'ఆ హీరోని ఒప్పించడం అంత తేలిక కాదు' | DiCaprio takes acting projects seriously: Baz Luhrmann | Sakshi
Sakshi News home page

'ఆ హీరోని ఒప్పించడం అంత తేలిక కాదు'

Aug 12 2016 5:46 PM | Updated on Sep 4 2017 9:00 AM

'ఆ హీరోని ఒప్పించడం అంత తేలిక కాదు'

'ఆ హీరోని ఒప్పించడం అంత తేలిక కాదు'

ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియోను ఒక చిత్రానికి ఒప్పించడం అంత తేలికైన పనికాదని ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు బజ్ లార్మన్ చెప్పారు.

లాస్ ఎంజెల్స్: ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియోను ఒక చిత్రానికి ఒప్పించడం అంత తేలికైన పనికాదని ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు బజ్ లార్మన్ చెప్పారు. డికాప్రియాతో 1996లో రోమియో జూలియట్, 2013 ది గ్రేట్ గ్యాట్స్బై అనే రెండు చిత్రాలకు లార్మన్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సినిమాలు ఎంపిక చేసుకునే విషయంలో డికాప్రియో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడని అన్నారు.

ఆయన ముఖ్యంగా ప్రకృతి ప్రేమికుడని, పర్యావరణానికి ఇబ్బంది కలిగించే అంశాలున్న కథలకు ఆయన ససేమిరా ఒప్పుకోడని, అది ఆయనకు మాత్రమే ఉన్న గొప్ప ఆలోచన అని కొనియాడారు. నిర్ణయాలను అంత తేలికగా తీసుకోడని ఆచితూచి అందరికీ మంచి జరుగుతుంది అనుకుంటేనే ఆ సినిమాకు ఒప్పుకుంటాడని, తన చిత్రం ద్వారా పర్యవరణానికి ఎలాంటి హానీ జరగదని భావిస్తేనే అంగీకరిస్తాడని తెలిపారు. అందుకే తనకు ఎన్నిసార్లయినా సినిమా తీసేందుకు సిద్ధంగా ఉంటానని, మా ఇద్దరి ఆలోచనలు కూడా దాదాపు సమీపంగానే ఉంటాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement