మాజీ భర్త సినిమాకు నో​ చెప్పిన హీరోయిన్‌ | Jolie quits movie to avoid working with Pitt | Sakshi
Sakshi News home page

మాజీ భర్త సినిమాకు నో​ చెప్పిన హీరోయిన్‌

Published Sun, Sep 25 2016 9:43 AM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

మాజీ భర్త సినిమాకు నో​ చెప్పిన హీరోయిన్‌

మాజీ భర్త సినిమాకు నో​ చెప్పిన హీరోయిన్‌

లాస్‌ ఏంజిలెస్‌: హాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, దర్శకురాలు ఏంజెలినా జోలీ ఓ సినిమా ఆఫర్‌ను వదులుకుంది. తన మాజీ భర్త బ్రాడ్‌ పిట్‌ ఈ సినిమాలో నటిస్తుండటంతో, అతనితో కలసి పనిచేసేందుకు ఇష్టంలేక ఆమె ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. బ్రాడ్‌పిట్ నుంచి ఎంజెలినా జోలీ విడాకులు కోరిన విషయం తెలిసిందే. తమ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నందున విడాకులు తీసుకుంటున్నానని కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది.

2005 నుంచి పిట్‌, జోలీ దాదాపు పదేళ్లు అన్యోన్యంగా గడిపారు. వీరిద్దరూ కలసి గతంలో సినిమాలు చేశారు. జోలీ దర్శకత్వంలో పిట్‌ రెండు సినిమాల్లో నటించాడు. పిట్‌ హీరోగా జోలీ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సివుంది. ఈ ప్రాజెక్టు చేసేందుకు జోలీ తొలుత ఆసక్తి చూపింది. అయితే ఇటీవల పిట్‌తో విడిపోవడంతో ఈ ప్రాజెక్టు చేసేందుకు నిరాకరించింది. పిట్‌తో వ్యక్తిగతంగా కానీ, వృత్తిపరంగా కానీ ఎలాంటి సంబంధాలూ కొనసాగించరాదని జోలీ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement