Titanic Actor Lew Palter Passes Away Due To Lung Cancer - Sakshi
Sakshi News home page

Lew Palter: విషాదం.. క్యాన్సర్‌తో ‘టైటానిక్‌’ నటుడు మృతి

Published Tue, Jun 27 2023 12:03 PM | Last Updated on Tue, Jun 27 2023 12:12 PM

Titanic Actor Lew Palter Passed Away Due To Lung Cancer - Sakshi

చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తమదైన నటనతో ఎంతో కాలంగా ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటులు ఒక్కొక్కరు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారు. తాజాగా 'టైటానిక్' నటుడు లేవ్‌ పాల్టర్‌(94) కన్నుమూశారు.గత కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధ పడుతున్న పాల్టర్‌  మే 21, 2023న 94న లాస్ ఏంజిల్స్ ఇంట్లో మరణించాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా బయటి ప్రపంచానికి తెలిసింది. దాదాపు నెల రోజుల తర్వాత ఈ విషయాన్ని  పాల్టర్‌ కూతురు  కేథరీన్ పాల్టర్ మీడియాతో వెల్లడించింది.

లేవ్‌ పాల్టర్‌ పూర్తి పేరు లియోన్ లూయిస్ పాల్టర్‌.నవంబర్ 3, 1928న న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో జన్మించాడు. రంగస్థలం నటుడిగా కెరీర్‌ ప్రారంభించి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. టెలివిజన్‌ రంగంలోనూ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. జేమ్స్‌ కేమెరూన్‌ తెరకెక్కించిన ‘టైటానిక్‌’ మూవీతో పాల్టర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ చిత్రంలో డిపార్ట్‌మెంట్ స్టోర్ మాగ్నెట్ ఇసిడోర్ స్ట్రాస్ పాత్రను పోషించాడు.పాల్టర్‌ మరణ వార్త తెలియగానే టైటానిక్‌ టీమ్‌తో పాటు ఆయన అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement