ఆస్కార్ హీరోకు తప్పిన కారు ప్రమాదం | Leonardo DiCaprio, Nina Agdas car makes crash | Sakshi
Sakshi News home page

ఆస్కార్ హీరోకు తప్పిన కారు ప్రమాదం

Published Mon, Aug 22 2016 10:41 AM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

ఆస్కార్ హీరోకు తప్పిన కారు ప్రమాదం - Sakshi

ఆస్కార్ హీరోకు తప్పిన కారు ప్రమాదం

న్యూయార్క్: కారు ప్రమాదం నుంచి ఆస్కార్ అవార్డు పొందిన నటుడు బయటపడ్డాడు. ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత లియోనార్డో డికాప్రియో ప్రయాణిస్తున్న కారు ఓ చిన్న ప్రమాదానికి గురైంది. ఆయన కారు వెనుక ఓ మినీ కూపర్ తగలడంతో అది స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆయన గర్ల్ ఫ్రెండ్గా ఇప్పటికే వదంతులు వ్యాపించిన నైనా అద్గాల్ కూడా ఉంది.

వీకెండ్ ట్రిప్ లో భాగంగా తన కొత్త గర్ల్ ఫ్రెండ్ తో న్యూయార్క్ సమీపంలోని ఈస్ట్ హాంప్టన్ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన అక్కడికి అంబులెన్స్ కూడా వచ్చింది. అయితే, ఇది స్వల్ప ప్రమాదమే అని వారు చెప్పారు. కాగా, కారు ఢీకొట్టిన సమయంలో వారిద్దరు తమ సీట్లో నుంచి ముందు సీట్లకు తగిలారని, ఆ సమయంలో వేగం తక్కువగా ఉండటంతో పెద్దగా ప్రమాదం జరగలేదని స్థానిక మీడియా వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement