న్యూయార్క్ : హాలీవుడ్ ప్రముఖ నిర్మాత హార్వే వెయిన్‌స్టన్ గురించి మరో బాంబులాంటి విషయం తెలిసింది. పలువురు హాలీవుడ్ నటీమణులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఇప్పటికే దశాబ్దకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఆ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటున్న ఆయన గురించి మరో షాకింగ్ విషయాన్ని న్యూయార్కర్ అనే మేగిజిన్ వెల్లడించింది. వెయిన్‌స్టన్ చేతిలో లైంగిక వేధింపులకు గురైన వారు పదుల సంఖ్యలో ఉన్నారని, వారిలో ప్రముఖ హాలీవుడ్ నటీమణులు ఎంజెలినా జోలి, గైనెత్ పాల్ట్రో కూడా ఉన్నారని ఆ మేగిజిన్ వెల్లడించింది. వారిద్దరు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వెయిన్ స్టన్ సినిమాలో తమ కెరీర్ ఆరంభంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తన లైంగిక వాంఛలు తీర్చాలని వేధించాడని వారు వివరించారు.
దీంతో ఇప్పుడు ఆయనను దాదాపు అంతా అసహ్యించుకునే పరిస్థితి ఎదురైంది. ఇక అమెరికాలో పెద్ద పార్టీ అయినా డెమొక్రటిక్ కూడా షాక్‌కు గురైంది. ఎందుకంటే వెయిన్‌స్టన్ ఎప్పటి నుంచో ఈ పార్టీకి పెద్ద విరాళదాత. ఆయనపై వచ్చే ఆరోపణలు కూడా గతంలో డెమొక్రాట్లు కొట్టిపడేసేవారు. అయితే, తాజాగా ఆయన నిజస్వరూపాన్ని మేగిజిన్ మరోసారి ఆధారాలతో సహా వెల్లడించడంతో ఆ పార్టీకి షాక్ తగిలినట్లయింది. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూతురు మాలియా కూడా ఈయన వద్దే ఇంటర్న్‌షిప్ చేస్తోంది. దాదాపు ఎనిమిదిమందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గతంలో టైమ్స్ వెల్లడించగా ఇప్పుడు ఎంజెలీనావంటి నటీమణులను కూడా ఆయన వదలలేదని తెలియడం, వారు కూడా ఈ విషయం చెప్పడం మూలిగేనక్కపై తాటి పండు పడ్డ చందాన ఆయన పరిస్థితి తయారైంది. దీనిపై హిల్లరీ క్లింటన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలను ఏమాత్రం సహించరాదని అన్నారు.
ఈ నిర్మాత కామాంధుడు.. ఏంజెలినాపై కూడా..
Published Wed, Oct 11 2017 11:41 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment