Nina Agdal
-
ఆస్కార్ హీరోకు తప్పిన కారు ప్రమాదం
న్యూయార్క్: కారు ప్రమాదం నుంచి ఆస్కార్ అవార్డు పొందిన నటుడు బయటపడ్డాడు. ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత లియోనార్డో డికాప్రియో ప్రయాణిస్తున్న కారు ఓ చిన్న ప్రమాదానికి గురైంది. ఆయన కారు వెనుక ఓ మినీ కూపర్ తగలడంతో అది స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆయన గర్ల్ ఫ్రెండ్‌గా ఇప్పటికే వదంతులు వ్యాపించిన నైనా అద్గాల్ కూడా ఉంది. వీకెండ్ ట్రిప్ లో భాగంగా తన కొత్త గర్ల్ ఫ్రెండ్ తో న్యూయార్క్ సమీపంలోని ఈస్ట్ హాంప్టన్ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన అక్కడికి అంబులెన్స్ కూడా వచ్చింది. అయితే, ఇది స్వల్ప ప్రమాదమే అని వారు చెప్పారు. కాగా, కారు ఢీకొట్టిన సమయంలో వారిద్దరు తమ సీట్లో నుంచి ముందు సీట్లకు తగిలారని, ఆ సమయంలో వేగం తక్కువగా ఉండటంతో పెద్దగా ప్రమాదం జరగలేదని స్థానిక మీడియా వెల్లడించింది. -
విహారనౌకలో ప్రియురాలితో.. !
లాస్ ఏంజిల్స్: ‘టైటానిక్’ హీరో లియోనార్డో డికాప్రియో మళ్లీ ప్రేమలో మునిగిపోయాడు. తన కొత్త ప్రియురాలి నినా ఆగ్డాల్తో ఆయన ఓ విహారనౌకలో విహారించాడు. ఇబిజాలోని సముద్రతీరంలో వీరు మిత్రులతో కలిసి షికారు చేశారు. 41 ఏళ్ల డికాప్రియో ఇటీవల ‘రెవరెంట్’ సినిమాకుగాను ఆస్కార్ అవార్డు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ ఆనందంలో ఉన్న ఆయన తాజాగా డానిష్ మోడల్ నినాతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు. అయితే, గతవారం డికాప్రియో నిర్వహించిన పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో నినా పాల్గొనలేదు. వీరు జంటగా కనిపించకపోవడంతో వీళ్ల మధ్య అప్పుడే చెడిందా అని వార్తలు వచ్చాయి. అయితే, ఈ రూమర్స్ కొట్టిపారేస్తూ ఈ లవర్స్ తాజాగా నౌకవిహారంలో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేశారు. లగ్జరీ బోటులో సముద్రయానం చేస్తూ ఆనందంగా సాగిన ఈ జర్నీలో డికాప్రియో సన్నిహితులు, మిత్రులు కూడా పాల్గొన్నారు. మొత్తానికి ఈ నౌకవిహారం ద్వారా నినా-డికాప్రియో జంట తమ బ్రేకప్ కాలేదు.. తాము ప్రేమలో మునిగిపోయి ఉన్నామని చాటారు.