
ప్రతీకాత్మక చిత్రం
న్యూయార్క్ : ఇంకో నాలుగు నెలల్లో కరోనా వైరస్ బారిన పడి అమెరికా వ్యాప్తంగా దాదాపు 81 వేల మంది మరణించే అవకాశం ఉందని యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ చేసిన సర్వేలో తేలింది. అది జూన్‌లోగానే జరిగే అవకాశం కూడా ఉందని వెల్లడైంది. ఏప్రిల్ రెండో వారానికంతా ఆసుపత్రిపాలయ్యేవారి సంఖ్య అధికంగా ఉంటుందని, జులై నెలలో కూడా వైరస్ మరణాలు కొనసాగుతాయని తేలింది. జూన్ నెల తర్వాత ప్రతినిత్యం దాదాపు 10 మంది దాకా మరణించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. కాలిఫోర్నియాలో వైరస్ చాలా నిదానంగా విస్తరిస్తోందని, రానున్న రోజుల్లో వైరస్ బాధితుల సంఖ్య అక్కడ అధికంగా ఉండొచ్చని అభిప్రాయ ప్రాయపడింది. ( న్యూయార్క్, న్యూజెర్సీలలో భయం.. భయం! )
కాగా, అమెరికాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం వైరస్ బాధితుల సంఖ్య లక్షను దాటింది. నిన్న ఒక్కరోజే 16 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. అమెరికా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1300 మంది మృత్యువాత పడ్డారు. 40, 50 ఏళ్ల వయసులో ఉన్న వారు ఎక్కువగా మరణించడంపై అమెరికా ప్రజలలో ఆందోళన మొదలైంది. అయితే ప్రజలెవరూ రక్షణ చర్యలు చేపట్టడం లేదని, చేతులు శుభ్రంగా కడుక్కోవడం లేదని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కేసుల్లో సగం న్యూయార్క్ నగరంలో నమోదు కావటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment