అమ్మాయిలు తప్పు చేయరు: బ్రాడ్పిట్ | Hollywood hero brad pitt about his children | Sakshi
Sakshi News home page

అమ్మాయిలు తప్పు చేయరు: బ్రాడ్పిట్

Nov 29 2015 12:44 PM | Updated on Sep 3 2017 1:13 PM

అమ్మాయిలు తప్పు చేయరు: బ్రాడ్పిట్

అమ్మాయిలు తప్పు చేయరు: బ్రాడ్పిట్

హాలీవుడ్ స్టార్ హీరోగా అంతర్జాతీయ స్ధాయిలో భారీ గుర్తింపు తెచ్చుకున్న బ్రాడ్పిట్, తన కొడుకుల విషయంలో మాత్రం ఓ సాధారణ తండ్రిగానే ఆలోచిస్తాడట.

హాలీవుడ్ స్టార్ హీరోగా అంతర్జాతీయ స్ధాయిలో భారీ గుర్తింపు తెచ్చుకున్న బ్రాడ్పిట్, తన కొడుకుల విషయంలో మాత్రం ఓ సాధారణ తండ్రిగానే ఆలోచిస్తాడట. చిన్నతనంలో తండ్రి తనతో వ్యవహరించిన తీరు చాలా కఠినంగా ఉండేదన్న బ్రాడ్పిట్, తను మాత్రం తన కొడుకులకు క్రమశిక్షణ మాత్రమే నేర్పుతున్నానన్నాడు. సదరన్ బాప్టిస్ట్ కుటుంబానికి చెందిన బ్రాడ్ తన ఫ్యామిలీ విషయాలను వెల్లడించాడు.

కొడుకుల విషయంలో క్రమశిక్షణ పాటించే బ్రాడ్, కూతుళ్ల విషయంలో మాత్రం అలా ఉండటానికి ఇష్టపడడట. అమ్మాయిలు సాధారణంగా తప్పు చేయరు. అందుకే వారి మీద ఆంక్షలు విదించాల్సిన అవసరం లేదంటున్నాడు ఈ హాలీవుడ్ స్టార్.

'ఈ ప్రపంచాన్ని వాళ్లకు తెలియజేయటమే నా పని, వారి జీవితంలో వాళ్లు చేయాలనుకున్న పనికి, నేను సాయం చేయాలి. వారికి కావాల్సిన అవకాశాలు అందేలా చూడాలి. వారు తప్పు దారిలోకి వెళుతున్నట్టుగా అనిపిస్తే వారించాలి. తండ్రిగా ఇవే నా బాధ్యతలు.' అంటూ టెలిగ్రాఫ్ మ్యాగజైన్తో తన అనుభవాలను పంచుకున్నాడు.  అయితే జోలి, తాను డజను పిల్లలు కావాలనుకున్నామని... ఇప్పటికే ఇల్లంతా పిల్లలతో సందడిగా మారిపోవడంతో ఆరుగురితో సరిపెట్టామని వివరించాడు.

51 ఏళ్ల ఈ హాలీవుడ్ స్టార్కు ఆరుగురు సంతానం. మడాక్స్ (14), పాక్స్ (11), జహర(10), ఫిలొహ్(9), నాక్స్, వివిన్ని అనే ఏడేళ్ల కవలలు బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలిల పిల్లలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement