న్యూయార్క్:తమ శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి తరుచు డ్రగ్స్ తీసుకుంటే ప్రమాదాన్ని కొనితెచ్చుకోవటమే అంటున్నారు నిపుణలు. శృంగారలో సమస్యలు తలెత్తెవారిలో గతంలో టెస్టోస్టిరాన్ అధికంగా తీసుకునే వారని, క్రమేపీ అది కాస్తా తగ్గుతూ వచ్చిందని పరిశోధనలో వెల్లడైంది. వైద్యుల పర్యవేక్షణలో కాకుండా శృంగారంలో కోరికలు వృద్ధి చేసుకోవడానికి డ్రగ్ర్ వాడితే సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు. గతంలో బ్రిటన్ ,అమెరికాల్లో వృద్ధులకు ఈ ఛాయలు ఎక్కువగా కనబడేవని పేర్కొన్నారు. ప్రస్తుతం టెస్టోస్టిరాన్ అధికంగా తీసుకుంటున్న వారి సంఖ్య క్రమేపీ తగ్గినట్లు పేర్కొన్నారు.
ఈ డ్రగ్ అధికమైతే గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ తదితర సమస్యలకు దారి తీస్తుందన్నారు. చివరకు ప్రాణాలు కోల్పోయి కూడా అవకాశం ఉందని పరిశోధనలో తేలింది. 2000 నుంచి 2011 వరకూ పరిశోధనలో ఈ విషయాలు వెల్లడైయ్యాయి. దీనికి గాను 10 లక్షల మందిని పరీక్షించారు.