అప్పట్లో ఒకడుండేవాడు | Al Pacino Joins Quentin Tarantino's Once Upon a Time in Hollywood | Sakshi
Sakshi News home page

అప్పట్లో ఒకడుండేవాడు

Published Sat, Jun 9 2018 12:33 AM | Last Updated on Sat, Jun 9 2018 8:22 AM

Al Pacino Joins Quentin Tarantino's Once Upon a Time in Hollywood - Sakshi

క్వెంటిన్‌ టరంటినో

ఏదైనా కథ చెప్పాలంటే అనగనగా లేదా అప్పట్లో ఒకడుండేవాడు అని మొదలుపెడతాం. హాలీవుడ్‌ డైరెక్టర్‌ క్వెంటిన్‌ టరంటినో కూడా తన లేటెస్ట్‌ కథను ఇలానే చెప్పబోతున్నారు. బ్రాడ్‌ పిట్, ఆల్‌ పాచినో, లియోనార్డో డికాప్రియో ముఖ్య తారలుగా దర్శకుడు క్వెంటిన్‌ రూపొందించనున్న చిత్రం ‘వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌’. 1969 కాలంలో ఫేడవుట్‌ అయిపోయిన టీవీ సిరీస్‌ యాక్టర్, అతని బాడీ డబుల్‌  సర్వైవ్‌ అవ్వడానికి పడ్డ స్ట్రగుల్‌ ఏంటో ఈ సినిమాలో చూపించదలిచారట క్వెంటిన్‌. ఫేడవుట్‌ అయిన హీరోగా బ్రాడ్‌ పిట్, బాడీ డబుల్‌ క్యారెక్టర్‌లో లియొనార్డో డీ కాప్రియో నటించనున్నారు. 2019లో  ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. రక్తం ధారలై ప్రవహించకపోతే రుచించని క్వెంటిన్‌ ఒక ఫెయిల్డ్‌ యాక్టర్‌ జీవితాన్ని ఎలా చూపిస్తారోనని  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆయన ఫ్యాన్స్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement