'ప్రముఖులకు, అభిమానులకు ఫుట్ బాల్ ఫీవర్'
ముంబై: ప్రపంచకప్ ఫుట్ బాల్ ఫీవర్ విశ్వవ్యాప్తంగా అభిమానులను పట్టుకుంది. ప్రముఖులు, రాజకీయ నేతలు, అభిమానులు ఉత్సాహంగా ఫుట్ బాల్ టోర్ని కోసం ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఫుట్ బాల్ అభిమానులు టెలివిజన్ ప్రసారాన్ని తిలకించేందుకు సిద్ధమవుతున్నారు.
వరల్ట్‌కప్ ఫుట్‌బాల్ టోర్నిని తిలకించే విధంగా బ్రెజిల్ వెళ్లేందుకు ఆరుగురు గోవా ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అనుమతించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అభిమానులు బ్రిజిల్ కు చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు.
హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో తన 21 స్నేహితులతో బ్రెజిల్ కు ప్రయాణమయ్యారు. రియో డి జెనిరో లోని విలాసవంతమైన టోపాజ్ మైదానంలో ఫుట్ బాల్ మ్యాచ్ వీక్షించనున్నారు.
బాలీవుడ్ లో కూడా ఫుట్ బాల్ క్రేజ్ ఊపందుకుంది. బాలీవుడ్ నటులు రితేష్ దేశ్ ముఖ్, జెనిలియా డిసౌజా, రామ్ కుమార్, ఇషా గుప్తాలు లు ఉత్సాహంతో మ్యాచ్ లు చూసేందుకు ఎదురు చూస్తున్నారు. 2014 ఫిఫా వరల్డ్ కప్ పోటిలు బ్రెజిల్ లో గురువారం ఆరంభం కానున్నాయి.