anjelina jolie
-
Mahakumbh 2025:‘మోనాలీసా’, ‘ఏంజలీనా జోలీ’ డస్కీ బ్యూటీ ఫోటోలు
-
ఎనిమిదేళ్ల తర్వాత విడాకులు తీసుకున్న ఏంజెలీనా జోలీ
హాలీవుడ్ కపుల్స్ ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్ విడాకులు తీసుకున్నారు. 2005లో మిస్టర్ అండ్ మిస్సెస్ సినిమా ద్వారా దగ్గరైన ఈ జంట.. తర్వాత చాలా ఏళ్లు డేటింగ్ చేసింది. 2014లో పెళ్లి చేసుకోగా.. రెండేళ్లకే ఈ జంట విడాకులకు దరఖాస్తు చేసింది. 2019 ఏప్రిల్ నుంచి తాము విడిగా ఉంటున్నట్లు ప్రకటించుకుంది. అప్పటి నుంచి పిల్లల బాధ్యతను ఇద్దరూ చూసుకుంటున్నారు. అయితే, విడాకుల తర్వాత పిల్లల బాధ్యత ఎవరిది అనే అంశాన్ని కోర్టుకు తెలపకపోవడంతో ఇన్నేళ్లుగా వారి విడాకులను కోర్టు మంజూరు చేయలేదు. అయితే, ఈ జంటకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. వారు మేజర్ అయ్యే వరకు తల్లిదండ్రులు ఇద్దరూ సంరక్షించాలని కోర్టు తెలిపింది. మొదటి నుంచి ఏంజెలీనా జోలి తన భర్త బ్రాడ్‌పిట్ పట్ల కర్కశంగా ప్రవర్తిస్తూ వస్తోంది. మీడియా మీట్లలో బ్రాడ్ పిట్ పట్ల నిర్లక్క్ష్య వైఖరి, విడాకుల పిటిషన్ వంకతో 9మిలియన్ డాలర్ల భరణం తీసుకోవడం, తాజాగా పిల్లల కస్టడీకి సంబంధించి డ్రామాతో ఆమె అభిమానులు విసిగిపోయారు. ఈ క్రమంలో బ్రాడ్ పిట్‌కు మద్ధతు పెరిగింది. బర్త్ డే పార్టీ పేరుతో తండ్రికి పిల్లల్ని దూరంగా తీసుకెళ్లిన సంఘటనలపై జోలి మీద ఫ్యాన్స్ ఫైర్ అయిన సంఘటనలు కూడా ఉన్నాయి.ఎంజెలీనా జోలీ 1996లో బ్రిటిష్-అమెరికన్ యాక్టర్ జానీ లీ మిల్లర్‌ని పెళ్లి చేసుకుని.. 18 నెలల తర్వాత విడిపోయారు. అయితే విడాకులు మాత్రం 1999లో తీసుకున్నారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో అమెరికన్ యాక్టర్ బిల్లీ బాబ్ను ఆమె రెండో పెళ్లి చేసుకుని.. మూడేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఇప్పుడు బ్రాడ్ పిట్తో కూడా తన బంధాంన్ని తెంచుకుంది. -
మాజీ భర్త చెంతకి ఎంజెలీనా జోలి.. విమర్శలు
న్యూయార్క్: హాలీవుడ్ నటి ఎంజెలీనా జోలి తీరుపై ఆమె అభిమానులే మండిపడుతున్నారు ఇప్పుడు. పిల్లల సంరక్షణ విషయంపై ఆమె భర్త బ్రాడ్ పిట్‌కి అనుకూలంగా ఈ మధ్య కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వులు పట్టించుకోకుండా ఆమె పిల్లల్ని తీసుకుని న్యూయార్క్‌కు చెక్కేసింది. ఈ తరుణంలో బ్రాడ్ పిట్ తరుపు న్యాయవాది మరోసారి కోర్టును ఆశ్రయించాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే మొదటి నుంచి జోలి తన భర్త బ్రాడ్‌పిట్ పట్ల కర్కశంగా ప్రవర్తిస్తూ వస్తోంది. మీడియా మీట్లలో బ్రాడ్ పిట్ పట్ల నిర్లక్క్ష్య వైఖరి, విడాకుల పిటిషన్ వంకతో 9మిలియన్ డాలర్ల భరణం తీసుకోవడం, తాజాగా పిల్లల కస్టడీకి సంబంధించి డ్రామాతో ఆమె అభిమానులు విసిగిపోయారు. ఈ క్రమంలో బ్రాడ్ పిట్‌కు మద్ధతు పెరుగుతోంది. బర్త్ డే పార్టీ పేరుతో తండ్రికి పిల్లల్ని దూరంగా తీసుకెళ్లిన జోలిపై హాలీవుడ్ మీడియా వెబ్ సైట్లతో పాటు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మాజీ భర్త చెంతకి.. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలోనే కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ఎంజెలీనా మాజీ భర్త జానీ లీ మిల్లర్(48)కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోందన్న కథనాలు వెలువడుతున్నాయి. బ్రిటిష్-అమెరికన్ యాక్టర్ జానీ లీ ప్రస్తుతం న్యూయార్క్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. శుక్రవారం ఆ అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన జోలి.. చాలాసేపు అక్కడే గడిపింది. దీంతో వీళ్లిద్దరూ మళ్లీ ఒక్కటి కాబోతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ చేష్టలు పిట్‌ను రెచ్చగొట్టడానికేనేమోనని హాలీవుడ్ వర్గాల కథనం. కాగా, ఎంజెలీనా, జానీ ఇద్దరూ 1996 మార్చ్‌లో పెళ్లి చేసుకుని.. 18 నెలల తర్వాత విడిపోయారు. అయితే విడాకులు మాత్రం 1999లో తీసుకున్నారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో అమెరికన్ యాక్టర్ బిల్లీ బాబ్ను రెండో పెళ్లి చేసుకుని.. మూడేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఇక ముచ్చటగా లాంగ్‌రిలేషన్ తర్వాత బ్రాడ్ పిట్‌ను 2014లో పెళ్లి చేసుకుని.. 2019లో విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది ఎంజెలీనా జోలి. చదవండి: బ్రాంజెలీనా విడిపోవడానికి కారణాలివే.. -
ఐదేళ్ల న్యాయపోరాటం.. ఎంజెలీనా జోలి ఓటమి
ఐదేళ్లుగా కొనసాగుతున్న న్యాయ పోరాటంలో హాలీవుడ్ నటి ఎంజెలీనా జోలి ఓడింది. బిడ్డల సంరక్షణ కోసం నటుడు, భర్త బ్రాడ్‌పిట్‌కి వ్యతిరేకంగా ఆమె న్యాయస్థానంలో పోరాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంలో బ్రాడ్‌పిట్‌కి అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, 2016లో వ్యక్తిగత కారణాలతో భర్త బ్రాడ్ నుంచి విడాకులు కోరుతూ.. ఏంజెలీనా జోలి విడాకులకు కోర్టును ఆశ్రయించింది. అయితే అప్పటి నుంచి కేవలం పిల్లల సంరక్షణ గురించిన పిటిషన్‌తోనే కోర్టు వ్యవహారం నడుస్తోంది. దీంతో వీళ్లకు ఇప్పటి వరకు విడాకులు మంజూరు కాలేదు. ఇక కోర్టులో వాదప్రతివాదనల కోసం జాన్ అవుడర్కిరిక్ అనే ప్రైవేట్ జడ్జ్‌ను నియమించారు. 2014 వీళ్ల పెళ్లికి అధికారిక ముద్ర వేసింది కూడా జడ్జినే. ఈ జంటకు ఆరుగురు పిల్లలు. ఐదుగురు పిల్లల సంరక్షణను బ్రాడ్‌పిట్(57)తో కలిసి పంచుకోవాలని ఎంజెలీనా జోలిని జడ్జి ఆదేశించాడు. అయితే పెద్దవాడైన మాడోక్స్ కస్టడీ గురించి ఎటూ తేల్చలేదు. ఈ తీర్పుపై జోలి మండిపడింది. జడ్జి, బ్రాడ్‌పిట్‌కు అమ్ముడుపోయాడని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోర్టు తీర్పుపై ఎంజెలీనా జోలి(45) రీ పిటిషన్ వెళ్లాలనుకుంటోంది. కొడుకు వయసున్న అమ్మాయితో.. : చదవండి ఇక 2005లో మిస్టర్ అండ్ మిస్సెస్ సినిమా ద్వారా దగ్గరైన ఈ జంట.. తర్వాత చాలా ఏళ్లు డేటింగ్ చేసింది. 2014లో పెళ్లి చేసుకోగా.. రెండేళ్లకే ఈ జంట విడాకులకు దరఖాస్తు చేసింది. 2019 ఏప్రిల్ నుంచి తాము విడిగా ఉంటున్నట్లు ప్రకటించుకుంది. అప్పటి నుంచి పిల్లల బాధ్యతను ఇద్దరూ చూసుకుంటున్నారు. అయితే విడాకుల తర్వాత పిల్లల బాధ్యత గురించే ముందుగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ క్లియర్ కావడంతో విడాకుల పిటిషన్‌కి లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. కాగా, వ్యక్తిగత సమస్యల వల్లే బ్రాడ్ పిట్తో తాను విడిపోతున్నట్లు ఎంజెలీనా ప్రకటించినా.. బ్రాడ్‌పిట్ ఎఫైర్లే అందుకు కారణాలని హాలీవుడ్ కథనాలు చెప్తున్నాయి. -
అయామ్ సో లక్కీ: ఏంజెలీనా జోలీ
ఏంజెలీనా జోలీకి పిల్లలంటే ప్రాణం. భర్త బ్రాడ్ పిట్ పిల్లల్ని చిన్న మాట అన్నాడని అతడికి విడాకులు ఇచ్చేశారు. జోలీకి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. ఈ ఆరుగురిలో ముగ్గురు కడుపున పుట్టిన వారు. ముగ్గురు కడుపుకు కట్టుకున్నవారు (అడాప్టెడ్). మాడెక్స్–19 కొ, పాక్స్–16 కొ, జహారా–15 కూ.. దత్తత తెచ్చుకున్నవాళ్లు. షిలా–14 కూ, నాక్స్–12 కొ, వివియన్–12 కూ.. జోలీకి, బ్రాడ్ కీ పుట్టిన వాళ్లు. ఈ చివరి ఇద్దరు కవలలు. ఈ తల్లీబిడ్డలు ఇప్పుడు లాస్ ఏంజెలిస్‌లోని తమ సొంత లాస్ ఫెలిజ్ భవంతిలో క్వారెంటైన్లో ఉంటున్నారు. మాడెక్స్ ఐదు నెలల క్రితమే దక్షిణ కొరియా నుంచి అమెరికా వచ్చేశాడు. అక్కడి యాన్సీ యూనివర్సిటీలో అతడు బయోకెమిస్ట్రీ స్టూడెంట్. ఇప్పుడిక ఆన్లైన్ లోనే చదువు కొనసాగుతోంది. (ఏంజెలినా విడాకుల కేసు: ఆ లాయర్‌ను తొలగించండి) మిగతా ఐదుగురివీ యూఎస్ చదువులే కనుక అంతా ఒకదేశంలో ఒకేచోట ఉన్నారు. ‘అయామ్ సో లక్కీ..’ అంటారు జోలీ తన పిల్ల సైన్యాన్ని చూసుకుని. తల్లికి అస్సలు పని పెట్టరట. చిన్న పిల్లల్ని పెద్దపిల్లలు కాసుకుని ఉంటారట. ఆగస్టు 21న జోలీ కొత్త సినిమా ‘ది వన్ అండ్ ఓన్లీ ఇవాన్’ విడుదలైంది. ఆ ప్రమోషన్ ఈవెంట్లో ఆమె ఇంటి విశేషాలు బయటికి వచ్చాయి. ఇల్లంటే జోలీకి పిల్లలే. 45 ఏళ్ల జోలీ.. పెద్ద కొడుకు మాడెక్స్ ని కంబోడియా నుంచి, రెండో కొడుకు పాక్స్‌ని వియత్నాం నుంచి, పెద్ద కూతురు జహారాను ఇథియోపియా నుంచి దత్తతు తెచ్చుకున్నారు. ‘ది వన్ అండ్ ఓన్లీ ఇవాన్’ కూడా పిల్లల సినిమానే. యానిమేటెడ్. అందులో ఒక పాత్రకు వాయిస్ ఇచ్చారు ఏంజెలీనా జోలీ. చదవండి: (అవుట్‌సైడర్స్‌కి ప్లస్ అదే!) -
త్రీ డీల్!
సౌత్‌లో ప్రస్తుతం సూపర్ పాపులర్ హీరోయిన్స్ లిస్ట్‌లో పూజాహెగ్డే ఒకరు. వరుసగా టాప్ స్టార్స్ అందరితో జోడీ కడుతున్నారు. బాలీవుడ్లో ‘హౌస్‌ఫుల్ 4’ సినిమా పూర్తి చేశారు. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తేంటంటే బాలీవుడ్ ‘బడా ప్రొడక్షన్ హౌస్ నడియాడ్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్’తో మూడు సినిమాల డీల్ కుదుర్చుకున్నారట. జుడ్వా, హౌస్‌ఫుల్, 2 స్టేట్స్, కిక్, భాఘీ చిత్రాలను నిర్మించిన సాజిద్ నడియాడ్వాలా ఈ మూడు చిత్రాలను భారీ లెవెల్లో నిర్మించనున్నారట. హౌస్‌ఫుల్ తర్వాత ఓ యాక్షన్ సినిమాను ఈ బ్యానర్లో పూజా హెగ్డే చేయబోతున్నారని తెలిసింది. ఈ సినిమా కోసం రెండు నెలల భారీ డేట్స్ కూడా ఇచ్చారట. ఇందులో ఎన్నో స్టంట్స్ ఉండబోతున్నాయని, వాటిని పూజా స్వయంగా చేయబోతున్నారని తెలిసింది. యాంజెలీనా జోలీ నటించిన హాలీవుడ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ‘టూంబ్ రైడర్’ తరహాలో ఈ చిత్రకథ సాగనుందట. త్రీ మూవీస్ డీల్‌లో భాగంగా చేసిన సినిమాలు సక్సెస్ అయితే పూజ బాలీవుడ్‌లోనూ టాప్ లిస్ట్‌లో నిలబడడం ఖాయం. -
ఈ నిర్మాత కామాంధుడు.. ఏంజెలినాపై కూడా..
న్యూయార్క్ : హాలీవుడ్ ప్రముఖ నిర్మాత హార్వే వెయిన్‌స్టన్ గురించి మరో బాంబులాంటి విషయం తెలిసింది. పలువురు హాలీవుడ్ నటీమణులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఇప్పటికే దశాబ్దకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఆ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటున్న ఆయన గురించి మరో షాకింగ్ విషయాన్ని న్యూయార్కర్ అనే మేగిజిన్ వెల్లడించింది. వెయిన్‌స్టన్ చేతిలో లైంగిక వేధింపులకు గురైన వారు పదుల సంఖ్యలో ఉన్నారని, వారిలో ప్రముఖ హాలీవుడ్ నటీమణులు ఎంజెలినా జోలి, గైనెత్ పాల్ట్రో కూడా ఉన్నారని ఆ మేగిజిన్ వెల్లడించింది. వారిద్దరు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వెయిన్ స్టన్ సినిమాలో తమ కెరీర్ ఆరంభంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తన లైంగిక వాంఛలు తీర్చాలని వేధించాడని వారు వివరించారు. దీంతో ఇప్పుడు ఆయనను దాదాపు అంతా అసహ్యించుకునే పరిస్థితి ఎదురైంది. ఇక అమెరికాలో పెద్ద పార్టీ అయినా డెమొక్రటిక్ కూడా షాక్‌కు గురైంది. ఎందుకంటే వెయిన్‌స్టన్ ఎప్పటి నుంచో ఈ పార్టీకి పెద్ద విరాళదాత. ఆయనపై వచ్చే ఆరోపణలు కూడా గతంలో డెమొక్రాట్లు కొట్టిపడేసేవారు. అయితే, తాజాగా ఆయన నిజస్వరూపాన్ని మేగిజిన్ మరోసారి ఆధారాలతో సహా వెల్లడించడంతో ఆ పార్టీకి షాక్ తగిలినట్లయింది. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూతురు మాలియా కూడా ఈయన వద్దే ఇంటర్న్‌షిప్ చేస్తోంది. దాదాపు ఎనిమిదిమందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గతంలో టైమ్స్ వెల్లడించగా ఇప్పుడు ఎంజెలీనావంటి నటీమణులను కూడా ఆయన వదలలేదని తెలియడం, వారు కూడా ఈ విషయం చెప్పడం మూలిగేనక్కపై తాటి పండు పడ్డ చందాన ఆయన పరిస్థితి తయారైంది. దీనిపై హిల్లరీ క్లింటన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలను ఏమాత్రం సహించరాదని అన్నారు. -
మాజీ భర్త సినిమాకు నో చెప్పిన హీరోయిన్
లాస్ ఏంజిలెస్: హాలీవుడ్ స్టార్ హీరోయిన్, దర్శకురాలు ఏంజెలినా జోలీ ఓ సినిమా ఆఫర్‌ను వదులుకుంది. తన మాజీ భర్త బ్రాడ్ పిట్ ఈ సినిమాలో నటిస్తుండటంతో, అతనితో కలసి పనిచేసేందుకు ఇష్టంలేక ఆమె ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. బ్రాడ్‌పిట్ నుంచి ఎంజెలినా జోలీ విడాకులు కోరిన విషయం తెలిసిందే. తమ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నందున విడాకులు తీసుకుంటున్నానని కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. 2005 నుంచి పిట్, జోలీ దాదాపు పదేళ్లు అన్యోన్యంగా గడిపారు. వీరిద్దరూ కలసి గతంలో సినిమాలు చేశారు. జోలీ దర్శకత్వంలో పిట్ రెండు సినిమాల్లో నటించాడు. పిట్ హీరోగా జోలీ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సివుంది. ఈ ప్రాజెక్టు చేసేందుకు జోలీ తొలుత ఆసక్తి చూపింది. అయితే ఇటీవల పిట్తో విడిపోవడంతో ఈ ప్రాజెక్టు చేసేందుకు నిరాకరించింది. పిట్తో వ్యక్తిగతంగా కానీ, వృత్తిపరంగా కానీ ఎలాంటి సంబంధాలూ కొనసాగించరాదని జోలీ నిర్ణయం తీసుకుంది. -
ఎంజెలినా జోలీ విడాకులకు కారణం ఇదే..!
లాస్‌ఏంజీల్స్: హాలీవుడ్ హీరో బ్రాడ్‌పిట్ నుంచి ఎంజెలినా జోలి విడాకులు కోరిన విషయం తెలిసిందే. తమ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నందున విడాకులు తీసుకుంటున్నానని సోమవారం కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా ఎంజెలినా వ్యాఖ్యానించారు. 2005 నుంచి అన్యోన్యంగా కలిసుంటున్న వీరి మధ్య ఇంత సడన్‌గా అభిప్రాయ భేదాలు రావడం ఏంటని అభిమానులు తలలుగోక్కున్నారు. అయితే.. ఈ విడాకుల వ్యవహారానికి తక్షణ కారణం మాత్రం బ్రాడ్ పీట్ తన ఆరుగురు పిల్లల్లో ఒకరిపై తీవ్ర కోపంతో అరచి, కొట్టాడమేనట. ఇటీవల ప్రైవేట్ జెట్‌లో వెళ్తున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న బ్రాడ్.. తన పిల్లల్లో ఒకరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడని అందుకే ఎంజెలినా విడాకుల నిర్ణయం తీసుకున్నారని తాజాగా ఓ మీడియా సంస్థ వెల్లడించింది. బాలల హక్కుల చట్టాల కింద బ్రాడ్ పీట్పై విచారణ జరుగుతుందని సమాచారం. అయితే.. బ్రాడ్ పీట్ మాత్రం ఈ విషయంపై తీవ్రంగా స్పందించాడు. తాను తన పిల్లలపై ఎలాంటి హింసకు పాల్పడలేదని, కొందరు కావాలనే తనను చెడ్డవాడిలా చూపించాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో బ్రాడ్ పిట్, ఎంజెలినాలతో పాటు వారి ఆరుగురు పిల్లలను విచారించాలని అధికారులు భావిస్తున్నారు. -
అమ్మాయిలు తప్పు చేయరు: బ్రాడ్‌పిట్
హాలీవుడ్ స్టార్ హీరోగా అంతర్జాతీయ స్ధాయిలో భారీ గుర్తింపు తెచ్చుకున్న బ్రాడ్‌పిట్, తన కొడుకుల విషయంలో మాత్రం ఓ సాధారణ తండ్రిగానే ఆలోచిస్తాడట. చిన్నతనంలో తండ్రి తనతో వ్యవహరించిన తీరు చాలా కఠినంగా ఉండేదన్న బ్రాడ్‌పిట్, తను మాత్రం తన కొడుకులకు క్రమశిక్షణ మాత్రమే నేర్పుతున్నానన్నాడు. సదరన్ బాప్టిస్ట్ కుటుంబానికి చెందిన బ్రాడ్ తన ఫ్యామిలీ విషయాలను వెల్లడించాడు. కొడుకుల విషయంలో క్రమశిక్షణ పాటించే బ్రాడ్, కూతుళ్ల విషయంలో మాత్రం అలా ఉండటానికి ఇష్టపడడట. అమ్మాయిలు సాధారణంగా తప్పు చేయరు. అందుకే వారి మీద ఆంక్షలు విదించాల్సిన అవసరం లేదంటున్నాడు ఈ హాలీవుడ్ స్టార్. 'ఈ ప్రపంచాన్ని వాళ్లకు తెలియజేయటమే నా పని, వారి జీవితంలో వాళ్లు చేయాలనుకున్న పనికి, నేను సాయం చేయాలి. వారికి కావాల్సిన అవకాశాలు అందేలా చూడాలి. వారు తప్పు దారిలోకి వెళుతున్నట్టుగా అనిపిస్తే వారించాలి. తండ్రిగా ఇవే నా బాధ్యతలు.' అంటూ టెలిగ్రాఫ్ మ్యాగజైన్‌తో తన అనుభవాలను పంచుకున్నాడు. అయితే జోలి, తాను డజను పిల్లలు కావాలనుకున్నామని... ఇప్పటికే ఇల్లంతా పిల్లలతో సందడిగా మారిపోవడంతో ఆరుగురితో సరిపెట్టామని వివరించాడు. 51 ఏళ్ల ఈ హాలీవుడ్ స్టార్‌కు ఆరుగురు సంతానం. మడాక్స్ (14), పాక్స్ (11), జహర(10), ఫిలొహ్(9), నాక్స్, వివిన్ని అనే ఏడేళ్ల కవలలు బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలిల పిల్లలు. -
మా బంధం సినిమాలా కాదు
హాలీవుడ్ స్టార్స్ ఎంత త్వరగా ఒక్కటవుతారో అంతే త్వరగా విడిపోతారు. అయితే హాలీవుడ్ సూపర్ స్టార్ ఏంజెలినా జూలీ మాత్రం ఇందుకు మినహాయింపు. తన యాక్షన్ ఇమేజ్‌తో పాటు సోషల్ యాక్టివిటీస్‌తో కూడా ఎప్పుడు వార్తల్లో ఉండే హాలీవుడ్ ముద్దుగుమ్మ ఫ్యామిలీ రిలేషన్స్ విషయంలో కూడా చాలా ఫర్ఫెక్ట్గా ఉంటుంది. తన సహనటుడు బ్రాడ్‌పిట్‌ను పెళ్లాడిన ఈ బ్యూటి అతనితో ఎలాంటి సమస్యలు లేకుండా ఎంతో అన్యోన్యంగా ఉంటోంది. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్న ఈ జంట ఇటీవల ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో కలిసి నటించింది. పెళ్లి తరువాత ఇద్దరు దంపతుల మధ్య వచ్చే సమస్యల నేపధ్యంలో ఓ సినిమాను తెరకెక్కించారు. బై ద సీ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఏంజెలినా జోడి కలిసి నటించటమే కాదు ఆ సినిమాను జోలి దర్శకత్వంలో తమ సొంతం నిర్మాణ సంస్థ ద్వారా తెరకెక్కించారు. అయితే ఇటీవల రిలీజ్ అయిన సినిమా ట్రైలర్ లో భార్య భర్తల మధ్య చూపించిన సన్నివేశాలన మాధిరిగా కాకుండా, వ్యక్తిగతంగా తమ రిలేషన్ ఎంతో ఆనందంగా సాగుతుందని జోలి వివరణ ఇచ్చింది. -
'లైంగిక హింసతో విధ్వంసం సృష్టిస్తున్నారు'
ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఆగడాలపై హాలీవుడ్ నటి యాంజెలీనా జోలీ తీవ్రస్థాయిలో మండిపడింది. వాళ్లు అత్యాచారాలను ఉగ్రవాదానికి కేంద్రస్థానంగా వాడుకుంటున్నారని, వాళ్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో లైంగిక హింసతో విధ్వంసానికి పాల్పడుతున్నారని చెప్పింది. పార్లమెంటు ఉభయసభలకు ఆమె ఈ విషయాలు వెల్లడించింది. నటన ఆమె వృత్తి కాగా, మానవహక్కుల పరిరక్షణ ఆమె ప్రవృత్తి అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఐఎస్ఐఎస్ ప్రాబల్య ప్రాంతాల్లో పర్యటించిన జోలీ.. కనీసం ఏడేళ్ల వయసున్న అమ్మాయిలను కూడా ఆ ముష్కరులు వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. జీహాదీ ఛాందసవాదులు ప్రపంచంలోనే అత్యంత దూకుడుగా ఉన్న ఉగ్రవాదులని, వాళ్లు లైంగిక దాడులను కూడా చాలా సమర్ధమైన ఆయుధంగా వాడుకుంటున్నారని లార్డ్స్ కమిటీకి జోలీ చెప్పింది. ఇరాక్, సిరియాలు కేంద్రంగా సాగుతున్న ఐఎస్ఐఎస్ చేసినన్ని ఆగడాలు ఇప్పటివరకు ఎవరూ చూసి ఉండరని చెప్పింది. వీళ్లకు అత్యాచారాలు చేయడం ఒక విధానంగా మారిపోయిందని, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని.. ఐఎస్ఐఎస్ సంస్థ మీద చాలా బలమైన చర్య తీసుకోవాలని జోలీ కోరింది. 'ద లాండ్ ఆఫ్ బ్లడ్ అండ్ హనీ' పేరుతో తాను తీసిన సినిమా కాపీలను కూడా కమిటీ సభ్యులకు ఇచ్చింది. -
సొంత ఇంటి కోసం హీరోయిన్ కష్టాలు
హాలీవుడ్ స్క్రీన్ మీద స్టార్ హీరోలకు సైతం పోటి ఇచ్చే యాక్షన్ స్టార్, వెండితెర రారాణి ఏంజెలీనా జోలీ. బిగెస్ట్ బ్లాక్ బస్టర్స్‌తో తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ భామ ప్రస్తుతం సొంత ఇంటి కలను నెరవేర్చుకునే పనిలో పడింది. ఇప్పటికే పలు దేశాల్లో ఆస్తులు ఉన్నా.. లండన్‌లో సొంత గూటి కోసం ప్రయత్నిస్తుందట. అయితే జోలీ స్థాయికి భారీ భవనం అందుబాటులో లేదంట. ఈ ఏడాది జూన్‌లో లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ ఏరియాలో ఓ భారీ భవనాన్ని జోలీ దంపతులు సెలెక్ట్ చేశారట. అయితే ఆ భవనం ధర భారీగా ఉండటంతో వారిద్దరూ మరోసారి ఆలోచనలో పడ్డారట. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న జోలి త్వరలోనే యురోపియన్ యూనియన్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టాలని ప్లాన్ చేసుకుంటుంది. అందుకే లండన్‌లో సొంత ఇంటి కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఏంజెలినా ఎప్పటి నుంచో హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్తో కలసి జీవిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆరుగురు పిల్లలతో వారు కాలిఫోర్నియాలోని నివాసం ఉంటున్నారు.