విహారనౌకలో ప్రియురాలితో.. ! | Dicaprio, Nina Agdal reunite on luxury yacht | Sakshi
Sakshi News home page

విహారనౌకలో ప్రియురాలితో.. !

Published Tue, Jul 26 2016 12:41 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

విహారనౌకలో ప్రియురాలితో.. !

విహారనౌకలో ప్రియురాలితో.. !

లాస్ ఏంజిల్స్‌: ‘టైటానిక్’ హీరో లియోనార్డో డికాప్రియో మళ్లీ ప్రేమలో మునిగిపోయాడు. తన కొత్త ప్రియురాలి నినా ఆగ్డాల్‌తో ఆయన ఓ విహారనౌకలో విహారించాడు. ఇబిజాలోని సముద్రతీరంలో వీరు మిత్రులతో కలిసి షికారు చేశారు. 41 ఏళ్ల డికాప్రియో ఇటీవల ‘రెవరెంట్’ సినిమాకుగాను ఆస్కార్ అవార్డు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ ఆనందంలో ఉన్న ఆయన తాజాగా డానిష్ మోడల్ నినాతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు.

అయితే, గతవారం డికాప్రియో నిర్వహించిన పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో నినా పాల్గొనలేదు. వీరు జంటగా కనిపించకపోవడంతో వీళ్ల మధ్య అప్పుడే చెడిందా అని వార్తలు వచ్చాయి. అయితే, ఈ రూమర్స్ కొట్టిపారేస్తూ ఈ లవర్స్ తాజాగా నౌకవిహారంలో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేశారు. లగ్జరీ బోటులో సముద్రయానం చేస్తూ ఆనందంగా సాగిన ఈ జర్నీలో డికాప్రియో సన్నిహితులు, మిత్రులు కూడా పాల్గొన్నారు. మొత్తానికి ఈ నౌకవిహారం ద్వారా నినా-డికాప్రియో జంట తమ బ్రేకప్ కాలేదు.. తాము ప్రేమలో మునిగిపోయి ఉన్నామని చాటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement