తని నిర్ణయించడంలో, కొత్త రక్తకణాలు తయారు చేయడంలో, మానసిక ఆరోగ్యం, కండరాలు, ఎముకల పనీతీరు బలోపేతం చేయడంలోనే కీలకంగా ఉంటుంది. అయితే వయసు పెరిగే కొద్దీ మహిళల్లో ఈ టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. మహిళలు కూడా దీన్ని తేలిగ్గా తీసుకుంటారు. అది క్రమేణ వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎముకల సాంద్రత తగ్గిపోవడం, హార్మోన్ల అసమతుల్యత, మూడ్స్వింగ్ల నుంచి లైంగిక వాంఛలు తగ్గడం వరకు పలు ప్రతికూల ప్రభావాలు కలిగిస్తుంది. టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే..?టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ (TRT) అనేది తక్కువ టెస్టోస్టెరాన్ ఉన్న వ్యక్తులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి రూపొందించబడిన వైద్య చికిత్స. దీన్ని తీసుకోవడం వల్ల మెరుగైన మానసిక స్థితి ఉంటుంది. ఆందోళన దూరం అవుతుంది. అలాగే ఎముకల సమస్యల నుంచి బయటపడతారు. కండరాలు బలోపేతం అవుతాయి కూడా. తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు ఉన్న మహిళలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే దీన్ని వైద్యుల పర్యవేక్షలోనే తీసుకోవాల్సి ఉంటుంది. (చదవండి: వాపింగ్ ఇంత ప్రమాకరమైనదా..? ఆ మహిళ ఊపిరితిత్తుల్లో ఏకంగా..!) -
సెమెన్యాకు ఎదురుదెబ్బ
లుసానే: దక్షిణాఫ్రికా విఖ్యాత రన్నర్, 800 మీటర్ల విభాగంలో డబుల్ ఒలింపిక్ చాంపియన్ క్యాస్టర్ సెమెన్యాకు ఆర్బిట్రేషన్ కోర్టు (స్పోర్ట్స్)లో చుక్కెదురైంది. ఆమె అమ్మాయే అయినా ఆమెలో పురుష హార్మోన్లు ఉన్నాయని, పోటీల్లో ఆమె సామర్థ్యానికి ఇవి లబ్ది చేకూరుస్తున్నాయని అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) సెమెన్యా పాల్గొనే పోటీలపై గతంలో ఆంక్షలు విధించింది. తనపై ఐఏఏఎఫ్ ఉద్దేశపూర్వకంగా కక్ష్య సాధిస్తోందని ఆరోపిస్తూ.. ఆర్బిట్రేషన్ కోర్టులో సెమెన్యా సవాలు చేసింది. సుదీర్ఘ విచారణ తర్వాత బుధవారం ముగ్గురు జడ్జీలతో కూడిన త్రిసభ్య బెంచ్ సెమెన్యాకు ప్రతికూలంగా తీర్పునిచ్చింది. అయితే దీనిపై మరింత దృష్టి సారించాల్సిన అవసరముందని ముగ్గురు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. మహిళలకు నష్టం కలుగకుండా, వివక్షకు తావులేకుండా చూడాలని తమ తీర్పులో పేర్కొన్నారు. మరోవైపు ఇదివరకే అంతర్జాతీయ సమాజం ఐఏఏఎఫ్ తీరును నిరసించింది. ఓ అథ్లెట్ విజయం వెనుక కేవలం హార్మోన్ల ప్రభావమే ఉండదని... కఠోర శ్రమ, నిబద్ధత, సాధించాలనే తపనతోనే ఆ స్థాయికి చేరుకుంటారని పేర్కొంది. వీటన్నింటిని కాదని ఒక్క కారణం (హార్మోన్లు)తో అథ్లెట్ విజయాన్ని శంకించడం అవివేకమని పలువురు క్రీడా నిపుణులు తప్పుబట్టారు. భవిష్యత్‌లో సెమెన్యా అంత ర్జాతీయ రేసుల్లో పోటీపడాలంటే ఆమె శరీరంలోని పురుష హార్మోన్ల సంఖ్యను తగ్గించుకోవాల్సి ఉంటుంది. -
మగాడిగా మారిపోయింది..
ఓ అమ్మాయి తాను అనుకున్నది నెరవేర్చుకునేందుకు మూడేళ్లపాటు చేసిన కృషి ఫలించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా అని ఆ యువతి సాధించింది ఏ యూనివర్సిటీ సీటో.. టాప్ ఉద్యోగామో కాదు!! ఉన్నట్టుండి మగాడిగా మారిపోవడం. ఎస్సెక్స్ యూనివర్సిటీ సైకాలజీ స్టూడెంట్ జేమీ రైన్స్ అనే యువతి.. తాను అబ్బాయిగా మారాలని గట్టిగా నిర్ణయించుకుంది. జేమీకి సరిగ్గా నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు తాను అందరిలా కాకుండా భిన్నంగా ఉన్నట్లు అనిపించిందట. ఎనిమిదేళ్ల వయసులో హెయిర్ కట్ చేసుకుని తాను అబ్బాయిగా కనిపిస్తున్నట్లు అద్దంలో చూసుకునేది. కొన్నేళ్ల తర్వాత అమ్మాయిల పట్ల ఆకర్షణ కలిగి, తరచు గర్ల్ ఫ్రెండ్ షాబాను కలుసుకునేది. 18 ఏళ్లు వచ్చాక, ప్రతిరోజూ టెస్టోస్టిరాన్ హార్మోన్ తీసుకోవడం ప్రారంభించింది. అలా చేయడంతో పాటు తనలో వస్తున్న శారీరక మార్పును తెలుసుకునేందుకు ప్రతి రోజూ సెల్ఫీ తీసుకునేది. లింగమార్పిడి కోసం సర్జరీ చేయించుకోవడంతో పాటు మూడేళ్ల పాటు ప్రతి రోజూ అందుకు అవసరమైన మందులు వాడేది. మూడేళ్ల తర్వాత ఆమెగా ఉన్న జేమీ రైన్స్... పూర్తిగా అతడుగా మారిపోయాడు. హార్మోన్ తీసుకుంటున్న క్రమంలో తనలో కలిగే మార్పులను తెలుసుకునేందుకు తీసిన 1400 ఫొటోలను వీడియోగా చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. 7 లక్షల మంది ఈ వీడియోను చూశారు. ఈ వీడియో చూసిన ఓ న్యూస్ చానెల్ ఆమె నుంచి అతడుగా మారే క్రమంపై 'గర్ల్స్ టు మెన్' అనే డాక్యుమెంటరీ తీయడానికి సిద్ధమైపోయింది. ఇప్పుడు తనకు చాలా ధైర్యంగా ఉందని, ఆత్మవిశ్వాసం పెరిగిందని జేమీ అంటున్నాడు. నాలుగేళ్లుగా తనతో పరిచయం ఉన్న గర్ల్ ఫ్రెండ్ షాబా కూడా లింగమార్పిడి విషయంలో తనకు చాలా సహకారం అందించిందని చెప్పాడు. షాబా పేరెంట్స్ మొదట్లో తనతో పెళ్లికి ఒప్పుకోలేదు గానీ, పూర్తిగా అబ్బాయిగా మారిన తర్వాత వారు తనను అంగీకరించారన్నాడు. అయితే, తన పేరు ఇప్పుడు జేమీ అని చెప్పుకొచ్చాడు. -
టెస్టోస్టిరాన్ డ్రగ్ అధికమైతే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే!
న్యూయార్క్:తమ శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి తరుచు డ్రగ్స్ తీసుకుంటే ప్రమాదాన్ని కొనితెచ్చుకోవటమే అంటున్నారు నిపుణలు. శృంగారలో సమస్యలు తలెత్తెవారిలో గతంలో టెస్టోస్టిరాన్ అధికంగా తీసుకునే వారని, క్రమేపీ అది కాస్తా తగ్గుతూ వచ్చిందని పరిశోధనలో వెల్లడైంది. వైద్యుల పర్యవేక్షణలో కాకుండా శృంగారంలో కోరికలు వృద్ధి చేసుకోవడానికి డ్రగ్ర్ వాడితే సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు. గతంలో బ్రిటన్ ,అమెరికాల్లో వృద్ధులకు ఈ ఛాయలు ఎక్కువగా కనబడేవని పేర్కొన్నారు. ప్రస్తుతం టెస్టోస్టిరాన్ అధికంగా తీసుకుంటున్న వారి సంఖ్య క్రమేపీ తగ్గినట్లు పేర్కొన్నారు. ఈ డ్రగ్ అధికమైతే గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ తదితర సమస్యలకు దారి తీస్తుందన్నారు. చివరకు ప్రాణాలు కోల్పోయి కూడా అవకాశం ఉందని పరిశోధనలో తేలింది. 2000 నుంచి 2011 వరకూ పరిశోధనలో ఈ విషయాలు వెల్లడైయ్యాయి. దీనికి గాను 10 లక్షల మందిని పరీక్షించారు.