Testosterone hormone
-
టైటానిక్ మూవీ నటి 48 ఏళ్ల వయసులో థెరపీ! మహిళలకు మంచిదేనా..?
టైటానిక్ మూవీ నటి, ఆస్కార్ గ్రహిత కేట్ విన్స్లెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ వన్నే తరగని అందం, గ్లామర్‌తో యంగ్ హీరోయిన్లకు తీసుపోని విధంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇటీవల ఆమె ఒక పాడ్‌కాస్ట్‌లో లైంగిక సామర్థ్యం తగ్గిపోవడం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. అలాగే ఆ కార్యక్రమంలో ప్రేకక్షుల ప్రశ్నలకు సమాధానమిస్తూ..టెస్టోస్టెరాన్ రీప్లెస్‌మెంట్ థెరపీ చేయించకున్నట్లు తెలిపింది. అసలేంటిది? ఇది మహిళలను ఎలా ప్రభావితం చేస్తుంది అంటే.?. ఈ థెరపీ ఎందుకంటే..నిజానికి మూడు పదుల వయసు దాటేప్పటికీ కొందరిలో హర్మోన్ల అసమతుల్యత వల్ల లైంగిక కోరికలు తగ్గిపోతుంటాయి. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవన విధానం, పనుల్లో ఉండే ఒత్తిడి తదితర వాటి వల్ల ఈ సమస్యను పురుషులు, స్త్రీలు ఇద్దరూ ఎదర్కొంటుంటారు. ఇది వారి వైవాహిక జీవితాన్ని కూడా దెబ్బతీయొచ్చు.పూర్తి దాంపత్య జీవితాన్ని అనుభవించక మునుపే చాలా తొందరగా ఈ సామర్థ్యం తగ్గిపోతుంటుంది. ప్రస్తుత జీవన విధానంలోని లోపాల కారణంగా మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది. దాన్ని మెరుగుపరుచుకునేందుకే ఈ టెస్టోస్టెరాన్ థెరపీ చేయించకుంటారు. ఇది కేవలం శారరీక ఆనందం కోసమే గాక, ఆరోగ్యపరంగానూ ఈ థెరపీ మహిళలకు అవసరం. ఎలా ప్రభావితం చేస్తుందంటే.. టెస్టోస్టెరాన్ అనేది ప్రతి ఒక్కిరిలో ఉండే లైంగిక హార్మోన్. అయితే పురుషలలో ఈ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఈ ఆండ్రోజెన్ మహిళల్లో కేవలం లైంగిక సామర్థ్యాన్నే గాక మొత్తం ఆరోగ్యాన్నే ప్రభావితం చేస్తుంది. ఇది సంతానోత్పోత్తని నిర్ణయించడంలో, కొత్త రక్తకణాలు తయారు చేయడంలో, మానసిక ఆరోగ్యం, కండరాలు, ఎముకల పనీతీరు బలోపేతం చేయడంలోనే కీలకంగా ఉంటుంది. అయితే వయసు పెరిగే కొద్దీ మహిళల్లో ఈ టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. మహిళలు కూడా దీన్ని తేలిగ్గా తీసుకుంటారు. అది క్రమేణ వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎముకల సాంద్రత తగ్గిపోవడం, హార్మోన్ల అసమతుల్యత, మూడ్స్వింగ్ల నుంచి లైంగిక వాంఛలు తగ్గడం వరకు పలు ప్రతికూల ప్రభావాలు కలిగిస్తుంది. టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే..?టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ (TRT) అనేది తక్కువ టెస్టోస్టెరాన్ ఉన్న వ్యక్తులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి రూపొందించబడిన వైద్య చికిత్స. దీన్ని తీసుకోవడం వల్ల మెరుగైన మానసిక స్థితి ఉంటుంది. ఆందోళన దూరం అవుతుంది. అలాగే ఎముకల సమస్యల నుంచి బయటపడతారు. కండరాలు బలోపేతం అవుతాయి కూడా. తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు ఉన్న మహిళలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే దీన్ని వైద్యుల పర్యవేక్షలోనే తీసుకోవాల్సి ఉంటుంది. (చదవండి: వాపింగ్ ఇంత ప్రమాకరమైనదా..? ఆ మహిళ ఊపిరితిత్తుల్లో ఏకంగా..!) -
డయాబెటిస్‌కు.. టెస్టోస్టిరాన్‌కు లింకు!
ఆస్ట్రేలియా: పురుష హార్మోన్ టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్లతో మధుమేహం బారిన పడకుండా నివారించొచ్చా..? అది సాధ్యమే అంటున్నారు ఆస్ట్రేలియాలోని అడిలైడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. సుమారు వెయ్యి మందిపై తాము ప్రయోగాలు నిర్వహించి ఈ అంచనాకు వచ్చామని చెబుతున్నారు. ఈ స్థాయిలో ఇదివరకు ఎన్నడూ ప్రయోగాలు జరగలేదని పేర్కొంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. ఈ పురుష హార్మోన్ స్థాయి తక్కువగా ఉన్న వారు మధుమేహం బారిన పడొచ్చని ఇప్పటికే కొన్ని పరిశోధనలు స్పష్టం చేశాయి. టెస్టోస్టిరాన్ తక్కువగా ఉన్నప్పుడు లైంగిక కోరికలు తగ్గడంతో పాటు కండరాలు బలహీనపడతాయి. ఎముకలు గుల్ల బారడమూ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అడిలైడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధనలు చేశారు. 50 నుంచి 74 ఏళ్ల మధ్య వయసున్న సుమారు వెయ్యి మందిని ఎంపిక చేసి.. రెండు గుంపులుగా విడదీశారు. ప్రయోగాలకు ఎంపికైన వారందరూ అధిక బరువు లేదా ఊబకాయం సమస్యతో బాధపడుతున్న వారే. ఒక వర్గానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్ ఇచ్చారు. వెయ్యి మంది అనుసరించేందుకు కొన్ని వ్యాయామాలను సూచించారు. రెండేళ్ల పరిశీలనల తర్వాత పరిశీలించగా ఇరు వర్గాల్లోని వారు సగటున నాలుగు కిలోల బరువు తగ్గారు. సుమారు 22 శాతం మందిలో ఎర్ర రక్త కణాల సంఖ్య ఎక్కువయ్యాయి. రెండో గుంపు వారిలో 21 శాతం మంది మధుమేహం బారిన పడగా.. టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్లు తీసుకున్న వారిలో 12 శాతం మందికి మాత్రమే మధుమేహం వచ్చింది. హార్మోన్ తీసుకున్న వారి రక్తంలో చక్కెర మోతాదు గణనీయంగా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీన్నిబట్టి మధుమేహం నుంచి తప్పించుకునేందుకు కొంతమందికి టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్లు ఓ మార్గం కావచ్చని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. కొత్త సోలార్ సెల్స్ భలే! ఖరీదైన సిలికాన్‌తో తయారయ్యే సోలార్సెల్స్కు సమర్థమైన ప్రత్యామ్నాయం లభించింది.పెరోవెక్సైట్ అనే వినూత్న పదార్థంతో తయారు చేసిన సరికొత్త సోలార్ సెల్స్ ఏకంగా 30 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నట్లు తాజా పరిశోధనల ద్వారా స్పష్టమైంది. నిజానికి పెరోవెస్కైట్ అనేది ఇటీవలే గుర్తించిన పదార్థమేమీ కాదు. దశాబ్దకాలం కిందటే దీన్ని సౌరశక్తి ఉత్పత్తికి వినియోగించొచ్చని గుర్తించారు. కాకపోతే అప్పట్లో ఈ పదార్థంతో తయారైన సోలార్ సెల్స్ సామర్థ్యం చాలా తక్కువగా ఉండేది. పెరోవెస్కైట్ ప్రత్యేకత ఏంటంటే.. చాలా చౌకగా లభిస్తుంది. దృశ్య కాంతి నుంచి పరారుణ కిరణాల వరకు అన్ని రకాల రేడియోధార్మికతను శోషించుకుని విద్యుత్తుగా మార్చగలదు. సిలికాన్ మాదిరిగా తయారీ కష్టం కాదు. ఎక్కడ కావాలంటే అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో జర్మనీలోని హెల్మ్హోల్ట్ –జెంట్రమ్ శాస్త్రవేత్తలు తయారు చేసిన పెరోవెక్సైట్ సోలార్ సెల్స్ 30 శాతం సామర్థ్యాన్ని సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఐదేళ్ల కింద ఈ సెల్స్ సామర్థ్యం 13.7 శాతం మాత్రం ఉంది. -
ఆడకూడదా?
అధ్యయనం టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా ఉన్న స్త్రీలు క్రీడలలో సాటి స్త్రీల కంటే ఎక్కువ శక్తిని ప్రదర్శించ గలరని నిరూపిస్తున్న తాజా అధ్యయనం ద్యుతీ చంద్ వంటి క్రీడాకారిణుల భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది! ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న భారత అథ్లెట్ ద్యుతీచంద్‌కు ఇది నిజంగా షాకింగ్ వార్తే...! గతంలో తాను ఎదుర్కొన్న లింగ నిర్ధారణ కేసు మరోసారి తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె శరరీంలోని పురుష హార్మోన్ల మద్దతుతోనే తను ఇతరులకన్నా ఎక్కువ లాభపడుతోందని గతంలో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘం (ఐఏఏఎఫ్) ద్యుతీని నిషేధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించి మరిన్ని సాక్ష్యాలతో క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సీఏసీ)ను ఆశ్రయించాలని ఐఏఏఎఫ్ నిర్ణయించింది. ద్యుతీ చంద్, భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ), ఐఏఏఎఫ్ మధ్య సాగిన ఈ వివాదాస్పద కేసు రెండేళ్ల క్రితం సీఏఎస్ ముందుకు వచ్చింది. అప్పట్లో విచారణ జరిపిన సీఏఎస్ 2015, జూలై 27న ద్యుతీపై ఐఏఏఎఫ్ విధించిన నిషేధాన్ని రెండేళ్ల పాటు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు ఇచ్చే వరకు తను పోటీల్లో పాల్గొనవచ్చని సీఏఎస్ చెప్పడంతో ఊరట చెందిన ద్యుతి... అప్పటి నుంచి యథావిధిగా పోటీల్లో పాల్గొంటోంది. అయితే ఈ నెలలోనే రెండేళ్ల గడువు ముగియనుండడంతో ఐఏఏఎఫ్ మరోసారి ద్యుతిపై పోరాటానికి సిద్ధమవుతోంది. హైపరాండ్రోజెనిక్ హార్మోన్లు కలిగిన మహిళా అథ్లెట్లు మామూలు టెస్టోస్టిరాన్ స్థాయి కలిగిన వారితో పోల్చితే భిన్నంగా ఉంటారని ఐఏఏఎఫ్ తన నివేదికలో పేర్కొననుంది. దీన్ని అవకాశంగా తీసుకుని ఆయా అథ్లెట్స్ వివిధ పోటీల్లో 1.8 శాతం నుంచి 4.5 శాతం వరకు ఇతర మహిళా అథ్లెట్లకన్నా ఎక్కువ ఫలితం పొందగలరని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించిన ఆర్టికల్‌ను ఐఏఏఎఫ్ సాక్ష్యంగా పేర్కొననుంది. గతంలో జరిగిందిదీ... ఉండాల్సిన స్థాయికన్నా అధికంగా పురుష హార్మోన్లు (టెస్టోస్టిరాన్) ఉన్నట్టు పరీక్షలో తేలడంతో ఐఏఏఎఫ్ హైపరాండ్రోజెనిజమ్ పాలసీ ప్రకారం 2014లో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ద్యుతీచంద్‌పై వేటు వేసింది. అయితే ఏఎఫ్‌ఐపై ఆ ఏడాది సెప్టెంబర్‌లో ఆమె సీఏఎస్‌లో సవాల్ చేసింది. ఈ విషయంలో ద్యుతికి క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి ఆర్థికంగా సహాయం కూడా అందింది. అయితే ఆమెలో పురుష హార్మోన్లు ఇతరులకన్నా అధికంగా ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు లేవని క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు 2015 జూలై 27న మధ్యంతర తీర్పునిచ్చి ఊరట కలిగించింది.