గర్ల్ఫ్రెండ్ వద్దకు ప్రతిరోజూ ఫ్లైట్లో..
లండన్: టైటానిక్ హీరో.. ఇటీవల రెవనాంట్ చిత్రంలో అద్భుతమైన నటనతో ఆస్కార్ అవార్డును దక్కించుకున్న ప్రముఖ హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో కాలు ఇప్పుడు ఓ చోట నిలవడం లేదంట. ఆయన ప్రతి రోజు ప్లైట్ లో వెళ్లి వస్తున్నాడంట. అది సినిమా షూటింగ్ కోసం అనుకుంటే భ్రమపడ్డట్టే. ఎందుకంటే ఆయన ఇప్పుడు విమానంలో ఎగురుతుంది ఓ గర్ల్ ఫ్రెండ్ కారణంగా. ఇటీవలె ఆమెపై మనసు పారేసుకున్న డికాప్రియో ఆమెకు ఫిదా అయ్యి ఎస్సెక్స్ లో ఉంటున్న ఆమె వద్దకు ప్రతి రోజు విమానంలో వెళ్లి వస్తున్నాడని హాలీవుడ్ వర్గాలు గుప్పుమంటున్నాయి.
డికాప్రియో ఆమెతో చాలా గాఢంగా డేటింగ్ చేస్తున్నాయని చెబుతున్నాయి. ఆమె ఎవరో కాదు.. మొన్నటి వరకు ఓ బాయ్ ఫ్రెండ్తో ఉంటూ ఇటీవలే అతడికి గుడ్ బాయ్ చెప్పిన మోడల్ రాక్సీ హార్నర్. ఎస్సెక్స్ కు చెందిన రాక్సీ హార్నర్ ఇటీవల తన మాజీ బాయ్ ఫ్రెండ్ జోఎక్స్ కు టాటా చెప్పింది. అనంతరం డికాప్రియోకు దగ్గరయింది. గత మంగళవారం కూడా ప్రత్యేకంగా బ్రిటన్ వెళ్లిన డికాప్రియో ఆమెతో బార్లలో చిందులు, నైట్ క్లబ్బుల్లో షికార్లు, అనంతరం లండన్లోని చిల్టర్న్ ఫైర్ హౌజ్ అనే హోటల్ లో ఉన్నారంట. అంతేకాకుండా పలు మ్యూజిక్ పార్టీల్లో డికాప్రియో ఆమెతో కలిసి చిందులేస్తున్నాడట.