ఒక్క నిమిషంలో 4 లక్షల ట్వీట్లు | Oscar Winner leonardo DiCaprio's Tweet Record | Sakshi
Sakshi News home page

ఒక్క నిమిషంలో 4 లక్షల ట్వీట్లు

Published Tue, Mar 1 2016 10:39 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM

ఒక్క నిమిషంలో 4 లక్షల ట్వీట్లు

ఒక్క నిమిషంలో 4 లక్షల ట్వీట్లు

23 ఏళ్ల నిరీక్షణ తరువాత కల నిజం చేసుకున్న హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో, అదే రోజు మరో అరుదైన రికార్డ్ సృష్టించాడు. 'ద రివెనెంట్' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్న డికాప్రియోకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 88వ అకాడమీ అవార్డ్స్ ఫంక్షన్లో ఉత్తమ నటుడిగా డికాప్రియో అవార్డ్ అందుకున్న మరుక్షణం ఆయన ట్విట్టర్ పేజ్పై భారీ సంఖ్యలో విషెస్ పోస్ట్ అయ్యాయి.

ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం)జరిగిన అవార్డ్ వేడుకల్లో ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డ్ను అందుకున్నాడు డికాప్రియో. అవార్డ్ ప్రదానం అయిన తొలి నిమిషంలోనే ఏకంగా 4 లక్షల 40 వేల శుభాకాంక్షల పోస్ట్లు వచ్చాయి. ఆ తరువాత ఉత్తమ చిత్రాన్ని ప్రకటించిన తరువాత కూడా ఇదే స్థాయిలో శుభాకాంక్షల ట్వీట్లు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement