సొంత ఇంటి కోసం హీరోయిన్ కష్టాలు | anjelina trying for a new house in london | Sakshi
Sakshi News home page

సొంత ఇంటి కోసం హీరోయిన్ కష్టాలు

Published Sat, Aug 29 2015 12:13 PM | Last Updated on Sun, Sep 3 2017 8:21 AM

సొంత ఇంటి కోసం హీరోయిన్ కష్టాలు

సొంత ఇంటి కోసం హీరోయిన్ కష్టాలు

హాలీవుడ్ స్క్రీన్ మీద స్టార్ హీరోలకు సైతం పోటి ఇచ్చే యాక్షన్ స్టార్, వెండితెర రారాణి ఏంజెలీనా జోలీ.  బిగెస్ట్ బ్లాక్ బస్టర్స్తో తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ భామ ప్రస్తుతం సొంత ఇంటి కలను నెరవేర్చుకునే పనిలో పడింది. ఇప్పటికే పలు దేశాల్లో ఆస్తులు ఉన్నా.. లండన్లో సొంత గూటి కోసం ప్రయత్నిస్తుందట. అయితే జోలీ స్థాయికి  భారీ భవనం అందుబాటులో లేదంట.

ఈ ఏడాది జూన్లో లండన్లోని వెస్ట్ మినిస్టర్ ఏరియాలో ఓ భారీ భవనాన్ని జోలీ దంపతులు సెలెక్ట్ చేశారట. అయితే ఆ భవనం ధర భారీగా ఉండటంతో వారిద్దరూ  మరోసారి ఆలోచనలో పడ్డారట.  ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న జోలి త్వరలోనే యురోపియన్ యూనియన్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టాలని ప్లాన్ చేసుకుంటుంది. అందుకే లండన్లో సొంత ఇంటి కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఏంజెలినా ఎప్పటి నుంచో హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్‌తో కలసి జీవిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆరుగురు పిల్లలతో వారు కాలిఫోర్నియాలోని నివాసం ఉంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement