హాలీవుడ్ హీరో, టైటానిక్ ఫేమ్ లియోనార్డో డికాప్రియో డేటింగ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అవివాహితుడైన 43 ఏళ్ల డికాప్రియో ఇప్పటిదాకా డజను పైగా అమ్మాయిలతో అఫైర్లు నడిపాడు. తాజాగా అర్జెంటీనా మోడల్, నటి కమిలా మోర్రోనె(20)తో డికాప్రియో డేటింగ్‌లో ఉన్నాడు.
ఫేజ్ సిక్స్ సంచిక ఈ మేరకు డికాప్రియో రొమాంటిక్ లైఫ్‌పై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కమిలా అతని కన్నా వయసులో 23 ఏళ్లు చిన్నది కాగా.. కమిలా తల్లి వయసు కూడా డికాప్రియో కన్నా రెండేళ్లు తక్కువే కావటం గమనార్హం. గత డిసెంబర్ నైనా అగ్దల్‌తో విడిపోయి.. కమిలియా తో రిలేషన్ షిప్ మొదలుపెట్టారు. పలు ఈవెంట్లలో వీరిద్దరూ కలిసి జంటగా చక్కర్లు కొడుతున్నారు.
కాగా, 1997లో బ్రిటీష్ సింగర్ ఎమ్మా బంటన్‌తో మొదలైన ఈ డేటింగ్ వ్యవహారం ఇప్పుడు కమిలియాతో కొనసాగుతోంది. డికాప్రియో డేటింగ్ చేసిన వారిలో బిజౌ ఫిలిప్స్, క్రిస్టన్ జంగ్, ఎమ్మా మిల్లర్, గిసెలె బుంద్చన్, బార్ రఫైలి ఉన్నారు. ఇక 2010లో మోడల్ అరెథా విల్సన్‌తో డేటింగ్ వ్యవహారం బెడిసి కొట్టడం.. ఆమె బాటిల్‌తో డికాప్రియో తల పగలకొట్టడం.. ఆపై ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష... అతని రొమాంటిక్ లైఫ్‌లో ఓ చేదు అనుభవంగా మిలిగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment