ఎనిమిదేళ్ల తర్వాత విడాకులు తీసుకున్న ఏంజెలీనా జోలీ | Angelina Jolie and Brad Pitt have finalized divorce after eight years | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్ల తర్వాత విడాకులు తీసుకున్న ఏంజెలీనా జోలీ

Published Tue, Dec 31 2024 12:21 PM | Last Updated on Tue, Dec 31 2024 12:31 PM

Angelina Jolie and Brad Pitt have finalized divorce after eight years

హాలీవుడ్‌ కపుల్స్‌ ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్ విడాకులు తీసుకున్నారు. 2005లో మిస్టర్​ అండ్​ మిస్సెస్​ సినిమా ద్వారా దగ్గరైన ఈ జంట.. తర్వాత చాలా ఏళ్లు డేటింగ్ చేసింది. 2014లో పెళ్లి చేసుకోగా.. రెండేళ్లకే ఈ జంట విడాకులకు దరఖాస్తు చేసింది. 2019 ఏప్రిల్​ నుంచి తాము విడిగా ఉంటున్నట్లు ప్రకటించుకుంది. అప్పటి నుంచి పిల్లల బాధ్యతను ఇద్దరూ చూసుకుంటున్నారు. 

అయితే, విడాకుల తర్వాత పిల్లల బాధ్యత ఎవరిది అనే అంశాన్ని కోర్టుకు తెలపకపోవడంతో ఇన్నేళ్లుగా వారి విడాకులను కోర్టు మంజూరు చేయలేదు. అయితే, ఈ జంటకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. వారు మేజర్‌ అయ్యే వరకు తల్లిదండ్రులు ఇద్దరూ సంరక్షించాలని కోర్టు తెలిపింది. 

మొదటి నుంచి ఏంజెలీనా జోలి తన భర్త బ్రాడ్‌పిట్‌ పట్ల కర్కశంగా ప్రవర్తిస్తూ వస్తోంది. మీడియా మీట్‌లలో బ్రాడ్‌ పిట్‌ పట్ల నిర్లక్క్ష్య వైఖరి, విడాకుల పిటిషన్‌ వంకతో 9మిలియన్‌ డాలర్ల భరణం తీసుకోవడం, తాజాగా పిల్లల కస్టడీకి సంబంధించి డ్రామాతో ఆమె అభిమానులు విసిగిపోయారు. ఈ క్రమంలో బ్రాడ్‌ పిట్‌కు మద్ధతు పెరిగింది. బర్త్‌ డే పార్టీ పేరుతో తండ్రికి పిల్లల్ని దూరంగా తీసుకెళ్లిన సంఘటనలపై జోలి మీద ఫ్యాన్స్‌ ఫైర్‌ అయిన సంఘటనలు కూడా ఉన్నాయి.

ఎంజెలీనా జోలీ 1996లో  బ్రిటిష్‌-అమెరికన్‌ యాక్టర్‌  జానీ లీ మిల్లర్‌ని పెళ్లి చేసుకుని.. 18 నెలల తర్వాత విడిపోయారు. అయితే విడాకులు మాత్రం 1999లో తీసుకున్నారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో అమెరికన్‌ యాక్టర్‌ బిల్లీ బాబ్‌ను ఆమె రెండో పెళ్లి చేసుకుని.. మూడేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఇప్పుడు   బ్రాడ్‌ పిట్‌తో కూడా తన బంధాంన్ని తెంచుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement